పోస్టులు అభిప్రాయాలు 08 February 2012

కవితలు సోయి | 02 మార్చ్ 2007 02:57 am

అందుకో జోహార్లు! వట్టికోట ఆళ్వారు

- ఎస్. నర్సిరెడ్డి
ఎల్.పి (టి) జిల్లాపరిషత్ హైస్కూల్, మాదారం (కలాన్)

అందుకో జోహార్లు వట్టికోట ఆళ్వారు
మా మాదారం గ్రామ ప్రజల నీరాజనాలు
మమతల కోవలె లాంటి మాదారంలో పుట్టి
గౌరారం మండలానికే గౌరవాన్ని తెచ్చిపెట్టి
నల్లగొండ జిల్లాకే నజారానగా మారి
తెలంగాణాకే గొప్ప వైతాళికుడయ్యావు ||అందుకో||

ప్రజల మనిషి నవల రాసి జనుల హృదిలో నిలిచి
మట్టిమనిషిగా పుట్టి గట్టి పనులెన్నో చేసి
పట్టుదలతో గోల్కొండ నవాబును ఎదిరించి
తెలంగాణ ప్రజల తెగువను చూపించినావు ||అందుకో||

అయ్యగారుగా పుట్టి, ఆళ్వారుగా పోరాడి అమరుడవయ్యావు
నా తెలంగాణ కోటి రతనాల వీణయని జైలుగోడలపై రాసి
అగ్నిధారను అంకితంగా పొంది ఆదర్శంగా నిలిచి
పల్లెపల్లెకు తిరిగి సాహిత్యపు వెల్లువగా మారినావు ||అందుకో||

మాదారం గ్రామంలో మళ్ళీ జన్మిస్తావా
నల్లగొండ జిల్లాలో నదివై ప్రవహిస్తావా
తేనెలాంటి తెలుగుకవితై కనిపిస్తావా
తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వస్తావా ||అందుకో||

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో