కవితలు సోయి | 02 సెప్టెంబర్ 2007
జానపదం
-గట్టు వెంకట్రావ్
ఎన్నియ్యలో… ఎన్నియ్యలో…
ఎన్నినాల్ల కచ్చిందమ్మా అందాల చందాల ||ఎన్నియ్యలో||
నెత్తిమీద కడవ పెట్టి కొంగు నేమో నడముకుజుట్టీ
చేతిలో కొడవలి పట్టి- పొలముగొయ్య పోతాఉంటే
సుక్కల్ల చంద్రుడే నిన్నూ చూసి కన్నేకొట్టే ||ఎన్నియ్యలో||
పరిమోపు ఎత్తుకొని అడుగెనుక అడుగేసి
పాటపాడుకుంటు నువ్వు పొలము గట్టు దాటుతుంటే
నీపాటే వింటు కోయిలమ్మ,
పాట మరిచిపాయే ||ఎన్నియ్యలో||
సంధ్యవేల కాబట్టే నా మనుసు నిలువదాయే
కలిసిపోయి నా మనసూ ఆగమయి పోవట్టే
ముందునిన్నుచూసి నీ అందమంతవిందామే. ||ఎన్నియ్యలో||
పాటలు సోయి | 01 సెప్టెంబర్ 2007
తెలంగాణ జాతర
-రేగులపాటి కిషన్‌రావు
జాతర ఇది జాతర
తెలంగాణ జాతర
ఊరూరి జనంతోటి
సాగిపోవు జాతర ||జాతర||
మొత్తం చదవండి »
పాటలు సోయి | 01 సెప్టెంబర్ 2007
పోరు బైలెల్లింది
- నల్లెల్ల రాజయ్య
మనసు మనసు గల్సి మాటలాడుకోని
గుండె గుండె కల్పి ఊసులాడుకోని
పోరూ బైల్లిందిర తమ్ముడా
అది హోరెత్తి పోతుందే చెల్లాలా ||పోరూ||
మొత్తం చదవండి »
పాటలు సోయి | 01 సెప్టెంబర్ 2007
తెలంగానం
- పిట్టా సాంబయ్య
తెలంగాణ తెలంగాణ
తెలంగాణ తెలంగాణ
తెలంగాణా పాట పాడరో ఓ అక్కల్లారా
తెలంగాణా ఆట ఆడరో ఓ అన్నలారా ||తెలంగాణ||
మొత్తం చదవండి »
పాటలు సోయి | 01 సెప్టెంబర్ 2007
సాధించి తీరాలి మన తెలంగాణ
- సి. హెచ్. రమణాచారి
కష్టాల కడలిలో నా తెలంగాణ
కన్నీటి కెరటమే నా తెలంగాణ
వలస దోపిడిలోన నా తెలంగాణ
తీగ తెగినా వీణ నా తెలంగాణ ||తెలంగాణ||
మొత్తం చదవండి »
కథలు సోయి | 01 సెప్టెంబర్ 2007
ఏకు - మేకు
-నల్ల భూమయ్య
మా ఊర్లె మేం సిన్నగున్నప్పటి సందే సిటీ మున్సిపాలిటి ఉండేటిది. మా వూర్లె కంపిన్ల ఆఫీసర్ల పోరగండ్లకోసం యింగ్లీషు మీడియం బడి, కంపినోని మనుసుల పొరగండ్ల కోసం హిందీ మీడియం బడి వుండేవి. మాది సర్కారు బడి, గిదీంట్ల తెలుగు, తురుకం మీడియంలు వుండేటియి.
ఏ గోంతమందో పల్లెల్లల్ల కెల్లి అచ్చే పోరగండ్లు తప్పిస్తె కడుమ అందరు గూడ నగురంల పుట్టి పెరిగి నోళ్ళు, ఏరే ఏరే ‘దేశాల’ నుంచి, ఎక్కడెక్కన్నుంచో అచ్చిన కంపిన్ల జీతగాళ్ళ పోరగండ్లు వుండెటోళ్ళు. మొత్తం చదవండి »
కథలు సోయి | 01 సెప్టెంబర్ 2007
పొద్దుమూకినంక
-భూపాల్
మెడికల్ కాలేజీ ముందలి సందుల బస్సు దిగింది పుష్పలత. ఆడికెళ్లి నడుచుకుంట కోఠి ఆంధ్ర బేంకు కాడికొచ్చి ఎవర్నో టైం అడిగితే ఆరున్నర అన్నరు. ఉప్పల్ నుంచి కోఠి కాడికొస్తందుకు రెండున్నర గంటలైంది. ఆమె భర్త ఆరున్నర ఏడునడుమ ఈడనే కలుస్తనన్నడు. ఒక గంట మొదాలొచ్చి గాజులు, టిక్లీ బొట్లు, చిన్న స్టీలు టిఫిన్ బాక్సు కొందామనుకుంది. మొత్తం చదవండి »
కథలు సోయి | 01 సెప్టెంబర్ 2007
కేసు
-వేణు సంకోజు
అందరూ అవాక్కయి వున్నారు.
అందరి ముఖాల్లోనూ ఒక పెద్ద విషాదఛ్చాయ.
‘మళ్ళీ ఏమై ఉంటుందా’ - అనుకుంటూ! వినకూడనిదేదో వినవలసి వస్తుందనుకుంటూ భయపడసాగింది సీతమ్మ.
మొత్తం చదవండి »
కథలు సోయి | 01 సెప్టెంబర్ 2007
బతుకు
-బి.వేణుగోపాల్
చిగురులు తొడిగిన అడివి పచ్చగా కళకళలాడుతున్నది. గ్రీష్మ తాపాన్ని తీర్చడానికి వసంతం హరితాన్ని పులిమి వెళ్ళినట్లున్నది. సూర్యుడు నడినెత్తి మీదున్నడు.అప్పటి వరకు విస్తరించిన చెట్ల నీడ చెట్టు మొదలువరకే వచ్చింది. బుగబుగమని మండుతున్న ఎండను సైతం లెక్కచేయక అడవితో యుద్ధానికి వచ్చినట్లు తునికి పొదలను వెతుక్కున్న గుంపు అటు ఇటు కదలాడతున్నది. చిన్న,పెద్ద తేడా లేకుండా తునికాకు (చుట్టాకు) లను టిక్ టిక్ మని తెంపుతున్నారు.కాళ్ళు చేతులు యంత్రంలా ఆడుతున్నాయి.
మొత్తం చదవండి »
పక్రటనలు సోయి | 01 సెప్టెంబర్ 2007
పతిక్రా పక్రటనలు
పోసాని మురళీ కృష్ణ దర్శకత్వంలో “ఆపరేషన్ దుర్యోధన” చిత్రంలో తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను, సంస్కృతిని కించపరుస్తూ, అవహేళన చేస్తూ సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రా సినీ పెట్టుబడిదారుల దురంహకారానికి ఈ సంభాషణలు, సన్నివేశాలు నిదర్శనాలు. ఈ దురంహాకార పూరిత వైఖరిని తెలంగాణ రచయితల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. మొత్తం చదవండి »



