పోస్టులు అభిప్రాయాలు 07 February 2012

కవితలు సోయి | 07 జూన్ 2007 05:32 pm

రాయి

- కె.ఎస్‌. అనంతాచార్య

మనుషులు అమెరికాకు
పక్షులు సైబేరియాకు
బండలు పట్నాలకు
వలసలు, వలసలు, వలసలు !!
సంపాదనకైతేనేం
ఆహార సంపాదనకైతేనేం
వ్యాపారానికైతేనేం
ఆగడం లేదు వలసలు !!
నాగరికతకు శ్రీకారం చుట్టింది రాళ్ళు
రాజకీయనాయకులకు పునాదిరాళ్ళు
పోయినవారి తీపిగుర్తులు సమాధిరాళ్ళు
ఇప్పుడు ఆనవాళ్ళు కోల్పోతున్న రాళ్ళు !!
రాముని పాదం తాకిన రాయి
వనితగా మారింది
ఆధునికుడి కన్నుపడి
రాళ్ళు క్వారీ పరిశ్రమలవుతున్నాయి !!
రాళ్ళు రాపిడి పెడ్తే
నిప్పును ఆందించాయి
ఆ రాళ్ళ కడుపుకే చిచ్చుపెట్టి
గుట్టల్ని కంకర కుప్పల్ని చేస్తున్నాం !!
తాజ్‌మహల్‌ రాయే
అజంతా శిల్పం రాయే
అలాంటి రాయి జాతి నశిస్తే
మన అస్తిత్వం ???
కొండల్ని రక్షించుకోవడం కొరకే
వెంకటేశ్వరుడు కొండల నెక్కింది
ఆ కొండల కొమ్ములనే కదా
మనం నరికేది !!
రాయి విలువ తెలిసే కదా
నర్సింహుడు గుట్టల నేలితే
రాళ్ళ గుండెల్లో గునపాల్ని దించి
మనది ‘రాతి గుండె’ అయ్యింది !!
ఊరు పదిలమని దేవతలు
గుట్టలు, కొండల నెక్కితే
జేబు బరువు కోసం
రాళ్ళను సైజుల వారీ కత్తిరింపు, తరలింపు !!!
కోహినూరు రాయే
కోవెల నిర్మాణానికీ రాయే
గుడిలో దేవుడు రాయే
రాళ్ళల్లో రాయైన రాయి
మనిషికన్నా చాలా నయం !!
గ్యాస్‌ స్టౌవ్‌కి మూలం పొయ్యిరాయి
చరిత్రకాధారం శాసనం రాయి
రాళ్ళ వలసలు ఆపకుంటే
వచ్చేతరం నోట్లో రాయి కూడా మిగలదు !!

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో