కవితలు సోయి | 02 మార్చ్ 2007 02:50 am
ఆళ్వారూ ! ప్రజల పోరు !
- గింజల నరసింహారెడ్డి
ఆళ్వారూ ! వట్టి కోట
ఆళ్వారూ ! ప్రజల పోరు !
తెలంగాణ వైతాళిక
జలదాల్లో ఒక్కడవై
మీర్ మాకరువును కూల్చే
చైతన్యపు వానకారు.
గ్రంథాలయ మహాగర్జ
గా సాగిన సింహమా !
వందనాలు నీకు జ్ఞాన
గంధకార్య రంగమా !
కృషి గిరీంద్ర శృంగమా !
దేశోద్దారక గ్రంధ
మాలా జ్వాలా ! రచయిత
లకు సహాయ కరోజ్వలా !
ప్రచురణ సంస్థాసూర్యుడు
ప్రభవించిన బ్రతుకు నీది,
సామాన్య ప్రజలకు జ్ఞాన
శక్తికి ప్రచురణలు నీవి
జన విముక్తి స్పృకు పర్వి
ప్రప్రధమం పౌరహక్కులకు
పాదం కదల్చినవ్
తెలంగాణలో - కదన
ధ్వనిగా చరియించినావు,
హృదికార్యమ్మైనోడవు.
వ్యథల ఎడారిలో సలిపి
నావాళ్వార్ ! నీవు పోరు
ఒంటెల బిడారు బిడారు.
నగర కేంద్ర గ్రంధాలయ
గగన సూర్యుడౌనౌనీ
సూచి గ్రంథాలయం !
కేంద్ర గ్రంథాలయమ్ము
పేర్ కావాలె ఆళ్వారు
స్వామి గ్రంథాలయం !
నీ విగ్రహమే అక్కడ
నిల్పితే - అది ఔ జీవన్
మణి ప్రభా ఘనహారం !
ఆంధ్రమహాసభగ, వివిధ
సంఘాల్, స్టేట్ కాంగ్రెస్, కా
మ్రేడ్స సోషియేషన్,
కమ్యూనిస్టు పార్టీ గతులుగ
ప్రజాకార్య ప్రభంజన
ప్రౌఢ జీవన ధ్వానా !
అసంఘటిత కార్మిక రం
గాలకు సంఘాలు హక్కు
లందించ్చుట, కింక ‘ప్రజల
మనిషి’ సుగంధాల్ పంచుట
కైదార్ దశాబ్దులకు ముందే
కదిలిన మందానిల !
శత్రులపై ఝంఝానిల !
నీ స్మృతి తెలగాణకళ !
జాగృతి వాహిని గల గల !



