పోస్టులు అభిప్రాయాలు 07 February 2012

Monthly Archive for "జూన్ 2007"



కథలు సోయి | 07 జూన్ 2007

కొత్త తార

- నల్ల భూమయ్య

గప్పటి కాలంల అందరి పోరగండ్ల అయ్యల వారమే (వలెనే) ‘నారాయణ’ అయ్యగూడ పోరగండ్లు సిన్నగున్నప్పుడే సచ్చిపొయ్యిండు. అవ్వే (తల్లి) పోరగండ్లను సాది పెద్ద జేసింది. పోరగండ్లకు సదువు పందెలుగిట్ట ఏం లెవ్వు. నడుక నేర్సినప్పటి సందే బతుకుటానికి పనులు జెయ్యాలె. నారాయణ పుట్టి పెరిగింది పెద్ద కాలేర్ల. బిడ్డె జచ్చినా పురిటి కంపు పోనట్టుగ, నవాబుల రువాబులు గోన్నన్ని గొంతంత మరదికి అబ్బే వున్నయి. మొత్తం చదవండి »

పాటలు సోయి | 07 జూన్ 2007

సంకురాత్రి పండుగ మానువ్వు

-దామరకుంట శంకరయ్య

పల్లవి: ప్రభుత్వమేదైన నాయకులెవరైన
పట్టదూ నీగోడు ఓరంన్నా
ఏది ఏమైనా ఎవ్వరెట్లున్నా
పట్టెడన్న పెట్టెరైతన్నా మొత్తం చదవండి »

మన సంస్కృతి సోయి | 07 జూన్ 2007

సాంస్కృతిక జీవనంలో కుండ - ఆదిలాబాద్‌ రంజన్ల ప్రత్యేకత

-బి. వేణుగోపాల్‌ రెడ్డి

తొలకరికి పులకరించిన నేల మట్టి సౌరభాలను వెదజల్లుతుంది. సువాసనలతో నిండిన ప్రకృతిని చూసి మనిషి విహంగమవుతాడు. జంతువులను వేటాడి రక్తపు వాసన మరిగిన మనిషి ఆదిమ మనిషి వాసనతో నిండిన మట్టిని హత్తుకుంటాడు. మొత్తని మట్టిని తన చేతులలో మురిపెంగా లాలిస్తాడు. ‘మన్ను బొమ్మను’ చేసి పరవసిస్తాడు. మొత్తం చదవండి »

పాటలు సోయి | 07 జూన్ 2007

తెలంగాణ నా జన్మహక్కు

- అలీ

నా యాబదేండ్ల కోషీష్‌కి
తెలంగాణ సాధన చైతన్యంలో
తోవనిండా పల్లేరు కాయల తోటలే
నా అరికాళ్ళల్లో మంటలే మంటలు మొత్తం చదవండి »

పాటలు సోయి | 07 జూన్ 2007

కోటి రతనాల వీణ

- వడ్డేపల్లి మల్లేశము

కోటి రతనాల వీణమ్మా మా తెలంగాణ
మీటలన్ని కొల్లగొట్టారా ఆగడుసువాల్లు
సాగినన్ని ఆటలాడారా ఆ పోకిరోల్లు ||కోటి|| మొత్తం చదవండి »

అనుసృజన సోయి | 07 జూన్ 2007

”నిహాల్‌ సింగు చెప్పిన 1857 కథ”

మూలం: కుష్వంత్‌ సింగు
అనుసృజన: పరవస్తు లోకేశ్వర్‌

పుట్టినప్పట్నించీ నేను ‘ఢిల్లీ’ నగరం గురించి వింటూనే ఉన్నాను.

నేను చిన్నపిల్లవాడిగా ఉన్నపుడే మా అమ్మ చక్రవర్తి ఔరంగజేబు గురించి చెప్పింది. వాడు మా సిక్కుమతం ‘గురువు’ను చాందినీ చౌక్‌ ప్రాంతంలో ఎట్లా చిత్రవధ చేసి చంపిందీ తర్వాత కాలంలో అదే స్థలంలో మా వాళ్ళు అతి పెద్ద అందమైన గురుద్వారాను ఎట్లా నిర్మించిందీ ఒక కథగా వినిపించేది. మొత్తం చదవండి »

సంస్మరణ సోయి | 07 జూన్ 2007

మృత్యుముఖంలో మళ్ళీ మెరిసిన ‘విద్యుల్లత’

- అంపశయ్య నవీన్‌

పదమూడు నెలలు కాన్సర్‌ వ్యాధితో పోరాడిన ఎం.వి. తిరుపతయ్య చివరకు మార్చి 11న అర్థరాత్రి చివరి శ్వాస విడిచారు. 4.2.2006 నాడు తిరుపతయ్యకు ఈ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. కడుపులో పెద్ద పేగుకు సోకిన ఈ వ్యాధి కాలేయానికి కూడా వ్యాపించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. మూడుసార్లు ఆపరేషన్‌ చేశారు. వ్యాధి సోకిన భాగాల్ని తొలగించారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదు. మొత్తం చదవండి »

పాటలు సోయి | 07 జూన్ 2007

కూలీ నాలీ పేదజనం కుములు తున్నదో పనేలేక పల్లె పల్లె పలచబడ్డదో

- దాంగట్ల కాశీదాస్‌

ఆడ పిల్లల కనుకున్న తల్లిదండ్రుల బ్రతుకు ||కూలీ||

కట్నాల ఆప్పుల్లో కాలిపోయే బతుకంత
ఇంట్యాదులందరు కలిసి బతికే దారి లేదు పల్లెన
అప్పులోల్ల భాదలకు తలొదిక్కుగా సమాయే
గీ భాదలల్ల బతకలేకరో బలైపాయే పేదజనంరో ||కూలీ|| మొత్తం చదవండి »

పాటలు సోయి | 07 జూన్ 2007

ఎన్నాళ్ళీ కన్నీళ్ళు

-సిహెచ్‌. రమణాచారి

ఏన్నాళ్ళీ కన్నీళ్ళు
ఏన్నాళ్ళీ కష్టాలు - 2

ఆంధ్ర వలస దోపిడిలో
అణగారిన బ్రతుకులు
మన తెలంగాణ బ్రతుకులు - 2 మొత్తం చదవండి »

కవితలు సోయి | 07 జూన్ 2007

రాయి

- కె.ఎస్‌. అనంతాచార్య

మనుషులు అమెరికాకు
పక్షులు సైబేరియాకు
బండలు పట్నాలకు
వలసలు, వలసలు, వలసలు !! మొత్తం చదవండి »

« Previous PageNext Page »