పోస్టులు అభిప్రాయాలు 08 February 2012

వ్యాసాలు సోయి | 07 జూన్ 2007 05:30 pm

నా తెలంగాణా గురుతు గిదన్న…

- రాజు

తెలంగాణా తెలంగాణా తెలంగాణ. ప్రస్తుతం ప్రతిచోట తెలంగాణా చర్చానీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు దిక్కూ, దిశను వదలి ప్రయాణించి ప్రజల్లోనూ నమ్మకాన్ని పోగొట్టుకొన్న తెలంగాణా రాష్ట్ర ఉద్యమం (మళ్ళీ) కె.సి.ఆర్‌ ఘన విజయంతో మళ్ళి ఊపందుకుంది. కొందరైతే దాదాపు తెలంగాణా ఏర్పడినట్టేనని భ్రమపడ్తున్నారు. ఇది అతిశయోక్తే కాని తెలంగాణా రాష్ట్రం తుది ఉద్యమం సాగించేందుకు ఇది అనువైన సమయం.

నిజంగా రాష్ట్రమే ఏర్పడితే అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌ బాటలో నడిచి అగ్రకులాల పెత్తనం క్రింద నలిగితే అప్పుడు తెలంగాణాకు అర్థమే లేదు. అందుకే తెలంగాణ భావాలు ప్రతిబింబించే విధంగా తమ అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు తమదైన ముద్ర బలీయంగా కనిపించేందుకు తెలంగాణా వాదులు పరితపిస్తున్నారు. మొన్నటికి మొన్న కరీంనగర్‌కు చెందిన బి.వి.ఆర్‌ చారి అనే చిత్రకారుడు తెలంగాణా (తెలుగు) తల్లికి రూపం కల్పించాడు. ఇది అభినందించదగ్గ విషయం. ఎందుకంటే కట్టు, బొట్టు విషయంలో (ఆభరణాలను పొదుపుగా వాడుతూ) సగటు తెలంగాణా స్త్రీని ప్రతిబింబింప జేశారు.

త్రిలింగ దేశం నుండి తెలుగు ఏర్పడిందంటే (శ్రీశైలం, ద్రాక్షారామం, కాలేశ్వరం) మద్యనున్న ఎక్కువ ప్రాంతం తెలంగాణాదే. కాబట్టి తెలుగు మనది. మనతల్లి తెలుగు తల్లియని కొందరి వాదన. అంతేగాక నేటి తెలుగు తల్లిని ఆంధ్ర మాతగా అభివర్ణించారు. తెలంగాణా స్వరూప స్వభావానికి దూరంగా వుండుటమూలంగా ఆంధ్ర ప్రాంతంవారు తెలుగు (పదం) అనే చోట ఆంధ్ర అనే ముద్రనే వాడతారు. కాబట్టి ముమ్మాటికి మన తల్లి తెలుగుతల్లి (ఆంధ్ర మాత కాదు) అని వీరి వాదన

గత యాభైయేళ్లుగా తెలంగాణా భౌగోళికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా ఏనాడు ఆంధ్ర ప్రాంతంతో పోలలేదు. శతాబ్దాల నుండి తన స్వతంత్రను కాపాడుకుంటోంది (ఆ ప్రాంత పండుగ పబ్బాలు, ఆచార వ్యవహారాలు, దేవుళ్ళు, దేవతలూ, శిరోమణులు, కట్టు బొట్టు, మాటతీరు మొ|| విద్యా విషయక, ప్రసార, ప్రచార సాధనాలద్వారా! అందుకే కాపాడుకుంటోందన్నాను) ఈ విధంగా తెలంగాణా ఏర్పడితే తెలంగాణా కళలను సాంఘీకాచారాలను మమేకమైన జంతు జాతులను ప్రతిబింబించే విధంగా (వుండే విధంగా) సమ సమాజ స్వరూపాలను తెలంగాణా ప్రాంత ఔన్నత్యాన్ని ప్రదర్శించే రాష్ట్ర గుర్తులను ఏర్పరచేందుకు యూనివర్సిటీ విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. ఆ విషయమై విద్యార్థి మేధావులు (అనవచ్చో లేదో) ఈ క్రింది వానిని గుర్తించినారు.

1. రాష్ట్ర పక్షి: పిచ్చుక:
పిచ్చుకకు ముందు కోయిల, కాకి, చిలుక చర్చకు వచ్చాయి. కాని తెలంగాణ వాసుల గుండెల్లో చిన్నగూళ్ళు (పిచ్చుక గూళ్ళు) కట్టుకొని కిచకిచ అరుపులతో మనుషులతో పాటు మెలిగేవి. వాటి కొరకు రైతులు ఇళ్లల్లో వరి, సజ్జ కంకులను వ్రేలాడదీసేవారు. గుడిసెలు పోయి, పిచ్చుకలు పోతున్నాయ్‌ అందుకే వానిని చిరస్థాయిగా నిలపాలి. చిలుక, కోయిల ఎందుకు వద్దు: చిలుక రాణి వాసాలందు మెదిలేది, కోయిల అర్థసంవత్సరం కూసేది.

2. రాష్ట్ర జంతువు: ఎలుగుబంటి
ఎలుగుబంటికి ప్రతి గ్రామ గ్రామాన ఎన్నో కథలున్నాయి. ఇది తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా జీవించేవి జాతి ఇదే. తెలంగాణా ప్రాతం వలె ఇది సాదులాంటిదే. ఇతరుల చేతిలో బందీయే. ఇకపై చెర వీడినందుకు గుర్తుగా ఎన్నుకొనబడింది

దుప్పి, లేడి, ఆవు చర్చకు వచ్చాయి: దుప్పి కనుమరుగయ్యింది. పిల్లలకు తెలువదు. లేడి మగయితే కృష్ణజింక మార్పులేదు, ఆవు పశువు (అడవి కోసమని)

3. రాష్ట్ర పుష్పం: తంగేడు పువ్వు
తంగేడు పుష్ప చరిత్ర చెప్పనక్కరలేదు - ఏకగ్రీవం

4. రాష్ట్ర వృక్షం: జమ్మిచెట్టు
దసరా ఉత్సవాలు జమ్మి ఆకులు లేకుండా జరుగవు. మామిడి, వేప, తుమ్మ చర్చకు వచ్చాయి నిలువలేదు (2 చాయిస్‌ తుమ్మ)

5. ఫలం: సీతాఫలం

6. రాష్ట్ర క్రీడ: కబడ్డి
చిర్రగోనె, మల్లయుద్దం (కుస్తీ) చర్చకు వచ్చాయి. ఏ క్రీడైనా తెలంగాణాకే ఎక్కువ ప్రాధాన్యత.

7. రాష్ట్ర చిహ్నం: బతుకమ్మ
బతుకమ్మ ఆట, స్త్రీల స్వేచ్చకు పురుషుల శౌర్యానికి ప్రతీక. దేవత అనే భావం నామమాత్రమే. పూర్ణకుంభం కంటే ఎంతో మేలైంది.

8. రాష్ట్ర గీతం:
అప్రస్తుతం, తెలంగాణా వీరుల సంస్మరణ, వైభవం ప్రాంత విశిష్ఠతతో కూడిన గీతం వ్రాయాల్సి వుంది. భౌగోళిక వర్ణన-ఇదో స్మృతి గీతం.

9. రాష్ట్ర గేయం:
అప్రస్తుతం, తెలంగాణీయులకు ఉద్భోదించే విధంగా వుండాల్సి వున్నది.

ఈ చిహ్నాలు కొందరి వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమే. కాబట్టి వీటిపై చర్చ జరగాలి. తెలంగాణ ప్రజల మనోభావాలు పరిశీలించిన మీదట వీటిని గుర్తించవలసి వున్నది. అభిప్రాయాలు తెలిపి మరియు ప్రోత్సహించిన విద్యార్థులందరికి నా నమస్కారాలు.

3 అభిప్రాయాలు

  1. on 13 ఆగస్టు 2007 at 6:19 am 1.Rakesh TELANGAAN

    డియర్ రాజుభాయ్……

    మన ప్రతిమాటలో, ప్రతి చేతలో తెలంగాణ(త)త్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు చాలా అవసరం!

    ఈ సందర్భంగా మీరు అందజేసిన 9 ఆలోచనలూ బాగున్నాయి.

    “సింతవల్కవండ్లు తినని తెలంగాణోడసలె లేడన్నో..”
    “అయ్యి దొర్కే గుట్టలల్ల -
    గుడ్డేలుగులు తక్కువా పెద్దన్నా….”

    ఇక రాష్ట్ర పక్షి విషయంలో బహుషా.. మనకు ఇంకొక ఆప్షను కూడా ఉన్నదనుకుంటా….

    దసరా నాడు “పాలపిట్ట” చూడాలని, దాంతో మంచి జరుగుతదని తెలంగాణ ప్రాంతంలో ప్రజల నమ్మకం. మరి.. ఈ పిట్ట అందమైంది కూడా.

  2. on 17 సెప్టెంబర్ 2007 at 2:08 am 2.raju

    మనము మన సంస్క్రుథిని కపదుకుంధము

  3. on 13 ఫిబ్రవరి 2008 at 2:38 am 3.palakurthy

    మంచి పని చెస్థున్నవు రాజు , అన్ని బాగనె వున్నాయి ..
    చర్చా బాగ జరిగిథె ఇన్కా మంచిధి

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో