పోస్టులు అభిప్రాయాలు 08 February 2012

సంపాదకీయం సోయి | 05 డిసంబర్ 2006 01:54 pm

అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు

కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని మోసం చెయ్యటానికే సిద్ధపడింది. పూటకో మాట, రోజుకో వేషం పుణ్యకాలం నైపుణ్యంతో వెళ్లదీస్తున్నది. తెలంగాణ చెయిజారి అధికారం పోతుందనేసరికి ఆంధ్రావలస సామ్రాట్టులకు కంపరం మొదలైంది. `అధికారాంతమున చూడవలె…’ అన్నరు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని వక్రీకరణలు, ఎన్ని అనునయింపులు. పాలకులు తమవిద్యలన్నీ ప్రదర్శిస్తున్నరు.

తమ ప్రభుత్వం తెలంగాణకు అభివృద్ధి చేస్తున్నది గనుక ఇక తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని ఒకసారి, తెలంగాణ వాదం పిడికెడు మందిలోనే ఉన్నది, అది త్వరలోనే కనుమరుగవుతుందని ఒకసారి, మరోసారి తామూ తెలంగాణ వాదులమేనని, తమ పార్టీ ద్వారానే తెలంగాణ వస్తదని సమయం వచ్చినపుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతదని కొంటెవాదాలు చేస్తున్నరు. సరే- ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే చెప్పరు. ఎప్పుడు సమయం వస్తుందో చెప్పమంటే చెప్పరు. ఏకాభిప్రాయమంటే ఏమిటో చెప్పరు. ప్రత్యేక తెలంగాణ పట్ల పార్టీ అభిప్రాయం స్పష్టంగా చెప్పమంటే చెప్పరు. పదవి విడువరు. పెదవి విప్పరు. తెలంగాణ ప్రజల్ని గందరగోళంలో ముంచెతందుకే గడికో తీరు మాట్లాడుతున్నరు. తెలంగాణ ఆకాంక్షలను కాటగలపటానికే వాళ్లు బదులుకున్నరు.

భూములు గుంజుకొనుడు, అమ్ముకొనుడు తప్ప ప్రాజెక్టుల పేర్లు జెప్పుడు పైసలు దండుకునుడు దప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఊళ్లు ముంచుడుదప్ప ఉద్ధరించ్చిందేమీ లేదు. అభివృద్ధికీ ఆత్మగౌరవానికీ వైరుధ్యం లేదు. తెలంగాణ వాదంలో అభివృద్ధి ఒక అంశం. వెనుకబాటు తనానికి ఒక పరిష్కారమే. మరి - యాభయి యేండ్ల వివక్ష సంగతేమిటి? వనరుల దోపిడీ సంగతేమిటి? ఒప్పందాల ఉల్లంఘన మాటేమిటి? అవమానాల పరంపరలేమిటి? అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు. తెలంగాణ ప్రజలు స్వయం నిర్ణయాధికారం అడుగుతున్నరు. అధికారం లేని అభివృద్ధి, ఆత్మగౌరవం ఇవ్వలేని అభివృద్ధి ఎవరికి ఏం చేస్తుందో విప్పి చెప్పుతున్నరు.

అభివృద్ధి అంటే `పోలవరం’ పేరుతో మరోసారి నీళ్లు దొంగిలించుడా? అభివృద్ధి అంటే గిరిజన గ్రామాలు ముంచుడా? తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలయిన భద్రాచలం, పర్ణశాలలు ముంచుడంటే ఏమిటి? తెలుగు చరిత్రకు తెలంగాణ చరిత్రకు మూల స్థావరమైన `కోటిలింగాల’ ముంచి ఎల్లంపల్లి కడతమంటే ఏమన్నట్టు? దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్టించి ప్రజాబాహుళ్యం కొలిచే మైసమ్మ, పోశమ్మలను చులకన చేసుడేంది? ఊర్లను ముంచే, మనుషుల్ని ముంచే, దేవుళ్లను, చరిత్రను ముంచే అభివృద్ధి ఎక్కడిది?

అభివృద్ధి ముఖ్యమే ఆత్మగౌరవం ముఖ్యమే. తెలంగాణ తెగించి నడిచెతందుకే సిద్ధమయింది. హోళీ ఆడొద్దంటే మరింత ఘనంగా హోళీ ఆడుతం. బతుకమ్మ కళారూపమే కాదంటే భాగ్యనగరం నడికేంద్రంల ఆడుతం. బ్రహ్మాండం బద్దలయినా భద్రాచలం కాపాడుకుంటం. కోటి లింగాల కోసం కొట్లాడుతం. ఆడిన మాట తప్పిన అబద్ధపు రాజుల ముచ్చట్లు కథలు కథలుగా చెప్పుతం. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటం.

3 అభిప్రాయాలు

  1. on 03 జనవరి 2007 at 3:25 am 1.Umesh Earla

    Its a good start

    go ahead for a social cause of Telangana

  2. on 09 జనవరి 2007 at 9:21 am 2.Chithari Anjaneyulu

    చాలా బాగున్నది. మీ క్రషికి జొహర్లు.

  3. on 16 జూన్ 2007 at 5:57 pm 3.ramulu

    మిత్రులార,
    తెలంగాణలోఉంది కాబట్టే భద్రాచలమ్ దేవస్తానాన్ని ఏమాత్రం అభివ్రుద్ధి చేయలేదని ఇప్పుడిప్పుడే అర్ధమఔతున్నది.పోలవరమ్ తోటి భద్రాచలమ్ రామునికి ఇప్పుడు మరింత ముప్పు ఏర్పడింది.ప్రభుత్వంపైన పోలవరంగురించి కేసులువేసినా దాన్ని కట్టడానికే ప్రయత్నిస్తున్నది.ఇక రాముడే తనను తాను రక్షించుకోవాలి.
    మన ఉద్యమంపై ఇప్పుడు సినిమాల దాడి కూడా మొదలయ్యింది.వాటిని కూడా మనకున్న అన్ని వేదికలను ఉపయోగించుకుని తిప్పికొట్టాలి.

    ఒక సినిమాకు “ఎ” సర్టిఫికట్ ఇవ్వబడిందంటే అందులో పిల్లలు చూడగూడని అశ్లీలమైన ,అసభ్యకరమైన ద్రుశ్యాలున్నాయని అర్ధమయ్యేది. ఐతే ఇప్పుడు వివాదాస్పదమైన రాజకీయ సమస్యలున్నప్పుడు వాటిని కూడా 18 సంవత్సరాలు రాని వాళ్ళు చూడగూడదని “ఏ” సర్టిఫికేట్ రూల్స్ చెప్తున్నట్లు అర్ధమౌతున్నది. అసలు “ఆపరేషన్ ధుర్యోధన” సినమాను పూర్తిగ బాన్ చెయ్యాల్సి ఉండగా
    సెన్సార్ వారు 41 కట్టింగులు/కత్తిరింపులు చేశారు ,కనుక మీరు గోల పెట్టకండి అని తెలంగాణ వాళ్ళకు కొందరు సలహా ఇస్తున్నారు.తెలంగాణవారి ఓపికను,రాజకీయ తెలివిని పరిక్షించే,తెలుగు భాషపైన తెలంగాణ వారికి ఉన్న ఆకాస్త అభిమానాన్ని ఫొగొట్టే ఇటువంటి సినిమాలకు నిజానికి ఏప్రాంతం వారు కూడా మద్దతు ఇవ్వకూడదు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలకు,విధ్యార్ధులకు తమకు జరిగిన అన్యాయాలు అర్ధమౌతున్నయి.610 జీ ఓ అమలైతే పోయిన మొత్తం ఉద్యోగాలు రాకున్నా కొన్ని వేల ఉద్యోగాలైనా తమకొస్తాయని తెలంగాణ విధ్యవంతులు ఆశిస్తున్నారు. ఇది ఏకెసీఆరో మరోనాయకుడొ రెచ్చగొట్టడం వల్ల మాత్రమే అడుగుతలేరు,కాకుంటే అడిగే తెలివి/ధైర్యం ఇప్పుడు మాత్రమే కూడగట్టుకున్నారు.ఆర్డిఎస్ లో మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు కూడా ఇప్పుడే తమ వాటాను ఉద్యమం వల్లనే అడిగేధైర్యం చేస్తున్నరు.జరిగిన అన్ని అన్యాయాలు వెలుగులోకి వచ్చివుంటే తెలంగాణలో ఉన్న అన్ని మతాలవారు,కులాలవారు,అన్నివర్గాలవారు ఎప్పుడో ఏకం ఐవుండే వారు.అలా ఏకం ఐవుంటే ఈసినిమాను చూసివుంటే అగ్నిగోళాలే ఐవుండే వారు.ముందే వంటినిండ పుళ్ళతో,గాయలతో భాధతో ఉన్నవారికి ఇటువంటి సినిమాలు తీస్తే,చూపితే వాటిమీద కారం పూసినట్ట్లుగా ఉండదా? గూప్ప, గొప్ప కథలు డైలాగులు రాశే పోసానికి అది అర్ధం కాక కాదు.వయ్యెస్సార్ రాజకీయాల్లో చూపుతున్న మొండి,వెటకారపు వైఖరి లాంటిదే “ఆపరేషన్ ధుర్యధన” సిన్మాలో పొసాని చూపింది కూడా.కేసీఆర్ ,నరేంద్రల మధ్య వచ్చిన తగవును అదునుగాచుసుకొని పోసాని ఈసినిమా తీసినట్లున్నాడు/విడుదల చేసినట్లున్నాడు.త్లంగాణ ఉద్యమాన్ని,ఉద్యమకారులను కించపరచడానికే పోసాని ఈచిత్రం తీసిఉంటాడని చాలామంది తెలంగాణ వారికి సులభంగానే అర్ధమైఉంటుంది ఈపాటికి. ఐతే సరైన సమయంలో ఇటువంటివి తీస్తున్న వాళ్ళకు,వాటిలో నటిస్తున్న వాళ్ళకు మొత్తం సినిమా రంగానికి కూడా తెలంగాణ వాళ్ళు తగిన విధంగా బుద్ధి చెబుతారు.సెన్సార్ వారు కత్తెర వేసినా వెయ్యకపోయినా ముందు,ముందు తెలంగాణ ప్రేక్షకులే వీటిని కత్తిరిస్తారు. ఇటువంటి తమ ప్రాంతానికి వ్యతిరేకంగ సినిమాలు తీస్తే తెలంగాణలో కనుక రాళ్ళు మాత్రమే థియేటర్ల పైన పడ్డాయి,అదేగనుక రాయలసీమలో గనుక ఐవుంటే బహుశ్: బాంబులే పడివుండేవి.
    అసలు సెన్సారు బోర్డులో తగినంత సినిమ పరిజ్ఞానం ,తెలంగాణ్ సమస్యల పట్ల కనీస అవగాహన ఉండివుంటే ఈసినిమా విడుదలయ్యేదే కాదు. సినిమాలపై ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకొన డానికి ఒకప్పుడు బోర్డుకు ఒక రహస్య ఏజెన్సీ ఉండేదట,ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడం అవసరమేమో అనిపిస్తున్నది.బహుశ: దానికొరకు కూడా పోరాటం చెయ్యాల్సి ఉంది .
    -రాములు .

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో