పోస్టులు అభిప్రాయాలు 08 February 2012

వ్యాసాలు సోయి | 07 జూన్ 2007 06:49 pm

ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 3

- బి.ఎన్‌.స్వామి

118. రామ శంకర్‌
కరీంనగర్‌ జిల్లాకు చెందిన వీరి అంతర్మథనం అనే కథ నల్లకలువలు కథా సంకలనంలో ప్రచురితమైంది. వీరు అనేక కథలు రాశారు.

119. రామ భోజ
కరీంనగర్‌కు చెందిన బి. రాములుగారు రామ భోజ అనే పేరుతో రచనలు చేశారు. ఎక్కడవేసిన గొంగళి…., చీడపురుగులు, సంస్కారి అనే కథలు వీరి సామాజిక స్పృహకు నిదర్శనలు.

120. రామా చంద్రమౌళి
వరంగల్‌కు చెందిన మంచి కథకులు. తెగిన చుక్కలు అనే కథా సంపుటిని ప్రచురించారు. వీరి కథల్లో ఆర్థిక పరమైన వెసులు బాటు లేందే జీవించడం కాని, ఆశయం సిద్ధింపచేసుకోవడం కాని కష్టం అనే వాస్తవిక దృక్పథం కనిపిస్తుంది. తెగిన చుక్కలు, అలసిన రెక్కలు అనే రెండు కథల్ని పరిశీలిస్తే వీరి కథా సంవిధానం బోధపడుతుంది. పాత్రోచిత భాషల్ని వీరు వాడుతారు.

121. రుద్రవరం ఎల్లయ్య
కరీంనగర్‌ లోని హుస్నాబాద్‌ ప్రాంతానికి చెందిన వీరు స్త్రీ సమస్యను, దళిత సమస్యను తన కథల్లో చిత్రించారు. పుట్టుకూడదు అనే కథ వీరి కథా కౌశలానికి నిదర్శనం.

122. రేగులపాటి కిషన్‌ రావు
కరీంనగర్‌కు చెందిన వీరు ఈ తరం కథలు, స్వామీజీ కథలు అనే కథా సంపుటాలను వెలువరించారు. వ్యావహారిక భాషలో కథ చెప్పడం వీరి శైలి. ప్రేమలు, మూఢ నమ్మకాలు, సామాజిక అంతరాలు, మోసం, విఫల ప్రేమ లాంటివి వీరి కథలకు ఇతివృత్తాలు.

123. రేగులపాటి విజయలక్ష్మి
కరీంనగర్‌కు చెందిన వీరు పట్టుదల, ప్రతీకారం లాంటి కథల ద్వారా కథారంగ ప్రవేశం చేశారు.

124. వడ్డెబోయిన శ్రీనివాస్‌
వరంగల్‌కు చెందిన మంచి కథకులు. అనేక పత్రికల్లో కథలు ప్రచురితమయ్యాయి. బతుకు, భూకంపం, ఝాన్సీ, పబెటువొల, ఆకలిరోగం మొదలైన కథలు వీరి కథా ప్రతిభకు నిదర్శనాలు.

125. వరిగొండ కాంతారావు
వరంగల్‌కు చెందిన వీరి పదకొండు కథల సంపుటి దోస్తానా వెలువరించారు. కథల్లో ఎత్తుగడ, ముగింపు ఆకర్షణీయంగా ఉంటాయి. కథల్లోని వ్యంగ్యం పాఠకుల్ని ఆలోచింపచేస్తుంది. వర్షం, దోస్తానా, రిజర్వేషన్లూ వర్సెస్‌ ప్రతిభ, మృతవీరుడు లాంటి కథలు పాఠకుల్ని ఆలోచనల్లో పడవేస్తాయి.

126. వంశీకృష్ణ
వరంగల్‌ జిల్లాకు చెందిన వీరు మంచి కథకులు. వంశీకృష్ణ కథలు అనే కథా సంపుటిని వెలువరించారు.

127. వనమాల చంద్రశేఖర్‌
కరీంనగర్‌ జిల్లాకు చెందిన వారు. తక్కువ రాసినా మంచి కథలు రాశారు. వీరి కథలు సామాజిక సమస్యలకు ప్రతి బింబాలు. శిథిలాలు అనే కథ ప్రసిద్ధి చెందినది. వీరి శైలి పాఠకులకు ఆసక్తిని గొలుపుతుంది.

128. వల్లూరిపల్లి రంగారావు
వీరు ఆదిలాబాద్‌కు చెందిన కథా రచయిత. కీర్తిశేషులైన వీరి కథ లాకౌట్‌, భూమిక కథా సంకలనంలో ప్రచురించబడింది. ప్రభుత్వ విధానాలు, పని పరిస్థితులు వ్యక్తులను ఏ విధంగా మార్చుతున్నాయో రచయిత కథలో చెప్పారు. వీరి మరిన్ని కథలు అలభ్యము.

129. వాసాల నర్సయ్య
కరీంనగర్‌ జిల్లాకు చెందిన వీరు, వివిధ విషయాలపై గల్పికలు రాశారు. దాదాపు తొంభైదాకా గల్పికలు రచించి సంపుటిని వెలువరించారు. వీరి శీర్షికలు ఆసక్తిగొలుపుతాయి.

130. వినోద్‌
కరీంనగర్‌కు చెందిన వీరి కథ పునాది, బద్‌లా కథా సంకలనంలో ప్రచురితమైంది. వీరు మంచి కథకులు.

131. వి.ఆర్‌. అవధాని
కరీంనగర్‌ జిల్లా మంథనికి చెందిన వారు. గోలకొండ పత్రిక సంపాదక వర్గంలో వీరొకరు. పూర్తిపేరు వేంకట రాజన్న అవధాని. గేయాలు, కవిత్వం, కథలు రాశారు. తిరుగుబాటు అనే వీరి కథ స్త్రీ విద్య, స్త్రీ స్వేచ్ఛ గురించి చర్చించింది. 1930లో పతిపత్ని అనే నవల రాశారు.

132. వీరగోని పెంటయ్య
కరీంనగర్‌ వాసి. కథాభిమాని. స్వయంగా కథకుడు. వీరి కథలు ఆహ్వానం, సృజన లాంటి పత్రికల్లో అచ్చయ్యాయి. ఎవరి రక్షకులు, ఊర పిచ్చుకలు, పోరుపెట్టి…, సమ్మవ్వ తల్లి, రేపురా అనే కథలు వీరి ఆలోచనల్ని పట్టిస్తాయి. వీరి కథలు కొన్ని అలభ్యాలు.

133. వేల్పుల నారాయణ
అనేక కథలు రాసిన వీరు కరీంనగర్‌ సింగరేణి కార్మికుల నుండి ఎదిగిన కథకుడు. అగ్గి అనే వీరి కథ నల్లకలువలు అనే కథా సంకలనంలో ప్రచురితమైంది.

134. వేముల సత్యనారాయణ
కరీంనగర్‌ జిల్లాకు చెందిన వేముల సత్యనారాయణ వృత్తిరీత్యా లెక్చరర్‌. అరుదుగా కథలు రాసే వీరు చాలా తక్కువ కథలు రాశారు. వీరి కథలు వస్తు వైవిధ్యంతో కూడుకొని ఉంటాయి. అందుకు ఉదాహరణగా వీరి రికార్డ్‌ డాన్సర్‌ నిలుస్తుంది. అవే నోళ్ళు అనే కథ వీరి అభ్యుదయ దృక్పథాన్ని స్పష్టపరుస్తుంది.

135. శ్రీధర్‌రావు దేశ్‌పాండే
ఊసరవెల్లి, ఆభిజాత్యం, లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌, మరేకిసాన్‌, ముసురిడ్సిన మొగులు, బొక్కలు మోసే గాడ్ది లాంటి అనేక కథలు రాసిన వీరు ఆదిలాబాద్‌ జిల్లా వారు. అనేక పత్రికల్లో వీరి కథలు కనిపిస్తాయి.

136. శ్రీదాస్యం లక్ష్మయ్య
కరీంనగర్‌ చెందిన వీరి కథల్లో తెలంగాణా ప్రాంతోచిత భాష జాలువారింది. హత్య, మంకు, తల్లిపానం, కలిసొచ్చిన కాలం, ముందొచ్చిన అల్లుడు, డబ్బల గాడి లాంటి కథలు సామాజిక సమస్యలను చిత్రించాయి.

137. శ్రీరంగస్వామి. టి
వరంగల్‌ జిల్లాలో ఉంటున్న వీరు సజీవ చిత్రాలు అనే కథా సంపుటిని వెలువరించారు. ఇందులో ఐదు కథలున్నాయి. ఇవి ఊహించి రాసిన కథలు కావు. తను చూసిన, అనుభవించిన విషయాల్ని కథలుగా మలిచారు. వేరు, భయం. లాలస, ఆవిష్కరణ, మేడి పండు కథలు నిష్టుర సత్యాలు.

138. సదానంద శారద
అవిశ్రాంతంగా రచనలు చేస్తున్న వరంగల్‌ వాసి. జాడి అనే కథా సంపుటిని వెలువరించారు. ఈ కథలు పాఠకులను విశేషంగా ఆకర్షించాయి. జాడి, వలపు, తులసి మొక్క, పనస పండు లాంటి కథలు వీరి కథా నిర్మాణ కౌశలానికి నిదర్శనలు.

139. సదాశివ
అరుదుగా కథలు రాసిన ఆదిలాబాద్‌ వాస్తవ్యులు. యాది సదాశివగా పేర్గాంచినారు. సంగీత సాహిత్యాల్లో శిఖర సమానులు. నగ్న సత్యాలు, పరివర్తనము, ప్రాయశ్చిత్తము, కళా పరమావధి లాంటి కొన్ని కథలు వీరి అభిరుచికి నిదర్శనాలు.

140. సరిపెల్లి కృష్ణారెడ్డి
కరీంనగర్‌ జిల్లాకు చెందిన మరో కథకుడు సరిపెల్లి కృష్ణారెడ్డి. బిగిసిన పిడికిల్లు, మౌనపోరాటం, మెట్ట వేదాంతం లాంటి కథలు రాశారు.

141. సంకెపల్లి నాగేంద్ర శర్మ
కరీంనగర్‌ జిల్లా వేములవాడ వాస్తవ్యుడు. యాది, రామభక్తి, పక్కింటావిడ, ఆత్మ కథ, వేసవి సెలవులు వద్దు బాబోయ్‌ మొదలగు కథలు రాశారు. దాదాపు అన్ని కథలు సర్వసాక్షి దృష్టికోణంలో రాశారు. జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నందున, కథల్లో కూడా జర్నలిస్టిక్‌ అప్రోచ్‌ కనబడుతుంది.

142. సంపత్‌ కుమార్‌
ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ మట్టిలో పుట్టి పెరిగిన వీరు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నివాసముంటున్నారు. తన దేశ, విదేశ పర్యటన అనుభవాల్ని కథలుగా మలిచారు. శాస్త్రీయ అవగాహన, మానవ సంబంధాలు, నైతిక విలువలు అనే వాటి పునాదిగా కథలు రాశారు. లియోసా వీరి కథా సంపుటి.
143. సయ్యద్‌ ఖుర్షీద్‌
వరంగల్‌ జిల్లాకు చెందిన వర్థమాన కథకుడు. బాబోయ్‌ పోలీసు, లేట్‌ రవూఫ్‌, బేవకూఫీ లాంటి అనేక కథలు వీరి కథా కౌశలానికి నిదర్శనాలు.

144. సబ్బని లక్ష్మీనారాయణ
కరీంనగర్‌కు చెందిన వీరు అతి తక్కువగా కథలు రాశారు. కథలన్నీ ప్రముఖ పత్రికల్లో అచ్చయ్యాయి. అనుభవ శకలాలు, నైజం అనేవి ప్రథమ ముద్రితాలు. బాధ్యత, పెళ్లి కూతురు, పొద్దు తిరుగుడు పూలు, కుడి ఎడమైతే కథలు కథన శక్తిని తెలిపేవిగా ఉన్నాయి. అతని అక్షరమ్మీద చెవి పెట్టి వినండి అనే కథ రాష్ట్రస్థాయి బహుమతిని అందించింది. కరువచ్చింది, బేరం లాంటి మరిన్ని కథలు వీరి కలం నుండి వెలువడ్డాయి.

145. సి.హెచ్‌. మధు
నిజామాబాద్‌ జిల్లాకు చెందినవారు. వీరివి అన్నీ మినీ కథలు. వీరు సూటిగా కథలోకి పయనిస్తారు. కథ కాలక్షేపం కోసం కాదు అని గట్టిగా నమ్మిన వ్యక్తి. తనదాకా వస్తే, సంధ్యా సమస్య, మేధావి-ధనవంతుడు-కూలి, చర్చలు మొదలగు కథలన్నీ వీరి నిబద్ధతకు నిదర్శనాలు.

146. సి. జయపాల్‌ రెడ్డి
వరంగల్‌ జిల్లాకు చెందిన వీరు స్వాప్నికుడు అనే కథా సంపుటిని వెలువరించారు. శిక్ష, సంధ్యాకాంతి లాంటి కథలు వీరి కథా కౌశలాన్ని నిరూపిస్తాయి.

147. సి. నారాయణ రెడ్డి
కరీంనగర్‌ జిల్లా హన్మాజీపేటలో జన్మించిన వీరు జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత. ప్రసిద్ధ కవి. విశ్వంభర కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అనేక బిరుదులు, పదవులు అందుకున్న వీరు కథలు కూడా రాశారు. కలీం-మీర్జా అనే కథ సారస్వత జ్యోతి - డిసెంబర్‌ 1954 సంచికలో ప్రచురితమైంది. మరొక కథ అలభ్యం.

148. సిరిమల్లె రూప
ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వీరు అతి తక్కువగా కథలు రాశారు. వీరి ఝాన్సీ కథ రుతుపపనాలు కథా సంకలనంలో ప్రచురితమైంది.

149. సుగంధ శ్రీనివాస్‌
చిప్ప బత్తుల శ్రీనివాస్‌ కలం పేరు సుగంధ. కరీంనగర్‌ జిల్లా ఊటూరు గ్రామ నివాసి. దాదాపు ఇరవై కథల వరకు రాశారు. అనేక పత్రికల్లో వీరి కథలు వచ్చాయి. వీరి కథల్లోని శైలి చదువరులను ఆకట్టుకుంటుంది. సప్తవర్ణాల ఆశ, అందమైన మలుపు, స్పెల్లింగు మిస్టేక్‌, తస్మైశ్రీ గురవే నమః, సంధ్యా వందనం, బామ్మా కలాపం, దోసిట్లో హృదయం, మనసు దోసిట పట్టి, అసలైన తోడూ నీడ లాంటి కథలు వీరి కథన శక్తిని పట్టిస్తాయి.

150. సైబ పరంధాములు
నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వీరు ప్రముఖ చిత్రకారుడు. వీరు రాసిన ముళ్ళకిరీటం అనే కథ శైలీ, శిల్పాల దృష్ట్యా ఎన్నదగినది.

8. వెంకట సుబ్బయ్య వల్లంపాటి - నవల - ప్రజలు (అనువాద నవల) - విశాలాంధ్ర పబ్లిషింగు హౌజ్‌ హైదరాబాద్‌ - ఫిబ్రవరి 1992

విమర్శా సాహిత్యం

1. ఆర్వీఆర్‌ - సాహిత్య తత్వం - విశాలాంధ్ర పబ్లిషింగు హౌజ్‌, హైదరాబాద్‌ - 1988
2. ఇల్సా ఎహ్రెన్‌బర్గ్‌ - రచయిత, శిల్పము - (వివరాలు అలభ్యం)
3. ఐలయ్య కంచ - ఉత్పత్తి - తెలుగు సాహిత్య వారసత్వం - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ - డిసెంబర్‌ 2003
4. ఐలయ్య కంచ - మన తత్వం (దళిత బహుజన తాత్వికత) - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ - జూలై 2000
5. కన్నాభిరాన్‌ వసంత - కఠోర షడ్జమాలు - ఫెమినిస్ట్‌ వ్యాసాలు - పర్‌స్పెక్టివ్‌ - హైదరాబాద్‌ 1996
6. కాత్యాయిని విద్మహే - తెలుగు నవలా కథానిక విమర్శన పరిణామం - చరిత ప్రచురణలు 1995
7. కృష్ణ ఎస్‌. వి. - ”కథా” కమామీషు - జయంతి పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌ - డిసెంబర్‌ 2000
8. కృష్ణమూర్తి రాంభట్ల - ముక్తానుషంగం - లైఫ్‌ ఇన్‌ ఎ కాలేజ్‌ - కథా సంకలనానికి ముందుమాట
9. గుడిపాటి - ఫాయిదా - మొలక ప్రచురణలు - నవంబర్‌ 2002
10. చెంచయ్య వి - సాహిత్య దృక్ఫథం - విరసం - నెల్లూరు జిల్లా యూనిట్‌ - 2001
11. జయశంకర్‌ కె, సింహాద్రి ఎస్‌ - తల్లడిల్లుతున్న తెలంగాణా - సెంటర్‌ ఫర్‌ తెలంగాణా స్టడీస్‌ - హైదరాబాద్‌ - మే 2001
12. తిరుమల రావు జయధీర్‌ - పొది, సంభాషణలు, అక్షర చిత్రాలు - గోదావరి ప్రచురణలు - 2003
13. దక్షిణామూర్తి పోరంకి - కథానిక స్వరూప స్వభావాలు - హైదరాబాద్‌ - 1988
14. నవీన్‌ - ఆధునిక సాహిత్యంలో చైతన్య స్రవంతి - సోమవారం, విశాలాంధ్ర సాహిత్యానుబంధం - ఆగస్టు 01, 2005
15. నరసింహమూర్తి యు.ఎ. - కథా శిల్పి చాసో - విశాలాంధ్ర పబ్లిషింగు హౌజ్‌, హైదరాబాద్‌ - ఫిబ్రవరి 2001
16. నారాయణ సింగమనేని, మధురాంతకం రాజారాం - తెలుగు కథకులు , కథన రీతులు (సంకలనాలు 1, 2, 3, 4) - విశాలాంధ్ర పబ్లిషింగు హౌజ్‌, హైదరాబాద్‌
17. పద్మారావు కత్తి - దళిత సాహిత్యవాదం - జాషువా - లోకాయుత ప్రచురణలు - పొన్నూరు - డిసెంబర్‌ 1994
18. ప్రతాపరెడ్డి కాసుల - భౌగోళిక సందర్భం - తెలంగాణా సాంస్కృతిక వేదిక ప్రచురణ - ఆగస్టు 2001
19. మధుసూధన రావు త్రిపురనేని - సాహిత్యంలో వస్తు శిల్పాలు - పర్‌స్పెక్టివ్‌, హైదరాబాద్‌
20. మల్లయ్య కాలువ - తొమ్మిది పదుల తెలంగాణా కథ - జిరాక్స్‌ బైండ్‌ కాపి
21. రాంమ్మోహన్‌ సొదుం - సాహిత్యంలో శిల్పం - విశాలాంధ్ర పబ్లిషింగు హౌజ్‌, హైదరాబాద్‌ 1999
22. రాంబాబు వేదగిరి (సంకలన కర్త) - కథానిక లక్ష్యము, లక్షణాలు - తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ - 2000
23. రాములు బి.ఎస్‌. - కథల బడి - కథాసాహిత్యాలంకార శాస్త్రము - విశాల సాహితి - జగిత్యాల - 1998
24. రామకోటి శాస్త్రి కేతవరపు - అభ్యుదయ సాహిత్య విమర్శన దృక్ఫథం - విశాలాంధ్ర పబ్లిషింగు హౌజ్‌, హైదరాబాద్‌ - మే 1997
25. లక్ష్మీ నర్సయ్య జి - దళిత సాహిత్యం - తాత్విక దృక్ఫథం - దళిత సాహిత్య ప్రచురణలు - విజయవాడ - 1999
26. విశ్వనాథ రెడ్డి కేతు - దృష్టి సాహిత్య వ్యాసాలు - విశాలాంధ్ర పబ్లిషింగు హౌజ్‌, హైదరాబాద్‌ - నవంబర్‌ 1998
27. వెంకట సుబ్బయ్య వల్లంపాటి - వల్లంపాటి సాహిత్య వ్యాసాలు - విశాలాంధ్ర పబ్లిషింగు హౌజ్‌, హైదరాబాద్‌ - అక్టోబర్‌ 1997
28. వెంకట సుబ్బయ్య వల్లంపాటి - కథా శిల్పం - విశాలాంధ్ర పబ్లిషింగు హౌజ్‌, హైదరాబాద్‌ - 1995
29. వెంకట్రామయ్య వేములపల్లి - భారతదేశంలో కుల వ్యవస్థ, భిన్న దృక్ఫథాలు - ప్రజా పంథా ప్రచురణలు - జూలై 2003
30. వేణుగోపాల్‌ ఎన్‌ - కథా సందర్భం - స్వేచ్ఛా సాహితి - నవంబర్‌ 2000
31. శ్రీరంగస్వామి టి - ప్రధాన సంపాదకులు - వరంగల్లు సాహితీ తరంగాలు - శ్రీలేఖ సాహితి, వరంగల్‌ 2003
32. శ్రీరంగస్వామి టి - ప్రధాన సంపాదకులు - వరంగల్లు సాహితీ మూర్తులు - శ్రీలేఖ సాహితి, వరంగల్‌ 2005
33. సత్యనారాయణ ఎస్‌. వి - ఆలోచన - విశాలాంధ్ర పబ్లిషింగు హౌజ్‌, హైదరాబాద్‌ - జూలై 1996
34. సత్యనారాయణ ఎస్‌. వి - దళిత వాద వివాదాలు - సంపాదకులు
35. సూర్యసాగర్‌ బి - సాహిత్యం, సౌందర్యం - జనసాహితి - జూలై 1995
36. సిమ్మన్న వెలమల - తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, సూత్రాలు - దళిత సాహిత్య పీఠం - విశాఖపట్నం - 2001
37. సుప్రసన్నాచార్య కోవెల - సంపాదకులు - ఏకశిలా సాహిత్య సౌందర్యం - జిల్లా సాంస్కృతిక మండలి, వరంగల్‌ - 1993

కథా సాహిత్యం

1. అశోక్‌ కుమార్‌ పెద్దింటి - ఊటబాయి కథలు - నయనం ప్రచురణలు - సిరిసిల్ల 2002
2. ఎల్లా రెడ్డి కర్ర - సంపాదకులు - తెలంగాణ కథ - 2003, 2004, 2005 - తెలంగాణ సాహితి, హైదరాబాద్‌
3. కనకయ్య గుండె డప్పు - మేమిట్లుండం
4. కాళోజి - కాళోజి కథలు - కాళోజీ ఫౌండేషన్‌, వరంగల్‌ - డిసెంబర్‌ 2000
5. గీతాంజలి - బచ్చేదాని - గోదావరి ప్రచురణలు, హైదరాబాద్‌ - నవంబర్‌ 2003
6. చంద్‌ పి - భూ నిర్వాసితులు - విశాల సాహితి, జగిత్యాల - ఆగస్టు 2000
7. చైతన్య ప్రకాశ్‌ - రేణ కథలు - నయనం ప్రచురణలు, సిరిసిల్ల - 2001
8. జగన్నాథం జూకంటి - వైపణి - నయనం ప్రచురణలు, సిరిసిల్ల - 2004
9. జింబో - జింబో కథలు - ప్రోజ్‌, పొయెట్రీ ఫోరం, హైదరాబాద్‌ - అక్టోబర్‌ 2004
10. తిరుమల రావు & ప్రభాకర్‌ ఎ.కె - సంపాదకులు - స్త్రీ వాద కథలు - సాహితి సర్కిల్‌, హైదరాబాద్‌ 1993
11. నవీన్‌ - ఫ్రం అనురాధ విత్‌ లవ్‌ - ప్రత్యూష ప్రచురణలు, హన్మకొండ - 2003
12. నరేంద్ర మధురాంతకం & రాసాని వి. ఆర్‌ - సంపాదకులు - కథా వార్షిక - 2000-2004 - మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ, తిరుపతి
13. నవీన్‌ వాసిరెడ్డి & శివశంకర్‌ పాపినేని - సంపాదకులు - కథ 1998 నుండి 2003 - కథా సాహితి, సికింద్రాబాద్‌
14. మల్లయ్య కాలువ - కాలువ మల్లయ్య కథలు - తెలుగు వచనం ప్రచురణలు, కరీంనగర్‌ - 1999
15. మురళీధర్‌ బి - నిరుడు కురిసిన కల - సుధా పబ్లికేషన్స్‌, ఆదిలాబాద్‌ - ఏప్రిల్‌ 2002
16. రఘోత్తమరెడ్డి తుమ్మేటి - తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు - విరసం ప్రచురణలు - జనవరి 2006
17. రాములు జి - పెరటి చెట్టు - మారసం, సిరిసిల్ల - జనవరి 2005
18. రాములు బి.ఎస్‌. - తేనెటీగలు - విశాల సాహితి, జగిత్యాల - 2004
19. రాములు బి.ఎస్‌. - వేపచెట్టు - విశాల సాహితి, జగిత్యాల - 2003
20. రాములు బి.ఎస్‌. - స్మృతి - విశాల సాహితి, జగిత్యాల - 1998
21. రామచంద్రం దార్ల - కిర్రుచెప్పులు - విశాల సాహితి, జగిత్యాల - 2002
22. రాంమ్మోహనరాజు కె - అనామకుడి డైరీ
23. రాజయ్య అల్లం - భూమి - కరీంనగర్‌ బుక్‌ ట్రస్ట్‌
24. లక్ష్మీపతి ఆడెపు - నాలుగు దృశ్యాలు
25. వినోద్‌ కుమార్‌ బెజ్జారపు - గవ్వల మూట - సహస్ర పబ్లికేషన్స్‌, పెద్దపెల్లి - 2003
26. శ్రీనివాస్‌ పులుగు - ఆరు కార్మిక కథలు - చేతన పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌ - 1994
27. సదానంద శారద - జాడి
28. సంపత్‌కుమార్‌ - లియోసా - నవంబర్‌ 2000
29. సాహు మిత్రులు, కరీంనగర్‌ - సాహు కథలు, కవితలు, పాటలు
30. సీతారాం గూడూరి - గూడూరి సీతారాం కథలు - మారసం ప్రచురణలు, సిరిసిల్ల - 2004

కథా సంకలనాలు:

31. అడవిలో వెన్నెల - కథా సంకలనం - కరీంనగర్‌ బుక్‌ ట్రస్ట్‌
32. నల్ల కలువలు - కథా సంకలనం - అబంపి పబ్లికేషన్స్‌, గోదావరిఖని - సెప్టెంబర్‌ 1988
33. నేలతల్లి విముక్తి కోసం - కథా సంకలనం - విరసం ప్రచురణలు - నెల్లూరు యూనిట్‌ - సెప్టెంబర్‌ 1990
34. బద్‌లా - కరీంనగర్‌ రచయితల కథలు - ఉద్యమ సాహితి
35. భూమిక - కథా సంకలనం - అబంపి పబ్లికేషన్స్‌, గోదావరిఖని - 1991
36. బొగ్గుపొరల్లో (సింగరేణి కార్మిక కథలు) - - కథా సంకలనం - కరీంనగర్‌ బుక్‌ ట్రస్ట్‌
37. రుతుపవనాలు - కథా సంకలనం - ఆర్‌.కె. పబ్లికేషన్స్‌, విశాఖపట్నం - జనవరి 1996
38. విద్యుల్లత కథలు, జన్మదిన సంచిక - సాహితీ మిత్ర మండలి, కరీంనగర్‌ - 1970
39. శ్వేత రాత్రులు - కథా సంకలనం - ఆర్‌.కె. పబ్లికేషన్స్‌, విశాఖపట్నం - ఆగస్టు 1993
40. సారా కథలు - కథా సంకలనం - సృజన ప్రచురణలు - నవంబర్‌ 1992

Books in English:

1. Aspects of the Novel - E.M. Forster
2. A Comparative Study of Early Novels in Hindi and Telugu - Dr. A.B. Sai Prasad

[ ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం | 1 | 2 | 3 | వ భాగం ]

5 అభిప్రాయాలు

  1. on 11 ఆగస్టు 2007 at 11:38 am 1.వల్లూరి

    మీ కధకుల పరిచయం బాగుంది. ప్రసిద్ద రచయతలే కాకుండా, మట్టిలో మాణిక్యాల వంటి రచయతలను కూడా పరిచయయం చేయటం అభినందనీయం.

    …వల్లూరి.

  2. on 27 ఆగస్టు 2007 at 4:44 pm 2.Ramulu

    ఎడిటర్ గారికి,
    మీరు ఎంతో కష్టపడి ఎన్నోరచనల/పుస్తకాల పేర్లు, రచయితల విశిష్టతలు , మరియు వారి విశిష్ట రచనలు ఇచ్చినందుకు క్రుతజ్నతలు మరియు అభినందనలు.

    ఇటీవలి తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత తెలంగాణకు ఆంధ్రోల్లు (పెత్తనాలుచేసిన) చేసిన అన్యాయాల పైన ఎన్నో పుస్తకాలు వచ్చాయి,ఎంతో సాహిత్యం వచ్చింది.వాటిని సేకరించి ప్రత్యేక శీర్శిక కింద ఇస్తే ఇప్పటి తరానికి / యువతకు ఎక్కువగా ఉపయోగ ఫడుతుంది. ఏమీ తెలుసుకోకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళకంటే తెలుసుకొని ఉద్యమంలో భాగస్వాములైన వారి వల్ల తెలంగాణకు /తె-ఉద్యమానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఆపుస్తకాలు వాటలంధర ,రచయితల పేర్లు ,అవి దొరికే స్తలం వీలైతే వాటిపైన సమీక్షలు ( యేమైన ఇప్పటికే వచ్చి ఉంటే) ఇస్తే బాగుంటుంది.

  3. on 04 సెప్టెంబర్ 2007 at 12:29 pm 3.sreedasyam laxmaiah

    బి.వి.ఎన్. స్వామి కథకుల పరిచయం బాగుంది

  4. on 04 సెప్టెంబర్ 2007 at 12:49 pm 4.chandrasheker

    చాలా సంథౌషం, చాలా మందీ,కథాకుల గురీంచీ తెలిపినారు , ధన్యవాధములు.

    భవధీయుదు

    చంద్రషెకరు చిలప్ప

  5. on 18 సెప్టెంబర్ 2007 at 5:02 am 5.రాకేశ్ తెలంగాణ్

    మీరు తెలిపిన వేంకటరాజన్న అవధానిగారు నాకు తాత(మాతామహులు). కాళోజీ “నా గొడవ”కు ముందుమాటనూ, సురవరంవారి “హిందువుల పండుగలు”కు పీఠికనూ రాశారు. కాళోజీ గారిని ఆత్మీయంగా “ఏక-లంగుడా” అని పిలుచుకునే వారు. (PUNny transalation for a person with SINGLE-LUNG)

    రాజన్న బహుభాషావేత్త. సంస్కృత, మరాఠీ, ఉర్దూ, పార్శీ, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషలలో అలవోకగా ప్రసంగించగలిగేవారు. “అగ్ని-శబ్ద-మహత్మ్యం” అనే సంస్కృత శతకాన్ని రచించారు.

    స్వాతంత్ర్యసమరయోధులు. తామ్రపత్రగ్రహీత. పోరాటంలో జైలుశిక్ష అనుభవించారు. జైల్లోనూ రచనలు చేశారు. He was known as a great ORATOR!!
    ఆయనప్రసంగాలు ప్రజల్ని ఉత్తేజపరచేవిగా, ప్రభావ పరచేవిగా ఉండేవని విన్నవారు(ఇప్పటికీ బ్రతికి ఉన్నవాళ్ళు)చెప్తూంటారు.

    పి.వి.కి గురు సమానులు.
    ఐతే -స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెసు పార్టీని గానీ, మరే రాజకీయపార్టీనిగానీ దరిరానీయలేదు.

    ఆయన బిడ్డల్లో ఇద్దరూ, కొడుకుల్లో ముగ్గురూ రచయిత(త్రు)లుగానూ, వ్యాసకర్తలుగానూ పేరుపొందినవారే!!
    విత్తు,చెట్టు వేరువేరుగావన్నట్టే ఆయన మనమలు, మనుమరాండ్లు వివిధరాష్ట్రాల్లోఉన్నా, ఆయాభాషల్లో వీలైనంత సాహితీసేవ చేస్తూనే ఉన్నారు.

    ఆయన ఇతరరచనల గురించీ (ఆత్మకథతో సహా.. ఎన్నో అముద్రితాలు), ఆయనతో నాకుగల అనుభవాలగురించీ మరోసారి తెలియజేస్తాను.

    ఒక గొప్పవ్యక్తినిగురించి ఇట్లా తలుచుకునేట్లుజేసిన “సోయి”కి ధన్యవాదాలు.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో