పోస్టులు అభిప్రాయాలు 04 February 2012

కళాకారులు సోయి | 02 మార్చ్ 2007 01:54 am

మన చితక్రారుడు : మనోజ్ఞ చిత్రకళాస్రష్ట, కళాతపస్వి మన కొండపల్లిశేషగిరిరావు

- దేవులపల్లి ప్రభాకరరావు

సరసరేఖాచిత్ర సాహిత్యమును గూర్చు
నీదుకుంచియకభివాదమయ్య
అప్పరసల భువిని కవతరింపగజేయు
మాంతిక్రానీకు నమస్సులయ్య
విమల వేదాంత సద్వీధుల విహరించు
బహ్మ్రజ్ఞ నీకివే పణ్రతులయ్య
అమల సంగీతసుదాంబోధిలో తేలు
ఆర్యావర్యానీకు ఐదు పదులు…

ఎవరీ మాంత్రికుడు? ముప్పయి సంవత్సరాల కిందట ముగ్గురు సుప్రసిద్ధ కవీశ్వరులు దాశరథి, సి.నారాయణరెడ్డి, బిరుదురాజు రామరాజు ఏకకంఠంతో ఆశువుగా పలికిన ఈ పద్యంలో ప్రశంసలుపొందిన మాంత్రికుడు మన కొండపల్లి శేషగిరిరావు. వివిధ వర్ణ రంజితమయిన కుంచెను మంత్రదండంగా మార్చి అనితర సాధ్యమయిన అత్యంత రమణీమయిన సుందరలోకాలను సృజించిన ప్రఖ్యాత చిత్రకళాకారుడు శ్రీ శేషగిరిరావు. లలితమయిన గీతలతో చిత్రకళా గీతను ప్రబోధించిన, ప్రవచించిన ఆచార్యుడు ఆయన. రసమయ రేఖలతో, రంగుల కుంచెలతో మంజుల రవాలను ధ్వనింపజేసిన, మనోజ్ఞ దృశ్యాలను సాక్షాత్కరింపజేసిన ఘనత ఆయనది.

అఖిలాంధ్రావనిలో, అఖిలభారత స్థాయిలో బహుళ ప్రశంసలు పొంది అపార యశస్సును ఆర్జించిన అసాధారణ చిత్రకళాకారుడు శేషగిరిరావు. ఎల్లలులేని చిత్రకళారంగంలో ఆయన స్థానం సమున్నతమయినది, విశిష్టమయినది. వివిధ చిత్రకళారీతులలో గడచిన అరవయి సంవత్సరాల కాలంలో శేషగిరిరావు ప్రదర్శించిన అద్వితీయ సృజనాత్మక వైదుష్యం, నైపుణ్యం, వైవిధ్య విన్యాసం, విలాసం అచ్చెరువు కల్గిస్తాయంటే అత్యుక్తికాదు. ఆధునిక చిత్రకళానిష్ణాతుడుగా, దురంధరుడుగా శేషగిరిరావు గత ఆరు దశాబ్దాలలో అనేక బహుమతులను, అవార్డులను, ప్రశంసాపత్రాలను, గౌరవాలను, సత్కారాలను, సన్మానాలను, సహృదయ పూర్వక అభినందనలను అందుకున్నారు. 1996 నవంబర్‌లో తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటుతో సన్మానితుడయిన శేషగిరిరావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ 2003 ఆగస్టు 1వ తేదీన హంస అవార్డుతో సత్కరించాయి. జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గూడ అంతకన్న ఉన్నతమయిన,ఉత్క్పుష్టమయిన అవార్డులకు, సత్కారాలకు అన్ని విధాల అర్హుడయిన చిత్ర కళాప్రతిభా సంపన్నుడు శేషగిరిరావు. ఇటీవల ఆయన సహస్ర చంద్ర దర్శనమహోత్సవం హైదరాబాద్ నగరంలో స్వగృహంలో ఘనంగా జరిగింది. ఆయన అభిమానులందరికి ఇది అత్యంత ఆనందదాయకం.

చిత్రకళారంగంలో ఆరితేరిన వృద్ధమూర్తి శేషగిరిరావు, 2007 జనవరి 27వ తేదీన ఎనభై మూడు సంవత్సరాలు నిండి ఎనభయి నాలుగవ వసంతంలో అడుగుపెట్టారు. ఆయన అభిమాన కోటికి, చిత్రకళా ప్రియులకు ఇది ఆనంద సమయం. ఎనభయి మూడు సంవత్సరాల సుదీర్ఘ జీవనయాత్రంలో ఆయన ఎన్నో కష్టాలను, అడ్డంకులను, అవరోధాలను ధైర్యసాహసాలతో, ధృఢ సంకల్పంతో ఎదుర్కొన్నారు. లక్ష్యసాధనకు వజ్రసంకల్పంతో ముందుకు సాగి, స్వయంకృషితో సుమున్నత శిఖరాలను అధిరోహించిన చిత్రకళాతపస్వి శేషగిరి రావు. నిన్న మొన్నటి వరకు ఆయనకుంచె ఆగలేదు. ఆయన విశ్రాంతి ఎరుగనికళారాధకుడు.అందమయిన, స్నిగ్ధమయిన రేఖలతో, మనోహరమయిన రంగుల మిశ్రమాలతో సుందర చిత్రాలను, మనోజ్ఞ దృశ్యాలను సృష్టిస్తూ ఆయన చిత్రకళా సరస్వతికి అమూల్య ఆభరణాలను సమకూర్చారు. మొదటి నుంచి సామాజిక స్పృగల స్వాతంత్య్ర ప్రియుడు శేషగిరి రావు, ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. నాడు విద్యార్ధి దశలో నిజామ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ధ్వజమెత్తిన శేషగిరిరావు ఆ నిరంకుశపాలనకు, తెలంగాణ స్వాతంత్య్ర సమరానికి సజీవ ప్రతీకలయిన కళాత్మక చిత్రాలను శక్తివంతమయిన తమ కుంచెతో రూపొందించారు. భావితరాలలో ఉత్తేజాన్ని, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగుల్కొలిపే మహత్తర చిత్రాలు అవి.

కాకతీయ ప్రాభవానికి, కళాసంపదకు నిలయమయిన వరంగల్ జిల్లా, మానుకోట సమీపాన పెనుగొండ గ్రామంలో 1924 సంవత్సరం జనవరి 27వ శేషగిరి రావు జన్మించారు. ఆయన తల్లితండ్రులు రామచూడమ్మ, గోపాలరావు. మానుకోటలో ఏడవతరగతి పూర్తి చేసిన తరువాత ఆయన హనుమకొండ వచ్చి కాలేజియేట్ హై స్కూలులో చేరారు. అక్కడ చదువు కోసం ఇబ్బందులు తప్పలేదు. స్వాతంత్య్ర సమరయోధులు హయగ్రీవాచార్యులు తదితరుల సహాయంతో ఆయన హనుమకొండలో చదువు కొనసాగించగలిగారు. హనుమకొండ హై స్కూలులో డ్రాయింగ్‌ టీచర్ దీన్ దయాల్ నాయుడు. ఆయన తన విద్యార్ధి శేషగిరిరావు చిత్రకళా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. టీచర్ నాయుడు వెంట వెళ్లి బాలుడు శేషగిరిరావు పాకాల అడవిలో, అక్కడి ప్రకృతి ఒడిలో చిత్రకళ ప్రథమ పాఠాలు నేర్చుకున్నారు. గీతలలో దాగి ఉన్న సృజనాత్మకతను, రేఖలలో ఒదిగి ఉన్న రమ్యతను శేషగిరిరావు ఆరోజుల్లో ఆకళింపు చేసుకున్నారు. ఆయన ఆధ్యాత్మిక భావాలకు, దృక్పథానికి అప్పుడే అంకురార్పణ జరిగింది. ఆ పసితనంలోనే ఆయన చిత్రకళా ప్రతిభాకిరణాలు వికసించసాగినయ్.
మెట్రిక్‌లేషన్ పరీక్షలో ఉత్తీర్ణత లభించక పోవడంతో మనసుకు భాధ కలిగినప్పటికి శేషగిరిరావు కుంగిపోలేదు. ఆయన ధైర్యంతో హైదరాబాదులో అడుగుపెట్టారు. మాడపాటి హనుమంతరావు, మందుముల నరసింగరావు తదితర ప్రముఖులు వద్దకు వెళ్ళి కలిసినారు. మందుముల నరసింగరావు ఒకలేఖ రాసి శేషగిరిరావును బంజారాహిల్స్‌లో ఉన్న మెహిదీనవాజ్‌జంగ్‌ వద్దకు పంపించారు. హైదరాబాదు ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్యం శాఖల కార్యదర్శి మెహిదీ నవాజ్‌జంగ్‌ సహృదయుడు, గొప్పకళాపోషకుడు. తన మిత్రులు గుండవరపు హనుమంతరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, పెండ్యాల రాఘవరావు వెంటరాగ శేషగిరిరావు మెహీదీనవాజ్ వద్దకు వెళ్లారు. మందుముల లేఖను ఆయనకు ఇచ్చారు. విద్యార్ధి శేషగిరిరావు గీసినబొమ్మలు చూసి నవాబ్ సాహెబ్ చాలామెచ్చుకున్నారు. శేషగిరిరావును తన ఇంటిలోనే ఉండి చదువు సాగించమని మెహిదీనవాజ్ జంగ్‌ చెప్పారు. ఆళ్వారుస్వామి ప్రోద్బలంతో శేషగిరిరావు అందుకు అంగీకరించారు. హైదరాబాద్ నగరంలోని ఫైన్ ఆర్ట్స్‌ కాలేజి ప్రిన్సిపాల్ సయ్యద్ ఆహ్మద్‌కు చెప్పి మెహిదీనవాజ్ జంగ్‌ ఆ కళాశాల అయిదు సంవత్సరాల కోర్సులో శేషగిరిరావుకు ప్రవేశం కల్పించారు. శేషగిరిరావు కొద్దిరోజులు మెహిదీసాహెబ్ ఇంటిలోనే ఉండి చదువుకున్నారు. తరువాత మెహిదీనవాజ్‌జంగ్‌ హైదరాబాద్ కొత్వాల్ రాజాబహద్దుర్ వెంకట రామారెడ్డికి చెప్పి అబిడ్స్ రోడ్ సమీపంలోని రెడ్డి హాస్టల్‌లో శేషగిరిరావుకు ప్రవేశం కల్పించారు. అయిదు సంవత్సరాలు ఫైన్ ఆర్ట్స్‌ కాలేజీలో, రెడ్డి హాస్టల్‌లో శేషగిరి రావుకు అయిన ఖర్చును మెహిదీ నవాజ్ జంగ్‌ భరించారు. 1947 జూన్ 11 నాటికి ఫైన్ ఆర్ట్స్‌ కాలేజ్‌లో శేషగిరిరావు డిప్లొమా పూర్తి చేసారు. ఆ కోర్సులో ఆయన ప్రధమ శ్రేణిలో ప్రధముడుగా ఉత్తీరుడు కావడం విశేషం! శేషగిరిరావు ప్రతిభ, ప్రజ్ఞ, కృషి, పట్టుదల, అంకిత భావం మెహిదీనవాజ్ జంగ్‌కు, ప్రిన్సిపాల్ సయ్యద్ అహ్మద్‌కు చాల సంతోషం కల్గించాయి.

మతోన్మాదుల పైశాచికత్వంతో హైదరాబాద్ సంస్థానం, హైదరాబాద్ నగరం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సంవత్సరాలలో ధృడ చిత్తంతో శేషగిరిరావు ఫైన్ ఆర్ట్స్‌ కాలేజ్ డిప్లొమా కోర్సును పూర్తి చేసారు. ఆరోజుల్లోనే భారత జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాల ప్రభావం శేషగిరిరావుపై గాఢంగా ప్రసరించింది. రెడ్డి హాస్టల్‌లో కొందరు మిత్రులతోకలిసి ఆయన హైదరాబాద్ విముక్తి సమరంలో భాగస్వామి అయినారు. శేషగిరిరావు చిత్ర కళోపాసనలో సామాజిక స్పృహ ప్రస్ఫుటమవుతుంది. ఆయన స్వాతంత్య్రయోధుడు, దేశభక్తుడు. శేషగిరిరావు చిత్రకళాప్రావీణ్యంతో ముగ్దుడయిన మెహిదీ నవాజ్ జంగ్‌ ఆయనను శాంతినికేతన్ పంపి అక్కడ చదివించాలని సంకల్పించారు. అప్పుడు శాంతినికేతన్ చిత్రకళా విభాగం. అధిపతి సుప్రస్ధి చిత్రకారుడు నందలాల్ బోస్. శాంతినికేతన్ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్ అనిల్ చందా. అనిల్ చందాకు నవాజ్‌జంగ్‌ రాసిన లేఖ తీసుకుని శేషగిరిరావు కలకత్తా వెళ్లారు. మెహిదీసాహెబ్ అందించిన ఆర్థిక సహాయంతో ఆయన 1947-48 సంవత్సరాలలో, శాంతినికేతన్‌లో - విశ్వభారతిలో -చిత్రకళా సర్టిఫికేట్ స్టడీ కోర్సు పూర్తి చేసారు. 1948 ఏప్రిల్ 4వ తేదీన ఆయనకు శాంతినికేతన్ సర్టిఫికేట్ లభించింది. శాంతినికేతన్‌లో అబనీంద్రనాత్ టాగోర్ వంటి చిత్రకళావతంసులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. గురువు నందలాల్ బోస్ సూచనను శిరసావహించి శేషగిరిరావు సెలవులలో భువనేశ్వర్ వెళ్లి అక్కడ ప్రాచీన శిల్పాల రేఖాచిత్రాలను రూపొందించారు. నిర్విరామ పరిశ్రమ, నిమగ్నత, క్రమబద్ధత, అచంచల దీక్ష విద్యార్ధి దశ నుండే శేషగిరిరావు వ్యక్తితంలోని ప్రత్యేకతలు. అక్షరాలా ఆయన కళాతపస్వి.

శాంతినికేతన్‌లో చదువు పూర్తయిన పిదప 1948లో బోలక్పూర్ - కలకత్తా నుంచి వరంగల్లు జిల్లా నర్సంపేట వరకు శేషగిరిరావు జరిపిన ప్రయాణం ఒక సాహసగాధ. మద్రాసులో, విజయవాడలో కొద్దిరోజులు మకాంపెట్టి శేషగిరిరావు రైలులో ఖాజీపేట వస్తున్నప్పుడు ఎర్రుపాలెం స్టేషన్‌లో రజాకార్లు జొరబడి సోదా చేసారు. శేషగిరిరావు కూర్చున్న రైలుపెట్టెలో పై బర్త్ మీద ఒకగడ్డం సాహెబ్ పడుకున్నాడు. ఆ సాహెబ్ శేషగిరి అని పిలిచి పలుకరించాడు. అతను హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్‌ కాలేజీలో శేషగిరిరావు సహాధ్యాయి. తరువాత రజాకార్లతో చేరి సిపాసాలార్ - నాయకుడు - అయినాడు. అతని పేరు మిర్జా. మిర్జా సహాయంతో శేషగిరిరావు సురక్షితంగా బస్సులో కాజీపేట నుంచి నర్సంపేట చేరగలిగారు. విజయవాడలో ఉన్నప్పుడు హయగ్రీవాచార్యులు నిర్వహిస్తున్న శిబిరానికి వెళ్లి శేషగిరిరావు ఒక పూట భోజనం చేసేవారు. పూటకు పన్నెండు అణాలు ఖర్చు చేసినప్పటికి విజయవాడ హోటళ్లలో భోంచేయడం కష్టమయిన గడ్డురోజులను శేషగిరిరావు ఆనాడు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్ధిగా ఉన్నపుడే 1947లో నర్సంపేట ప్రముఖులు మండవ వెంకటేశ్వరరావు కుమార్తె కమలతో శేషగిరిరావు వివాహం జరిగింది. ఆ రోజుల్లో అది సంస్కరణ వివాహం. శేషగిరిరావు, కమలమ్మ దంపతుల సంతానం ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె. పోలీసు చర్య అనంతరం 1948లో శేషగిరిరావు హైదరాబాద్ వచ్చి రామ్‌కోట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యాలయం సమీపాన ఒక అద్దె ఇంటిలో నివాసం ఏర్పాటుచేసుకున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన తొలిరోజుల్లో ఆయన మిత్రులు దేవులపల్లి రామానుజరావు, దాశరథి (కృష్ణమాచార్యులు), పల్లా దుర్గయ్య, బి.రామారావు, సి.నారాయణరెడ్డి. 1947లో వరంగల్లు నుంచి దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వంలో వెలువడిన ‘శోభ’ సాహిత్య మాసపత్రికలో శేషగిరిరావు రేఖా చిత్రాలు ప్రచురిత మయినాయి. మెహిదీనవాజ్ జంగ్‌ సహాయంతో 1950లో శేషగిరి రావుకు హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్‌ కాలేజీలో అధ్యాపక పదవి లభించింది. ఆయన చిత్రకళా విద్యార్జన జరిపిన కళాశాల అది. ముప్పయి నాలుగు సంవత్సరాలు అధ్యాపక విధులను నిర్వహించి, ప్రొఫెసర్, వైస్ ప్రిన్పిపాల్‌గా వ్యవవహరించి ఆయన 1984 డిసెంబర్‌లో రిటైరయినారు. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఎస్.వి. ఫైన్ ఆర్ట్స్‌ -ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ పదవిని ఆయన కొంతకాలం నిర్వహించారు. ఉద్యోగ విరమణ జరిపినా, ఆయన తన కుంచెకు విశ్రాంతి ఇవ్వలేదు - చిత్రకళారంగంలో ఆయన వినూత్న ప్రయోగాలు నిలువలేదు.
జీవనయాత్రలో, చిత్ర కళారంగంలో శేషగిరిరావు నిత్య నూతనుడు, నిరంతర అన్వేషి, ఆయన అలసటలేని అధ్యాపకుడు, ఆచార్యుడు. హనుమకొండలో పూర్తి కాని మెట్రిక్‌లేషన్ను ఆయన 1959 నవంబర్ 1 నాటికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేసారు. అది ఆయన పట్టుదలకు, విజ్ఞాన పిపాసకు నిదర్శనం. అంతకు ఆరు సంవత్సరాల ముందు 1953లో రాజస్థాన్‌లోని జైపూర్ బనస్థలి విద్యాపీఠ్ నుంచి ఫ్రెస్కో పెయింటింగ్‌ కోర్సులో ఆయన సర్టిఫికెట్ పొందారు. 1955 డిసెంబర్‌లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలుగు పరీక్షలో ఆయనకు హయ్యర్ సర్టిఫికెట్ లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శేషగిరి రావును 1972ఆగస్టు 10వతేదీన ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ కోశాధికారిగా నియమించింది. అయిదు సంవత్సరాలు ఆయన ఆ పదవిని నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ సభ్యులుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంచే 1973 సెప్టెంబర్ 19వ తేదీన నియుక్తులయినారు.

పలుభంగుల చిత్రకళారీతులలో, ముగ్ధ మనోహరచిత్ర రచనలో ప్రావీణ్యం సంతరించుకొన్న శేషగిరిరావు ప్రధానంగా సంప్రదాయ చిత్రకళాకారుడు, ఆధ్యాత్మిక భావుకుడు. ప్రకృతి ఆయనలోని చిత్రకళా ప్రతిభను పరవశింపచేసింది. ఆయన చిత్రకళ వెర్రితలలు వేయలేదు. వెగటు పుట్టించనిది, విమలానందం కల్గించేది ఆయన చిత్రక కళా సంపద క్యూబిస్ట్‌, సర్రియలిస్ట్‌, దాదాయస్ట్‌, నైరూప్య, ఆధునాతనరీతులను తిరస్కరించకుండానె శేషగిరిరావు తనదైన విశిష్ట శైలిని అనుసరించారు. ఆయన బ్రస్వర్క్‌లో వేగం, జీవం, జవం ముప్పిరిగొని ప్రేక్షకులను మైమరపింపజేస్తాయి. ఆయన మ్యూరల్ పెయింటింగ్స్ కంపొజిషన్, స్పేసింగ్‌ అద్భుతమయినవని చిత్రకళా విమర్శకుల అభిప్రాయం.

చిత్రకళలలో సిద్ధహస్తులయి సమున్నత శిఖరాలను అధిరోహించిన శేషగిరిరావును 1988-89 సంవత్సరాలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో సన్మానించింది. ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్‌ క్రాఫ్ట్ సొసైటీ 1988లో ఆయనను అఖిల భారతస్థాయిలో అగ్రగణ్య చిత్రకారుడుగా గుర్తించి గౌరవించింది. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సాంస్కృతిక విభాగం 1988 వ సంవత్సరంలో శేషగిరిరావును జాతీయ చిత్రకారుడుగా ప్రకటించి ఆయనకు ఎమిరిటస్ ఫెల్లోషిప్‌ను ప్రదానం చేసింది. 1993లో ఆయనకు రాజీవ్‌రత్న అవార్డు లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1996 నవంబర్‌లో శేషగిరిరావును గౌరవ డాక్టరేటు ప్రదానంతో సన్మానించింది. అగ్రశ్రేణి చిత్రకారుడుగా శేషగిరిరావు పొందిన బహుమతులు, అవార్డులు, సన్మానాలు అసంఖ్యాకం, ప్రాచ్య చిత్రాకళారీతిలో ఆయన ప్రజ్ఞకు 1949 నుంచే గుర్తింపు వచ్చింది -ఎన్నోబహుమతులు లభించాయి. ఆల్ ఇండియా ఆర్ట్‌ ఎగ్జిబిషన్, హైదరాబాద్ ఆర్ట్‌ సొసైటీ, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆయన ప్రతిభను తొలిదశలోనె గుర్తించి గౌరవించాయి.

విభిన్న చిత్రకళాప్రక్రియలలో శేషగిరి రావు చిత్రించిన వేలాది చిత్రాలలో సజీవ సౌందర్యం, సౌకుమార్యం, లావణ్యం, నయగారం, వర్ణ వైభవం విలాస ప్రదర్శన జరుపుతుంటాయి. ఆయన గీసే ప్రతి గీతలో మనోల్లాసం, మైమరపు కల్గించే మార్దవం ఉట్టిపడడం ఒక ప్రత్యేకత. ఆయన చేతిలోని రంగుల కుంచె అప్రతిమానహవణికలను, సొబగులను, సురభిళాలను విరజిమ్ముతుంది. ఆయన చిత్రించిన ప్రతి చిత్రం ఒక మనోహర కళాఖండం. ఆయన ప్రతి కళా ఖండం ఘన సన్మానానికి అర్హమయినది. మహానీయులెందరో ఆయన చిత్రకళా వైశిష్ట్యానికి, వైదుష్యానికి ప్రశంసలతో నీరాజనం పట్టారు.

శేషగిరిరావు కేవలం చిత్రకారుడేకాదు, చిత్రకళా పరిశోధకుడు,విభిన్న చిత్రకళారీతుల, భాష్యకారుడు గూడ. విభిన్న చిత్ర కళాఫణితులపై, విశేషించి జానపద చిత్ర కళారీతులపై లోతుగా పరిశోధన జరుపడం, సచిత్ర విశ్లేషణతో పరిశోధనా వ్యాసాలు రచించడం, వినూత్న ప్రక్రియలను ఆవిష్కరించడం అద్వితీయ కృషి అనడంలో సందేహం లేదు. ఒక గ్రంథం రచించే సంకల్పంతో ఆయన దక్షిణ భారతదేశంలోని జానపద చిత్రకళారీతులపై, రూపాలపై, ముగ్గులపై ఎంతో పరిశోధన జరిపి వేయికంటే పైన డిజైన్లను సేకరించారు. ఆంధ్రదేశంలోని జానపద చిత్రకళపై ప్రత్యేకంగా పరిశోధన జరిపి తెలంగాణా గ్రామాలలో ప్రాచుర్యం పొందిన “కాకిపడిగెలు” చిత్రకళారూపం పై ఆయన ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీకి విలువయిన ఒక నివేదిక సమర్పించారు. చైనా, జపాన్ చిత్రకళారీతులపై, ప్రక్రియలపై శేషగిరిరావు కావించిన పరిశోధన గణనీయమయినది. ప్రకృతి సౌందర్యాన్ని, పక్షులను, జంతువులను, రాళ్లు,గుట్టలను, చారిత్రక సంఘటనలను, రామాయణ, భారత తదితర పౌరాణిక ఘట్టాలను, దేవాలయ శిల్పాలను, కాకతీయ, హంపి, లేపాక్షి నాగార్జున కొండ శిల్పాలను, నన్నయ,పోతన, వేమన, భక్త రామదాసు, విద్యారణ్యస్వామి, శ్రీకృష్ణ దేవరాయలు, తిమ్మరసు, అక్కన్న, మాదన్న, అభినవ గుప్తుడు, రుద్రమదేవి వంటి చారిత్రక ప్రముఖులను, అశోకవనంలో సీత, శకుంతల, గుహుని పడవలో సీతారామలక్ష్మణుల నదీయానం వంటి పౌరాణిక దృశ్యాలను, ఆధునిక కాలపు మహనీయులను సజీవంగా చిత్రించడంలో శేషగిరిరావు సాటి లేని చిత్రకారుడంటే అతిశయోక్తికాదు. ఆయన చిత్రించిన “తెలుగుతల్లి” తైలవర్ణ చిత్రం 1975 ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రశంసలు పొందింది.

పెన్సిల్, రబ్బరు ఉపయోగించకుండా నేరుగా కుంచెను ఉపయోగించి అందాలను ఒలికించడం ఆయన ప్రత్యేకత. వాటర్ పెయింటింగ్‌లో అక్వాటెక్‌స్చర్ ప్రక్రియను ఆయన స్వయంగా సృష్టించి ప్రవేశపెట్టారు. వాష్ అండ్ గోష్ ప్రక్రియలో గూడ ఆయన నిపుణుడు.

ఒక చిత్రకారుడు, చిత్ర కళాతపస్సులో తీరికలేని ఒక చిత్రకారుడు వివిధ చిత్రకళారీతులు, సంప్రదాయాలపై మహత్తర పరిశోధన జరుపడం, చిత్రకళారీతులు, ప్రక్రియలపై పుంఖానుపుంఖంగా అమూల్య వ్యాసాలు రచించడం, తెలుగు, ఇంగ్లీషు రెండు భాషలలో రచించడం, వాటిని ఉన్నత ప్రమాణాలతో అందంగా ప్రచురించడం అసాధారణ కృషి. శేషగిరిరావు ఇటు వంటి అసాధారణ కృషిని కొనసాగించారు. ఆదిమ చిత్రకళ, భిత్తి చిత్రకళ, అలంకరణ చిత్రకళ, పరిశ్రమల చిత్రకళ, ఆంధ్రదేశంలో చిత్రకళ, దక్షిణ భారతదేశంలో జానపద చిత్రకళ తదితరంశాలపై ఆయన లేఖిని నుంచి వెలువడిన రసవత్తర, విజ్ఞానప్రద రచనలు భారతి తదితర పత్రికలలో ప్రచురితమయినాయి - రేడియోలో ప్రసారమయినాయి, పుస్తక రూపంలో వెలువడినాయి. సమకాలీన ప్రసిద్ధ జానపద చిత్రకారుడు కాపు రాజయ్య చిత్రకళపై శేషగిరిరావు ఒక విశ్లేషణాత్మక వ్యాసం రచించారు. లేపాక్షి శిల్పాలపై, అమృత్‌షేర్ గిల్ చిత్రకళపై, ఆంధ్ర చిత్రకారుల చిత్రకళారీతులపై, సమకాలీన చిత్రకళా వికాసంపై, భారతదేశంలో చిత్రకళ బోధనపై శేషగిరిరావు అమూల్య రచనలు అనేకుల ప్రశంసలు పొందాయి. ఆంధ్ర చిత్రకారులను పరిచయం చేస్తూ సమకాలిక చిత్రకళాభివృద్ధి గురించి శేషగిరిరావు రచించిన వివరణాత్మక విపులవ్యాసం భారత జాతీయ కాంగ్రెస్ 71వ మహాసభ ప్రత్యేక సంచికలో 1968లో ప్రచురితమయింది. లక్నో నుంచి ప్రచురితమయ్యే ఒక ప్రసిద్ధ పత్రిక ఈవ్యాసం హిందీ అనువాదాన్ని ప్రచురించింది. సుప్రసిద్ధ కవి వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రకావ్యంపై “చిత్రమయకావ్యము” శీర్షికతో శేషగిరిరావు రచించిన వ్యాసం కమనీయమయినది. శేషగిరిరావు కుంచె, లేఖిని రెండూ శక్తివంతమయినవే. మహమ్మదీయ చిత్రకారులు, విమర్శ ప్రమాణాలు, ఆధునిక చిత్రకారులు, చిత్రకళా ప్రగతి, అడవి బాపిరాజు చిత్రకళ, తెలుగువారి చిత్రకళా వైభవం, పాస్టెల్ చిత్రరచన, చిత్రకళలో శ్రీకృష్ణుడు, వివిధ కళా ప్రక్రియలు -అభ్యున్నతికి మార్గాలు తదితర అనేక అంశాలు శేషగిరిరావు రచనలకు వస్తువులయినాయి. అనేక పత్రికలలో, సంచికలలో, అభినందన సంచికలలో చిత్రకళారీతులమీద, చిత్రకారులమీద ఆయన రచనలు, చిత్రాలు ప్రచురితమయినాయి. ఖండవల్లి లక్ష్మీరంజనం ఆధ్వర్యంలో వెలువడిన సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం ఎనిమిదవ సంపుటిలో చిత్రకళా విభాగానికి శేషగిరి రావు సంపాదకత్వం వహించారు. లేపాక్షి, తాడిపత్రి, హంపి శిల్పాల రేఖా చిత్రాలతో ఆయన ‘రూపరుచి’ సంపుటాన్ని ‘సురేఖ’ రెండు సంపుటాలను ప్రచురించారు. చిత్రకళ రేఖలను శాస్త్రీయ దృష్టితో అవలోకించి శేషగిరిరావు ‘రేఖార్ణవం’ గ్రంథం రచించారు.

ప్రభుత్వాలు, కొన్ని ప్రయివేటు సంస్థలు కావించిన అభ్యర్థనకు స్పందించి శేషగిరిరావు రూపొందించిన చిత్రాలు మరువలేనివి. ఆయన ప్రాపంచిక పరిజ్ఞానానికి, కల్పనాగరిమకు, చిత్రకళా ప్రావీణ్యానికి అవి ప్రతీకలు. భక్త కవి పోతన పంచశతజయంతి ఉత్సవ సందర్భాన శేషగిరిరావు చిత్రించిన పోతన తైల వర్ణ చిత్రాన్ని 1982 మార్చిలో, వరంగల్లులో, అప్పటి భారత విదేశాంగ మంత్రి పి.వి. నరసింహారావు ఆవిష్కరించారు. పరమభక్తుడు పోతన సమున్నత వ్యక్తితం, స్వరూపం, తేజస్సు ఆ తైల వర్ణ చిత్రంలో ప్రదర్శితమయినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అభ్యర్ధించగా ఆయన ‘తెలుగు వెలుగులు’ చిత్రాన్ని స్ఫూర్తిదాయకంగా రూపొందించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించి శేషగిరిరావు హైదరాబాద్, బెంగుళూరు, భావనగర్ కాంగ్రెస్ మహాసభల సందర్భాన ఆంధ్రప్రదేశ్ పెవెలియన్లలో బృహత్తరకుడ్య చిత్రాలను చిత్రించి మన్ననలు పొందారు. రాష్ట్ర హరిజన మహాసభ వేదికపై బ్యాక్‌డ్రాప్‌గా శేషగిరిరావు రూపొందించిన కుడ్య చిత్రం ప్రేక్షకులకు ఉత్తేజం కల్గించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరగా ఆయన ఢిల్లీలో గాంధీదర్శన్‌లో చక్కని, ప్రబోధాత్మక కుడ్య చిత్రాన్ని రచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, హైదరాబాద్‌లో జూబ్లీహాలులలో ఆయన చిత్రించిన ప్రముఖులు చిత్రాలు గత చరిత్రకు సజీవ జ్ఞాపికలు. ఢిల్లీలో, హైదరాబాద్‌లో ప్రదర్శనకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ టాబ్లోలను చిత్రించి రూపొందించారు. హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ కేంద్రంలో రెండు, మైత్రీవనం వాణిజ్య సముదాయంలో రెండు భారీ కుడ్య చిత్రాలు శేషగిరిరావు చిత్రించినవే. ఉస్మానియా విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ కాలేజీలో, పటోడియా స్పిన్నింగ్‌ మిల్స్‌లో, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం తదితర భవానలలో ఆయన చిత్రాలు ఆలోచనలను రేకెత్తిస్తూ అందాలను విరజిమ్ముతున్నాయి. ఆయన హైదరాబాద్ విముక్తి సమరాన్ని ఒక బృహత్తర చిత్రంలో ఉత్తేజకరంగా ప్రతిబింబించారు. వాషింగ్టన్ (యు.ఎస్.ఏ) లోని భారత రాయబార కార్యాలయంలో అనేకులను ఆకర్షిస్తున్న ఆంధ్రకేసరి ప్రకాశంపంతులు తైలవర్ణ చిత్రం శేషగిరిరావు కుంచె నుంచి ఆవిష్క్పుతమయినదే. శేషగిరిరావు చిత్రకళా వైభవంలో వైవిధ్యం ఒక విలక్షణ గుణం. కవులు, రచయితల గ్రంథాలకు, పత్రికలకు, ప్రత్యేక సంచికలకు, గ్రీటింగ్‌ కార్డులకు, వివాహ ఆహ్వాన పత్రికలకు, పలు సంస్థల మోనోగ్రాములకు, లోగోలకు, చిహ్నాలకు శేషగిరిరావు చిత్రాలు, డిజైనులు ప్రత్యేక శోభను, విలువను సంతరింపజేసాయి. శేషగిరిరావు ఒక తపస్సుగా సృష్టించిన వేలాది చిత్రాలలో వెలుగు చూడనివి ఇంకెన్నో ఉన్నాయి. ఆయన గది ఒక కళానిలయం. ఒంటరిగా, ఇతరులలో కలిసి ఆయన నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలు కళాభిమానులకు, విమర్శకులకు కమ్మని కను విందు చేసాయి. 2003 జనవరి 14 సంక్రాంతి సమయాన మాదాపూర్ శిల్పకళా వేదికలో ఆయన చిత్రఖండాల ప్రదర్శన అపూర్వమయినది. అలంకారాలు శేషగిరిరావు కళా సంపదలో రాణిస్తాయి. ఆయన కళాసృష్టి అజరామరమయినది - ఆయన భావితరాల చిత్రకారులకు ఆదర్శప్రాయుడు.

(జనవరి 27, 2006న విడుదల అయిన డాక్యుమెంటరీకి రాసిన వాఖ్యానం పూర్తి పాఠం)

2 అభిప్రాయాలు

  1. on 05 మార్చ్ 2007 at 9:01 pm 1.swapna

    its really a great pleasure to know so much about a great person like sri Kondapalli Seshagiri Rao garu.

  2. on 25 ఏప్రిల్ 2009 at 10:04 am 2.mohan

    చాలా ఆనందంగా ఉంది ఒక గొప్ప వ్యక్థి గురించి తెలుసుకొవదము.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో