కవితలు సోయి | 07 జూన్ 2007 06:48 pm
మాయం
- బోదిరెడ్డి మధుసూధన్ రెడ్డి
హైటెక్ రాజ్యంలో
అన్ని పనులు అల్కగానే జరుగుతాయి
ఇప్పుడు మనుషుల ‘మాయం’ కూడ
హైటెక్ మాయనే
పెన్నుతో, పేపర్‌తో డాక్టర్‌తో,
పనిలేకుండానే పనైపోతుంది.
ఎఫ్.ఐ.ఆర్.లు, ఇన్‌వెస్టిగేషన్లు
పోస్టుమార్టంలు దండగ
మాయం చేసే మర్మం తెలిసినోడికి
వీటితో పనేంటి?
వాడికి కావలిసింది
ఆరడుగుల అనువైన జాగ
దానికి తోడు పలుగు, పార సుత
ఇప్పుడు తెలంగాణ భూమిలో
శవాలు నాటుతున్నారు
మొదటి దానికి మెదక్ జిల్లా వేదికయింది.
రేపు రామాయంపేట కావచ్చు
ఎల్లండి ఎనగుర్తి కావచ్చు
ఇక తెలంగాణ భూమిలో
మొక్కలు మొలువై
దుష్టులు నాటిని శవాలు మొలుస్తాయి
ఇవే రేపటి పునర్జీవాలు అవుతాయి.
అవి భూమిని బద్దలు చేసి
బయటపడి ఎదిరించి నిలుస్తాయి.



