వ్యాసాలు సోయి | 07 జూన్ 2007 07:08 pm
ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 1
- బి.ఎన్.స్వామి
కథలు, కవితలు అనేకం వస్తున్నాయి. సాహిత్యం సంపద్వంతం అవుతున్నది. అనేక దృక్ఫధాలతో వెలువడుతున్న సాహిత్యం అనేక రకాలుగా పదిలపరచబడుచున్నది. ఒకచోట నిక్షిప్తం కానిది అనేకం ఉంది. అదంతా పాఠకులకు చేరాలి. అనేకులు కథలు రాస్తున్నారు. ఎవరెవరు ఏమి రాస్తున్నారు? ఎంతమంది రాస్తున్నారు? అనే లెక్క తేలియాలి. లెక్క తెలుసుకునే క్రమంలోనే చరిత్ర నిర్మాణం జరుగుతది. సమాజం అనేక అస్థిత్వాల మధ్య ముక్కలు ముక్కలుగా కొనసాగుతుంది. దాన్ని ప్రతిభింబిస్తూనే కథా సాహిత్యం వెలువడుతుంది. అటువంటి కథా రచయితల్ని వారి వారి కథల ద్వారా పరిచయం చేయాలనిపించింది. విస్తృతమైన క్యాన్వాసు గల ఈ విషయాన్ని ఏ మూల నుండి ప్రారంభించాలని ఆలోచించాను. జిల్లాల వారిగానో, ప్రాంతాల వారిగానో పరిచయం చేస్తే బాగుంటుందనిపించి ఉత్తర తెలంగాణా ప్రాంతాన్ని ఎంచుకున్నాను. ఇందులో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు లెక్కలోకి వచ్చాయి. ఆ విధంగా ఉత్తర తెలంగాణా కథకుల పరిచయం సాధ్యపడింది. ఒక రకంగా ఇది ఈ ప్రాంత కథా సాహిత్య చరిత్ర.
ఇందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. పాత తరం వద్ద వారి కథలు లేకపోవడం ఒక విషాదం. కథలు లేకపోవడానికి అనేక కారణాలు కనిపించాయి. వీరి కథలు పాత, కొత్త కథా సంకలనాలలో, గ్రంథాలయాలలో, పాతపత్రికలలో దొరికాయి. నేటి కాలపు కథల్ని రచయితల ద్వారా, ఆయా జిల్లాల చిన్న పత్రికల్లో వచ్చిన కథల్ని వాటిద్వారా తీసుకున్నాను. లబ్ధప్రతిష్టుల నుండి మరుగున పడ్డ మరియు ఇటీవల్నే కలం పట్టిన వారి వరకు వివరాలను పొందుపరిచాను. వ్యాస విస్తరణ భీతి వల్ల స్థూలంగా పరిచయం చేశాను. విస్తృత పరిచయం చేస్తూ త్వరలో పుస్తకం వెలువరించనున్నాను. ఇందులో నూట యాభై మంది రచయితల పరిచయం చేశాను. నాదృష్టికి రాని కథా రచయితలు కూడా ఉండచ్చు. వారి వివరాలు కూడా సేకరించాల్సి ఉంది.
1. అల్లం రాజయ్య
కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు మంచిర్యాలలో నివాసముంటున్నారు. వీరి కథలలో కుల, మత, ప్రాంత, భాషా, స్రీ-పురుష వివక్ష చిత్రణ చాలా జరిగింది. సామాజిక వాస్తవికతను యధాతథంగా చిత్రించాడు. వీరి కథలు ఇటీవలి తెలంగాణా కథకు దిశా నిర్దేశం చేశాయి. భూమి లాంటి కథా సంపుటాలను వెలువరించారు. వీరి కథా సాహిత్యం తెలుగు కథ మెడలో వేసిన మణిహారం.
2. అడ్లూరి అయోధ్య రామకవి
వరంగల్ జిల్లాకు చెందిన వీరు తెలంగాణా మంటల్లో అనే పేర ప్రచురించిన కథా సంపుటిలో కాలాన్ని తేవాలి, తల్లి ప్రేమ, చీకటి రాజ్యం, బాంబుల భయం, జనానా స్త్రీ, రజాకార్, అమరలోక యాత్రికులు అనే ఆరు కథలున్నాయి. వీరి కథలు గత చరిత్రను రికార్డు చేసిన సాక్ష్యాలు.
3. అందె వెంకటరాజం
అష్టావధానిగా పేరు గాంచిన వీరు కరీంనగర్ జిల్లా కోరుట్ల నివాసి. దాదాపు డెబ్భయి కథలు రాశారు. విచిత్ర గాధలు అనే సంపుటిని వెలువరించారు. అర్థరాత్రి సుప్రభాతం, పసివాని మూడో పెండ్లి, మైసమ్మ భయం, అంగడి వింతలు, విచిత్రమైన భక్తురాలు మొదలైన కథలు వీరి లోక పరిశీలనా శక్తికి నిదర్శనాలు.
4. అయాచితం నటేశ్వర శర్మ
నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరు బాల సాహిత్య వికాసానికి కృషి చేశారు. విశ్వాసరాహిత్యం అనే కథ బాలలకు చెందినది. అరుదుగా కథలు రాసినా చక్కని బిగువు కలిగిన కథలు రాశారు.
5. అమృత లత
నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరు స్పందన అనే కథా సంపుటిని వెలువరించారు. పన్నెండు కథలతో కూడిన సంపుటి ఇది. పొదరిల్లు మాది, స్వీట్ నాన్సెన్స్‌లాంటి కథలు పాఠకుల్ని ఆకట్టుకుంటాయి.
6. అనిశెట్టి రజిత
వరంగల్ జిల్లా వాస్తవ్యులైన ఈమె కథలు రాశారు. గాజులు, మట్టి బంధం, కొత్తపాట మొదలగు కథలు ఈమె రచనా సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. వాస్తవదృష్టి, ఊహా శక్తికి వీరి కథ పుట్టినిల్లు. ఈమె కథల్నిండా తెలంగాణా ప్రాంతోచిత భాష పరచుకొని ఉంది.
7. అల్లాడి శ్రీనివాస్
కరీంనగర్ జిల్లా కథలాపూర్‌మండలంలోని భూషణరావు పేటకు చెందిన వీరి కథల్లో సున్నితమైన భావుకత్వం గోచరిస్తుంది. మానవ సంబంధాల పట్ల గల వీరి తపన కథలుగా మారింది. ఎడారి పూలు, మబ్బులు తొలిగిన వేళ లాంటి కథలు పాఠకుల ప్రశంసలు పొందాయి. బాటఎరిగిన పాట అనే కథ కథన శక్తికి నిదర్శనం.
8. అకిరెడ్డి శ్రీనివాసరావు
కరీంనగర్ జిల్లాకు చెందిన వీరి నిరసన అనే కథ నల్లకలువలు కథా సంకలనంలో ప్రచురితమైంది.
9. అమ్జద్
వరంగల్ జిల్లాకు చెందిన వీరు మంచి కథా రచయిత. దెబ్బకు దెబ్బ, రేయంత తిరిగేవు చందామామ, కలిసొచ్చినవేళ లాంటి అనేక కథలు రాశారు.
10. అన్నవరం దేవేందర్
కరీంనగర్‌కు చెందిన వీరు కొన్ని కథలు రాశారు. చింత చచ్చినా, జైలు బడి, నేమ్ ప్లేట్ లాంటి కథలు రాశారు. కథల్లో వస్తు వైవిధ్యం ఉంది.
11. ఆవాల దామోదర్ రెడ్డి
వరంగల్ జిల్లాకు చెందిన వీరు కామధేనువు అనే కథా సంపుటిని వెలువరించారు.
12. ఆడెపు లక్ష్మీపతి
కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. చైతన్య స్రవంతి టెక్నిక్‌తో కథలు రాసిన రచయిత లక్ష్మీపతి. జీవన్మృతుడు అనే కథను చైతన్య స్రవంతి టెక్నిక్‌లో రాశారు. ఇతను వెలువరించిన నాలుగు దృశ్యాలు కథా సంపుటిలో వస్తు పరంగానూ, శిల్ప పరంగానూ వైవిధ్య భరితమైన కథలున్నాయి.
13. ఉమ్మెంతల వెంకట రెడ్డి
కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. పోచమ్మ అనే కథ బద్‌లా కథా సంకలనంలో ప్రచురితమైంది.
14. శ్రీమతి ఉమా భాస్కర్
నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన వీరు రాసిన కథ ఆశీర్వాదం. చాలా కథలు స్థానిక పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
15. ఉలి
పూర్తిపేరు ఉప్పుల లింగయ్య. కరీంనగర్‌కు చెందిన వీరు అనేక కథలు రాశారు. వీరి కథల్లో రాతితేమ అనే కథ వీరి శిల్ప నైపుణ్యాన్ని పట్టిస్తుంది. దోపిడి, పరీక్ష, రాబందు, పాము లాంటి అనేక కథలు రాశారు.
16. ఎం. విజయమోహన్ రెడ్డి
కరీంనగర్‌లో పేరున్న వైద్యులు. ఇది కళ్యాణ సంస్కృతా!, దొరకని భాగ్యం మొదలగు కథలు రాశారు. వీరి కథలన్నీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
17. యం.వి. తిరుపతయ్య
వరంగల్‌లో నివాసముంటున్న వీరు చాలా రచనలు చేశారు. వీరి న్యాయం కథ చీకటిరోజులు అనే నవలకు ప్రేరణ ఇచ్చింది. ఈ కథ బద్‌లా కథా సంకలనంలో ప్రచురితమైంది.
18. యం. శరత్ కుమార్
వీరు కరీంనగర్ వాస్తవ్యులు. వీరు రాసిన రేపటి ఉదయం అనే కథ బద్‌లా కథా సంకలనంలో ప్రచురితమైంది.
19. ఎ.వి. అనిల్ ప్రసాద్
వరంగల్ జిల్లానుండి ఎదిగిన కథా రచయిత వీరు. పరివర్తన, కిటికీ పక్కసీటు లాంటి కథలు అనేకం రాశారు. భాషపై గల వీరి పట్టు కథల్లో కనబడుతుంది.
20. ఎస్. హర్షవర్ధన్
కరీంనగర్ నివాసి. కథ రాయాలనుంది, వరకట్న నిషేదం, మహాసభ, నిరుద్యోగి లేఖ లాంటి కథలు రాశారు. ఎదుగుతున్న కథకుడు.
21. ఏ. ఆంజనేయ ప్రసాద్
కరీంనగర్‌కు చెందిన వీరు చాలా తక్కువ కథలు రాశారు. తనదాకా వస్తే అనే కథ చిన్నారి కథానికలు బాల కథా సంకలనంలో ప్రచురితమైంది.
22. ఎనుగంటి వేణుగోపాల్
కరీంనగర్ చిల్లాకు చెందిన మంచి కథకుడు. రుణం అనేది మంచి కథ. వీరి కథల్లో తెలంగాణా పలుకుబడులు జాలువారుతుంటాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన వీరు ఎదుగుతున్న కథకుడు.
23. ఎడమ శ్రీనివాస్ రెడ్డి
వరంగల్ జిల్లాకు చెందిన వీరు చిన్న కథలతో సాహితీ సేవ చేస్తున్నారు. యువతరం అనే వీరి కథ మినీ కథగా చెప్పుకోవచ్చు. ఇల్లిట్రేట్ అనేది వీరి మరో కథ.
24. ఒద్దిరాజు రాఘవ రంగారావు
వరంగల్ జిల్లా మానుకోట తాలుకా ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు. వీరు రాసిన కథ లండన్ విద్యార్థి. ఆనాటి సమాజంలో ఇంగ్లీషు చదువుల పట్ల గల మోజు ఈ కథలో చిత్రించారు. ఈ కథ సాక్షి వ్యాసాలను తలపిస్తుంది.
25. ఒద్దిరాజు సీతారామచంద్ర రావు
వీరు రాఘవ రంగారావు గారి సోదరులు. ఒద్దిరాజు సోదరులు ఉర్దూ, పార్సీ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలు తెలిసినవారు. సంగీత, సాహిత్యాల్లో నిష్ణాతులు. వీరి రక్తమూల్యము అనే కథ ప్రసిద్ధి చెందినది. భాష, కథనం, వస్తువు సనాతనమైనవి. ఈయన ఇంకా అదృశ్య వ్యక్తి, నటి మొదలైన కథలు రాశారు.
26. కర్ర ఎల్లారెడ్డి
వరంగల్ జిల్లాకు చెందిన కర్ర ఎల్లారెడ్డి వృత్తిరీత్యా వకీలు. వీరు అదాలత్ కథలు అనే కథా సంపుటిని వెలువరించారు. తెలంగాణా కథ పేర ప్రతి ఏటా తన సంపాదకత్వంలో ఒక సంకలనాన్ని వెలువరిస్తున్నారు.
27. కలకోట కిషన్ రావు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన మంచి కథకులు. పేదవాడి కన్ను అనే కథ దళిత కథగా చెప్పవచ్చు. కథల్లోని పల్లె వాతావరణం, సామెతలు, కథలకు బలాన్నిచ్చాయి.
28. కటుకోజ్వల మనోహరాచారి
కరీంనగర్ జిల్లాకు చెందిన యువ కథకుడు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిర పడి సాహితీ సేవ చేస్తున్నారు. కథలన్నీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సమస్యా పూరణం, వర్షంలో వనకన్య లాంటి కథలు వీరి కథన శక్తికి ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి కలం ఎక్కువగా మానవ జీవితంలోని సుఖ సంతోషాలను పట్టి చూపుతుంది.
29. కాళోజీ
వరంగల్ వాసి. కాళోజీ కథలు అనే కథా సంపుటిని కాళోజీ ఫౌండేషన్ వారు వెలువరించినారు. ఇందులో మూడు కథలు మరాఠీ కథలకు అనుకరణలు. ఒక కథను ఇంగ్లీషునుండి అనువదించినారు. మిగతావి స్వతంత్ర కథలు. భూతదయ అనే కథ మిత్రులైన వెల్దుర్తి అవధానులతో కలిసి రాశాడు.
30. కాలువ మల్లయ్య
కరీంనగర్ వాస్తవ్యులు. దాదాపు ఏడు వందల వరకు కథలు రాసిన వీరు స్పృశించని సమస్య లేదు. కాలువ మల్లయ్య కథలు, మా కథలు, అవ్వతోడు గిది తెలంగాణ, రాజు కోడి లాంటి అనేక సంపుటాలు వెలువరించారు. తెలంగాణా ప్రాంతోచిత భాష వీరి కథలకు జీవశక్తిని ఇచ్చింది.
31. కారెంపూడి మార్కండేయ
నిరసన అనే వీరి కథ శ్వేతరాత్రులు కథా సంకలనంలో ప్రచురితమైంది. కరీంనగర్‌కు చెందిన వీరు బాల గెరిల్లా, మంకీ లాంటి మరిన్ని కథలు రాశారు.
32. కె. రాంమోహన రాజు
వరంగల్ జిల్లాకు చెందిన వీరు అనామకుడి డైరీ అనే కథా సంపుటిని వెలువరించారు. మాండలిక, వ్యవహారిక భాషల్ని కథల్లో కొనసాగిస్తారు. పాత్ర చిత్రణపై ఎక్కువ దృష్టి పెడుతారు. ఏ కథాంశం తీసుకున్నా వీరి కంఠ స్వరం పీడిత, తాడిత జనం వైపే ఉంటుంది. కొత్త కొత్త అలంకారాలతో ప్రతీకలతో వీరి శైలి కాంతులీనుతుంది.
33. కె. వి. నరేందర్
పాఠకులను ఆకట్టుకునే విధంగా కథ రాయగలిగే వీరు కరీంనగర్ వాసి. సింగిల్ కాన్సెప్ట్‌తో కథలు రాసి ప్రచురించడం వీరి హాబి. అమ్మ, యుద్ధం, బురదలో జాబిల్లి, ఊరు మొదలైన కథా సంపుటాలను ప్రచురించారు. వస్తు వైవిధ్యంలోనూ, శిల్పంలోనూ, తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్నారు.
34. కె. సూర్యముఖి
సమాజాన్ని స్పష్టమైన అవగాహనతో పరిశీలించి, సమస్యల్ని పరిష్కరించే దిశగా కథలను సృష్టించిన వరంగల్ వాసి. సర్పాలు-సర్పదష్టులు అనే కథా సంపుటిని ప్రచురించారు. వీరి రచనా శైలి ఉత్కంఠగా చదివిస్తుంది.
35. కె. శ్రీవాణి
నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన ఈమె రాసిన కథ ”నీరూ-నీరూ-నీవెక్కడ”. వీరి కథలు స్థానిక పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
36. కె. విజయలక్ష్మి
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈమె అమ్మమ్మతో కబుర్లు లాంటి అనేక కథలు రాశారు. తాత్వికత ప్రధాన అంశంగా వీరి కథలు నడుస్తాయి.
37. కొక్కుల భాస్కర్
కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన మంచి కథకులు. తెగిన పోగు వీరి ప్రసిద్ధి చెందిన కథ. పద్మ పీఠం అనే పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు. వీరి అనేక కథలు అనుభవసారాలు.
38. కొక్కుల పద్మావతి
కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన ఈమె కథల్ని అనువదించారు. దాదాపు పది దాకా స్వతంత్ర కథలు రాశారు. పాల మీగడ, ప్రశంస కథలు ఎక్కువ ప్రసిద్ధి చెందిన కథలు.
39. కొల్లు రంగారావు
నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరి పసి(డి) మనసు అనే కథ వేదగిరి రాంబాబు సంకలించిన చిన్నారి కథానికలులో ప్రచురితమైంది. నిరలంకార శైలిలో రాసిన మిగతా కథలు ఆసక్తికరములు.
40. గట్టు నారాయణ
కరీంనగర్ జిల్లా మంథని వాస్తవ్యులైన వీరు ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఆధ్యాత్మిక నేపథ్యంలో వీరు అనేక కథలు ఆంగ్లంలో రచించారు. సేతువు, సముద్రము అనేవి తెలుగు కథలు. ప్రతి కథ పారమార్థిక చింతనను కలిగించి మనిషిని సద్వర్తనునిగా చేస్తుంది.
41. గన్ను కృష్ణమూర్తి
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న వీరు తపస్సు అనే కథా సంపుటిని వెలువరించారు.
42. గర్శకుర్తి రాజేంద్ర శర్మ
నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరు పండుగ కథలు అనే కథా సంపుటిని వెలువరించారు. ఈ కథల్లో జాతీయ పండుగలతో పాటు, హిందూ పండగల గురించి తెలిపారు. ప్రామాణిక భాష, ఉత్తమ పురుష కథనం, జాతీయాలు, జాతీయ భావన వీరి కథలకు వెన్నెముకగా నిలిచాయి.
43. గులాబీల మల్లారెడ్డి
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన వీరు వకీలు. జర్నలిస్టు అనేది వీరి కథా సంపుటి. ఈ సంపుటి వీరి స్పందనలకు, సామాజిక స్పృహకు తార్కాణంగా నిలుస్తుంది.
44. గర్శకుర్తి శ్యామల
కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. ఇంటింటికో దీపావళి, స్ఫూర్తి, పెళ్ళి, వెతల నడుమ చదువు లాంటి అనేక కథలు వీరు రాశారు. విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు.
45. గజానన్ థామన్
వీరు కరీంనగర్ జిల్లా మంథని వాస్తవ్యులు. వీరు అనేక కథల్ని అనువాదం చేశారు.
46. గీతాంజలి (డా|| భారతి)
విరివిరిగా కథలు రాసే వీరు ఆదిలాబాద్‌కు చెందినవారు. బచ్చేదాని అనే కథా సంపుటిని వెలువరించారు. చాలా పత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. బోన్సాయ్, ఖడ్గచాలనం, వికలాంగుడు మొదలగునవి వీరి కథా నిర్మాణాన్ని చూపుతాయి. ముస్లిం స్త్రీల సమస్యలపై విరివిగా కథలు రాస్తున్న గీతాంజలి ఇటీవలెనే ముస్లిం స్త్రీల అస్తిత్వ పోరాట కథలు ‘పహెచాన్’ను వెలువరించారు.
47. గుండెబోయిన శ్రీనివాస్
వరంగల్ నుండి ఎదుగుతున్న కథకుడు శ్రీనివాస్. దొంగ, ఆకలి-ఆడది, పంపకాలు, మమకారం లాంటి అనేక కథలు వీరు రాశారు.
48. గుజ్జేటి గణేశ్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన కథకులు. కేవలం రెండు పాత్రలతో నడిచిన కథ మరచిపోకుసుమా! లేఖా రచన పద్ధతిలో సాగిన కథ ఇది. చాలా కథలు సామాజిక సమస్యల్ని చిత్రించాయి.
49. గుండెడప్పు కనకయ్య
కరీంనగర్‌కు చెందిన వీరు మేమిట్లుండం కథా సంకలనంతో కథా రంగాన కాలు మోపారు. దళిత స్పృహతో దళిత కథా సాహిత్యాన్ని సృజించాడు. కథలు హరిజనుల జీవన సందర్భాలను, వేదనలను, వేడుకలను, ఊహలను, ఉద్వేగాలను, సర్దుబాట్లను, తిరుగుబాట్లను ప్రతిఫలించాయి.
50. గూడూరి అమరావతి
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఈమె దాదాపు పది కథలు రాశారు. గూడు-నిట్టాడు అనే కథ ప్రసిద్ధి చెందింది.
51. గూడూరి సీతారాం
కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు చెందినవారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దాదాపు ఎనభై వరకు కథలు రాశారు. గూడూరి సీతారాం కథలు పేరున కథా సంపుటి వెలువరించారు. వీరి చాలా కథలు అందుబాటులో లేవు. నారిగాని బతుకు, రాజమ్మ రాజీర్కం, లచ్చి లాంటి కథలు యదార్థ జీవన దర్పణాలు.
52. గోపు లింగారెడ్డి
కరీంనగర్‌కు చెందిన వీరు సాహిత్య కార్యకర్త. చింతచెట్టు, (అ)ధర్మవడ్డీ, వన్నెలరాజు మీసాల కథ లాంటి కథల్ని రాశారు.
53. గోపీభాగ్యలక్ష్మి
వీరి జంగుబాయి కథ శ్వేతరాత్రులు కథా సంకలనంలో ప్రచురితమైంది. భాగీరధి లాంటి మరికొన్ని కథలు రాసిన వీరు ఆదిలాబాద్ వాస్తవ్యులు.
54. గౌతమ్ నరసింహ మూర్తి
వీరు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. ఇంటర్వ్యూ మొదలగు కథలు రాశారు. నల్లకలువలు కథా సంకలనంలో వీరి కథ ప్రచురితమైంది.
55. చంద్ర
చంద్రగా పేర్గాంచిన మైదం చంద్రశేఖర్ వరంగల్ జిల్లాకు చెందిన వారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక కథలు రాసి సంపుటాల్ని కూడా వెలువరించారు. తెలిసిన కథ అనే ఒక్క కథ తీసుకొని గమనిస్తే కథా సాహిత్యం పట్ల వీరికి గల అవగాహన, లోతు విశదమవుతుంది.
56. చింతల దేవేందర్
వీరు కరీంనగర్ జిల్లా వేములవాడ వాస్తువ్యులు. సుమారు 30 కథల వరకు రాశారు. ఇవన్నీ చిన్న కథల కోవలోకి వస్తాయి. థాంక్యూ మమ్మీ, జ్ఞాపకం, చిత్తశుద్ధి, విష్ణుమాయ, విలువలు లాంటి కథలు వీరి రచనా శైలికి నిదర్శనాలు. నిరలంకార శైలిలో సాగే వీరి కథనం ఆసక్తిని గొలుపుతుంది.
57. చెన్నమనేని రాజేశ్వర్‌రావు
కరీంనగర్ జిల్లా కోనారావుపేట మండలంలోని నాగారంలో జన్మించారు. రాజకీయ నాయకునిగా సుప్రసిద్ధుడు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో వీరు జైలులో ఉండగా పిట్ట బతుకు అనే కథ రాశారు.




on 11 ఆగస్టు 2007 at 10:24 am 1.sridhar deshpande …
ఈ పరిశోధన వ్యాసం రాసింది బి.వి.ఎన్ స్వామిగా చదువుకోవాలి
ఎడిటర్
on 25 మార్చ్ 2008 at 6:42 am 2.arvind …
తెలుగు ఫాంట్ చదవడానికి అనువుగా లేదు, మార్చితే బాగుంటుంది.
on 25 మార్చ్ 2008 at 7:10 am 3.arvind …
అలిశెట్టి ప్రభాకర్ ని మరిచారు
on 05 నవంబర్ 2008 at 6:09 pm 4.Animal porn exclusive zoo sex animal porn only. …
Zoo porn sex porn xxx and….
Zoo porn. Video zoo porn beastiality sex girls. Animal horse dog beast zoo porn sex cum fuck. Horse porn beast porn zoo porn dog. Zoo porn animal porn horse porn. Horse porn beast porn zoo porn dog porn….