పోస్టులు అభిప్రాయాలు 07 February 2012

గల్పిక సోయి | 02 డిసంబర్ 2006 01:35 am

కుతికె

- అనిశెట్టి రజిత

 ‘ఒక్కనాటిదా ఒక్కేటిదా… రోజు సచ్చెసావుకు దినదినం సాకులెందుకు… సోకాలెందుకు’… తనలో తను మాట్లాడుకోబోయి జర పెద్దగనే ఇంటిపక్కపొంటున్న కాలిబాటల కెల్లి పోయేటోల్లకు వినిపించే తీరుగనే అంటున్నాడు సత్తెయ్య.

 అప్పుడే రోడ్ మీదికి బోయెటందుకు వస్తున్నరమేశు, జంగయ్యలిద్దరు సత్తెయ్యమాటలు. చెవునబడి ఒకరిమొకాలొకరు జూసుకొని ముసి ముసిగ నవ్వుకుంట `ఎవల గురించి సామెతలు జెప్తున్నవే సత్తెయ్యమావా `అనుకుంట సత్తెయ్య కుర్చున్నగద్దె దగ్గరికి నడిచిన్లు.

 ‘నవ్వులాట అయితాందరా పిలగా, మీకేం ఎరుకరా అన్ని డిల్లేకి అనుకుంటరు… మేవు జూసినంత దునియ చూసిన్లా మీరు.. ఓ .. ఎన్ని చూసినం.. ఎన్ని ఇన్నం .. ఈ పాడు బతుకుల’ అని జరంత బొంగురువారుతున్న కుతికె సరాయించుకుండు. అట్ల ఎదన్నలోతు ముచ్చట మాట్లేడేటప్పుడు బాధతోటో… తట్టుకొలేని ఉద్వేగం తోటో గని సత్తెయ్య మావకు కుతికెబడినట్లయితదని ఉల్లె అందరికి తెలిసినసంగతె,.

 ‘మావ గుక్కెడు మంచినీల్లు తాగి అసలు సంగతేందో చెప్పవె ఇయ్యాల నువు జెప్పింది ఇనే టౌనుకుపోతం… ఆడ ఇంకోగంటకు మన పాల్లోలు లొల్లి జేత్తరంట … ఇగ మన తెలంగాన వత్తదంటనే’ అని రమేశ్ అంటుండగనే…

 ‘వారీ వయసు పిలగా… నమ్ముతున్నవా బిడ్డా… గట్లలొల్లి! ఎన్ని మాట్ల తాటాకు మంటోలె లేవలేదు… సప్పున సల్లారలేదు. ఏం దక్కింది కండ్లల బూడిద బడి మంటబెట్టింది గని … ఇంటున్నవా జంగా… అర్వై ఏండ్ల ససంత్రంల మనం చూసినంతట్ల …తెలుసుకున్నంతట్ల దేశం ఏం బాగుపడింది..? దేశంల ఎవలు బాగుపడింలు…?’

 ‘గట్లనే ముప్పైఏండ్ల పైన తెలంగాన కొట్లాట.. ఏరుబాడే ఆరాటం జూత్తుంటిమి… మీరంటె `జై తెలంగాన’ లొల్లి అయినంక పుట్టినోల్లు… నేను… నాతోటోల్లు `జై తెలంగాన’ల మునిగి తేలినోల్లం… ఆనాటి సంది గీనోటి దాంక మేము బతకున్న పీన్గలంరా బిడ్డా’… గానాడు కాల్లురెక్కలిరిగి, మన్సుదెబ్బతిని కుతికెబడితె గిన్నేండ్ల సంది గట్లనే సావుబతుకు బత్కుతానం’ దుక్కంతోటి మాట ఎల్లక బరువై మల్ల సత్తెయ్య మావకు కుతికె బిగుసుక పోయినట్లైతాంది.

 గాబ్రపడ్డ రమేశు ‘సైసే మావ జర .. ఎవలకు లేని గోస నాకేనా… అత్తా మంచినీల్లుతే మావకు కుతికె బడది’ అని ఇంట్లకు కేకేసిండు… ‘వాళ్ళకేంది మారాజులు… దులుపుకొని పోతరు… దుమ్ముగొట్టి దూరం ఉర్కుతరు… నడుమ నీకు నాకే పట్టిందాన్య్యమనాది’ అని నోరెత్తి మాట్లాడుకుంట సత్తెయ్య భార్యసులోచన మంచినీల్లు తెచ్చి తాపించింది.

 మల్లయ్య మావ నీల్లు తాగి కుతికె సరాయించుకున్నాడు. సులోచన లోపలికి పోంగనే ‘మీ అత్త ఏడ్పు మీ అత్తది… పాపం ఎడ్డిది.. గీపాడు కండ్లు ఇంకెన్ని ఎన్నుపోట్లు సూడాల్నో … ఎన్ని ఇసపుగడ్డలు మింగాల్నో … ఎన్ని బాగోతాలాటలు ఆడాల్నో … లోచనవ్వా ఇట్లచ్చి కూసోరాదె… ఇంట్ల సగబెట్టుడు సాలుతియ్… రావ్వా’ అని భార్యను కేకేసి’ వారీ జంగా… రమేశు… మీ కిద్దరికి గీ జంగయ్య పేరు ఎందుకు ఎట్లని పెట్టిన్లో ఎరికేనా…? మీకెవలు జెప్పిన్లుగని… `జంగయ్య నాయిన లింగయ్య పెద్దకొడుకు అంటె జంగని అన్న గప్పుడు పట్నంల కాలేజీల చదువుతుండె… `జై తెలంగాన’ లొల్లి రెండేడ్లల్ల ఓపారి జరిగిన కాల్పులల్ల సుధాకర్ గుండుతగిలి సచ్చిపోయిండు… మనం అమరుడంటం కాదుర.. లింగయ్య మల్లికాంబలు మన్సులు కాలేదు.. ఊరంత ఏడ్సింలు.. పదారేండ్ల సుధాకర్ పోయినంక ఏడాదికె ఇగో గీడు పుట్టిండు… అచ్చం సుదిగాని తీర్గనే ఉన్నడు. గప్పుడు మనూరికొచ్చిన తుర్కసారు ఒకాయమన గీనికి జంగయ్య అని పేరు పెట్టించిండు… సుధాకర్ తెలంగాన జంగ్‌ల అమరుడయ్యె కద వాని తీర్గ ఉన్న జంగయ్యకు పేరట్ల వచ్చింది. ఎరుకైందా బిడ్డా’ అన్నాడు.

 నా పేరెనుక గింత కతున్నదా అని `జంగయ్య…గీని పేరు గిట్లొచ్చిందా అని రమేశు నోరితెరిసి, బీరిపోయి.. గుడ్ల నీళ్ళు కుక్కుంట ‘మావా’ అని సత్తెయ్య చెరో భుజం మీద తలకాయబెట్టి ఏడ్సింన్లు. సత్తెయ్యకు సుత లావు ఏడుపొచ్చింది. ఊకోన్లి బిడ్డా.. గిట్ల ఎన్ని కతలున్నయనుకున్నరు. నా కడుపుల మన తల్లికడుపుల అని కుతికెల రాయిరికినట్లు మౌనంగ తల్లడిల్లబట్టిండు… సులోచన సుత కొంగు మొకాన అద్దుకొని ఏం యాదికొచ్చిందో గని జరసేపు ‘ఓ నాయినో… ఓ అవ్వో’.. నా దేవుడో’ అని శోకాలు బెట్టింది.

 ముందుగాల్ల తేరుకున్న సత్తెయ్య.. ‘యే లోచనవ్వ నువ్వుండే… ఇంట్లకు పో… జర పొల్లగాండ్లకు నాకు చాయ్ తేపో… బెంగటిల్లిండ్లు గేల్లు’ అని లోచననను లేపి.. వారి చిన్న పోరల తీర ఎందిరా గిది… మీకు సంగతులు తెల్వాల్నని జెప్పిన… లెవ్వుండ్లి బాయిమీదికి బోయి నీల్లు చేదుకొని మొకాలు కడుక్కోపోండ్లి… మీ అత్త చాయ్ తెస్తది… తాగి టౌన్ల లొల్లికాడికి పోండ్లి బిడ్డా… యాల్లయితౌంది’ అని ఏగిరపర్సిండు… గంతకన్న ఏం జేత్తడు సత్తెయ్య… ఆయిన మెత్తటి మన్సున్న, బుద్ధి గ్యానెమున్న సత్తెంగల మనిసాయె.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో