పోస్టులు అభిప్రాయాలు 07 February 2012

పాటలు సోయి | 07 జూన్ 2007 05:33 pm

ఎన్నాళ్ళీ కన్నీళ్ళు

-సిహెచ్‌. రమణాచారి

ఏన్నాళ్ళీ కన్నీళ్ళు
ఏన్నాళ్ళీ కష్టాలు - 2

ఆంధ్ర వలస దోపిడిలో
అణగారిన బ్రతుకులు
మన తెలంగాణ బ్రతుకులు - 2

నదులున్నా గనులున్నా తరగని వనరులు వున్నా
సాగునీరు కరెంటుకు ఎప్పుడు కరువేనన్నా
తరలిపోతున్నవి మన సహజ వనరులన్నా
అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు మనకన్నా ||ఎన్నాళ్ళీ||

అగ్గిపెట్టెలో పట్టు చీరనేయు నేతన్నలు
మిల్లులన్ని మూతబడి బతుకులు బజార్లపడి
ఆలు బిడ్డల సాదలేక అలమటించు తున్నారు
నిరాశతో నిస్పృహతో ఉరిపోసుకు చస్తున్నరు ||ఎన్నాళ్ళీ||

చదువుకున్న పోరగాండ్లు పనికరువై తిరుగుతుండ్రు
బ్రతుకు దెరువు దారిలేక ఆగమాగమవుతున్నరు
మరి కొందరు దొంగలయ్యి నేరాలను చేస్తున్నారు
కన్న వాళ్ళ కడుపుకోత ఇదియేనా మన బ్రతుకురాత ||ఎన్నాళ్ళీ||

ఒప్పందాలు నిబంధనలు అంతా వట్టి బూటకాలు
ఆరొందల పది జీవో పాలకుల నాటకాలు
కంట తడిని ఒత్తుకొని బిగి పిడికిలి ఎత్తుకొని
ప్రజాస్వామ్య తెలంగాణ సాధనకై కదులుదాం.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో