కవితలు సోయి | 07 జూన్ 2007 06:43 pm
ఆల్లు కష్టపడ్తర్సార్… మనోళ్ళు సోమరిపోతులు
- ఏనుగు నరసింహారెడ్డి
ఆల్లు
కోనసీమ కొబ్బరాకులమ్మి
ప్రజ్ఞాపురంలో పత్తితోట కొంటరు
మూడోపంటకు నీరిడ్సుకొని
సెక్రెటేరియెట్ల నౌకర్లల్లుంటరు
కుడి కాలువ ఎడమ కాలువల్ని
రెండున్నర జిల్లాలకు మల్పుకొని
ముక్కారు పంటల రైతన్నలైతరు
ఆంధ్రా క్రిష్టియన్ కాలేజీల్లో
మూడు తరాలుగా మెదళ్ళు రుద్దుకొని
ఇరవై మూడు జిల్లాల్లో దోపిడీకి బారుగడ్తరు
ఫ్యాక్టరీల మిషతో ద్రవ్య సంస్థల్ని ముంచేసి
నింపాదిగా జెండా లేపేస్తరు…
ఆల్లు కష్టపడ్తార్సార్
మనోళ్ళు-
చరిత్ర చింతా క్రాంతమైనప్పుడు
రాయిముక్క అవసరం లేకుండా
చార్మినార్ని కట్టి చందమామకు పోటీపెడ్తరు
మట్టిపెళ్ళ పట్టు లేకుండా
మక్కా మజీదును అల్లాకు దట్టీగడ్తరు
కాలే కడుపులతో కరువును తరిమేసి
ఆసియాకే ఆణిముత్తెపు ఏసుప్రభువు ఆటవిడుపు
మెదక్ చర్చీని నిలబెడ్తరు
ఎడతెగని శిలాతోరణంతో
ఓరుగల్లు శిల్పులు సృష్టికే సవాలు విసుర్తరు…
మనోళ్ళు సోమరిపోతులు
ఆల్లు ధనధాన్యాల గరిసెలు నింపుకుంటుంటే
మనోళ్ళు పోరాటాల చరిత్రలు సృష్టిస్తరు
ఆల్లు సముద్రం లకమాడుతుంటే
మనోళ్ళు గుట్ట చెలికలల్ల తుడుం గడ్తుంటరు




on 12 ఆగస్టు 2007 at 9:16 am 1.Dr T Prabhakar Reddy …
ఇది చల బగ్ఉందె. ధన్యవ్ ద్ల్ల.
on 12 ఆగస్టు 2007 at 9:20 am 2.Dr T Prabhakar Reddy …
ఇధి చల బగుంది.
on 13 ఆగస్టు 2007 at 6:03 am 3.Rakesh TELANGAAN …
లవ్లీ……….
ఎంత మంచిగ రాసిండ్రు సారూ………
రాకేశ్ తెలంగాణ్…. (మన పేర్లు, కులం, మతం.. అన్నీ తెలంగాణే కావాలె)
on 17 ఆగస్టు 2007 at 1:41 pm 4.ramulu …
ఔను వాళ్ళు కష్టపడతారు!
మెజారిటీశాసన సభ్యులతో,
మామయమాటలు చర్చించి,
మాయచట్టాలతో,
మనబతుకులతో ఆడుకుంటూ,
పడరాని పాట్లు పడుతుంటే కనపడతలేదా?
గిట్టని వాళ్ళు కుట్రలంటున్నారు,
కాని వాళ్ళు కష్టపడుతున్నారు!
కొత్తకొత్త జీఓలను,
కొత్తకొత్త పద్దతుల్లోతీసుకురావడానికి,
610జీఓను అడుగున్నే ఉంచడానికి,
లక్షలాది ఉద్యోగాలను తమవాళ్ళకి చ్చుకోవడానికి,
వాళ్ళు పడుతున్న కష్టాలు కనబడతలేవా?
గిట్టనివాళ్ళు వాటిని ఘోరాలంటారు,
కాని వాళ్ళు పనులుచేస్తున్నారు!
ప్రాజెక్టు నీళ్ళను తన్నుకు పోవడానికి,
వాటి ప్రణాలికలను పంపిణపివిధానాలను,
మార్చటానికి, మాటలతో ఏమార్చటానికి,
వాళ్ళు పడుతున్న శ్రమ కనపడతలేదా?
చేతకాని వాళ్ళు వాటిని మోసాలంటారు,
కాని వాళ్ళు ఎడతెగని ఆలోచనలు చేస్తున్నారు!
on 16 సెప్టెంబర్ 2007 at 8:19 pm 5.Revathi …
కవిత చల బాగున్నది, ఆందురుల కుత్ర కుతంత్ర ము బయ్యత పెదుతునంది
on 26 అక్టోబర్ 2007 at 5:48 am 6.Ch.Krishna Rao …
ఆ0ద్ద్ర్ర్లల్ల మొసొము ని ,కుతను బాగా తెల్స0ది
on 03 నవంబర్ 2007 at 5:26 am 7.nagesh …
msuth gundhi sirr
on 17 నవంబర్ 2007 at 5:28 am 8.balu …
అవును మనవాల్లు కొలువు ఎనిమిది గంటలకి వచెడిది 10 గంటలకి
పాన నంలాలె పక్క నొడి మిద వూంచాల కొలువు ఆఫిసు ఖరాబు చెయ్యాల
ఆంధ్ర కాలేజ్ లో నే సదువుతుంద్రు అది క్రిష్టయన్ ల్ బిచ్చ గాదె. రాజకీయ నాయాళ్ళు ఆంధ్రలో కాలేజ్ కట్టించిండ్రా.క్రిష్న జిల్లా లొ 2 వంతులు కరువు ప్రకాసం లొ సగం బీడు నేలలు నెల్లూరు లొ 40 శాతం బీడు ఇగ ఉత్తర కొస్తాలో 3 జిల్లాలు అడవి తప్ప పంట పొల్లాలు లేవు. గోదావరి జిల్లాల్లో కాటన్ దోర అది.వరదలు అపేతందుకు కట్టించిన బారేజ్ ల తో గిప్పుడు పంటలు బాగున్నాయి. వరదలు వస్తే అవి గుడా గోదారమ్మ పట్టుకు పోతది.అందుకే బాగా సదువుతున్నం సదువు బువ్వ పెడుతదని .అందుకె బాగా వల్లొంచి కష్టం పడతం .గీ దంతా ఎందుకే నువ్వే పుడైనా ఆంధ్రా బో యి చూసినవా అక్కడం తా బాగుంతదని సెప్తున్నవ్.సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్లు ప్రతి ప్రాంతంలోను అసమానతలు వున్నాయి.లేనిదల్లా ఒక్క రాజకీయ తొత్తుకొడుకులలోనే .వారు తమ పబ్బంగడుపుకోటానికి జనాలందరికి పేద్ద నామం పెడుతున్నారు. మనలో మాట ప్రుడెన్ణ్తిఎల్ బ్యాంకుని ముంచింది మన రాజీవ్ రెడ్డే గందా ఇప్పుడు సి ఎం తో కలిసి కారెక్కి తిరుగుతుండు. ఆంధ్రోల్లు ఖార్ఖానా పెడితే మనోల్లు యూనియన్ లు పెట్టి మూపించిండ్రు. మరి వాల్లు దబ్బులు ఏడికెల్లి తెచ్చి కడతారు. మనం సక్కగుంటే మొత్తం దునియా సక్కగుంటది
on 17 నవంబర్ 2007 at 10:17 pm 9.ramulu …
బాలు గారు,
మన తెలంగాణ్వాళ్ళలో పనిదొంగలుండొచ్చు,పనికి లేటుగ వచ్చెటోళ్ళు ఉండొచ్చు,ఐతే ఆంధ్ర-సీమల వాళ్ళలో కూడ తక్కువేమీలేరని మీరు గ్రహించాలి.మన్వాళ్ళలోఎంతోమందిమంచివాళ్ళున్నా వారిగురించి ఇతరప్రాంతాలవాళ్ళుమెచ్చుకోరు,ప్రచారం చెయ్యరు.తెలంగణోళ్ళనినాఇతరప్రాంతీయులనినా ,వాళ్ళు మెచ్చుకున్నవాళ్ళనే మెచ్చుకుంటున్నాము,వాళ్ళు తిడుతున్న వాళ్ళనే మనంతిడుతున్నాము.వాళ్ళుప్రచారంచేస్తున్నదానిలో నిజమెంత అనేదిసొంతంగాఅలోచిస్తలేము.
పాన్లుతినిఊసే సంస్క్రుతి అందమైన భవనాలను పాడుచేసే బుద్ధిహీనులు,ఏమాత్రం సిగ్గులేకుండా భయం లేకుండాన్ఖరాబుచేస్తున్నవారు మన తెలంగాణవాళ్ళలో అధికంగానే ఉన్నారు . కామన్ సెన్స్ ,సివిక్సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నవాళ్ళు మస్తుగనే ఉన్నరువాళ్ళకు మీవంటి వాళ్ళంతా రాస్తూబుద్ధిచెపాల్సిఉంది.
మన తెలంగాణ భూములింకెన్నిఅమ్ముకున్నా,మనఉద్యోగాలెన్నదోలక్షలులుచుకున్నా ,మననీళ్ళను దోచుకొని ఎన్నిలక్షలేకరాలను వాళ్ళు పారబెట్టుకున్నా ఆంధ్ర-సీమలలో ఉన్న వెన్కబడిన ప్రాంతాలు,వెన్కబడిన జనాలు అభ్వ్రుద్ధిచెందరు.దోచుకున్నవాళ్ళు,వాళ్ళ్దదగ్గరివాళ్ళే బాగుపడతారు.
on 13 ఫిబ్రవరి 2008 at 2:33 am 10.palakurthy …
మన సొమరిథానానికి కారనము అంధ్రొల్లు , మనల్ని ధొచుకుని వాల్లెము బాగుపదుథారు !! ?? సునామీ లొ కలిసి పొవదము కాయము