కవితలు సోయి | 02 మార్చ్ 2007 02:56 am
వందనాలు వట్టికోట ఆళ్వారుస్వామి
- ఎర్ర యాదయ్య, టీచర్, చిత్తలూరు
పల్లెనిను తలుస్తుంది జిల్లనిను గొలుస్తుంది
తెలంగాన తల్లినీకై తల్లడిల్లిపోతుంది
ఓ… వట్టికోట ఆళ్వారూ
వందనాలు వందనాలు నీకు మా జోహార్లు ||2||
పుట్టినావు మాదవరం - పుణ్యభూమిలోన నీవు
పెరిగినావు కందిబండ - నారపరాజులింట
గ్రంథాయోద్యమాలు - సాహిత్య సమరములు
తెలంగాణ జీవనాన్ని చాటిచెప్పినావు నీవే
ఓ… వట్టి కోట ఆళ్వారూ…
వందనాలు వందనాలు ఉద్యమాభివందనాలు ||పల్లె||
నిజాం నెదిరించి రజాకార్లతో పోరి
క్విటిండియోద్యమంలో - నా తెలంగాణయంటు
జైలు గోడలపైన - నినాదం వ్రాసినోడ
ఓ… వట్టికోట ఆళ్వారూ…
వందనాలు వందనాలు -తెలంగాణ జోహార్లు ||పల్లె||
అక్షరాయుధమై - అంధకారం జీల్చ
చైతన్యస్పూర్తిని - ఈ జనములో రగిలించి
పురిటిబిడ్డవై నీవు - పుట్టినూరు కొస్తావా
తెలంగాణ మట్టి కొరకు - మల్లిపోరు జేస్తవా
ఓ… వట్టి కోట ఆళ్వారూ…
వందనాలు వందనాలు - సాహిత్యమాభివందనాలు



