పాటలు సోయి | 07 జూన్ 2007 05:34 pm
కూలీ నాలీ పేదజనం కుములు తున్నదో పనేలేక పల్లె పల్లె పలచబడ్డదో
- దాంగట్ల కాశీదాస్
ఆడ పిల్లల కనుకున్న తల్లిదండ్రుల బ్రతుకు ||కూలీ||
కట్నాల ఆప్పుల్లో కాలిపోయే బతుకంత
ఇంట్యాదులందరు కలిసి బతికే దారి లేదు పల్లెన
అప్పులోల్ల భాదలకు తలొదిక్కుగా సమాయే
గీ భాదలల్ల బతకలేకరో బలైపాయే పేదజనంరో ||కూలీ||
కూలీజేస్తే కడుపులోకి మెతుకులొచ్చే బతుకులాయే
కనుకున్న పిల్లలేమో కరువులోన బరువులాయే
యాడాది సంటిపిల్ల సంకకేసుకోని ఎండన
తిన్నా తినకున్న ఆ మండే ఎండన మోతలాయే
గో బతుకులేందుకు వచ్చేనమ్మలో
పల్లే పల్లే ఎడుపాయేరో ||కూలీ||
ఎదిగొచ్చిన సోరదుడ్డెలు సదువలేక భాదలాయే
కన్నోళ్ళ భాదలను కండ్లతోటి సూడలేక
దిక్కులేని రాజ్యమెల్లి మోసపోయే బతుకులొచ్చే
దినం దినం గడుపుకుంట కూలిన్యాలి జేసుకుంట
కాలమెల్లదీస్తున్నరో మందరొచ్చే కష్టజీవులు ||కులీ||
ఎలేటోళ్ళ బతుకులేమో ఎటేటికి ఎలగబట్టే
తిండికెల్లని పేదోల్లను బాంచన్లను జేయ్యబట్టే
నలుగుతున్న బీదజనం నలుగు దిక్కుల బాట బట్టే
పల్లేలన్ని దోపిడాయే జిల్ల జిల్ల ఆగమాయే
పోయినం కాలం ఈ బతుకులా
పోరుజెయ్యకుంటే బతుకు లేదురా ||కూలీ||



