కవితలు సోయి | 02 సెప్టెంబర్ 2007 11:23 am
జానపదం
-గట్టు వెంకట్రావ్
ఎన్నియ్యలో… ఎన్నియ్యలో…
ఎన్నినాల్ల కచ్చిందమ్మా అందాల చందాల ||ఎన్నియ్యలో||
నెత్తిమీద కడవ పెట్టి కొంగు నేమో నడముకుజుట్టీ
చేతిలో కొడవలి పట్టి- పొలముగొయ్య పోతాఉంటే
సుక్కల్ల చంద్రుడే నిన్నూ చూసి కన్నేకొట్టే ||ఎన్నియ్యలో||
పరిమోపు ఎత్తుకొని అడుగెనుక అడుగేసి
పాటపాడుకుంటు నువ్వు పొలము గట్టు దాటుతుంటే
నీపాటే వింటు కోయిలమ్మ,
పాట మరిచిపాయే ||ఎన్నియ్యలో||
సంధ్యవేల కాబట్టే నా మనుసు నిలువదాయే
కలిసిపోయి నా మనసూ ఆగమయి పోవట్టే
ముందునిన్నుచూసి నీ అందమంతవిందామే. ||ఎన్నియ్యలో||




on 08 మార్చ్ 2011 at 5:32 am 1.suresh …
ఈ కవిత ఒక పల్లెటూరులొ ప్రతి దినము పొలము పనులు చెసె వారి జీవనవిదానము,వరికొయడాని కొడవలి తీసుకువెల్లారు అనివరిమొపు మొదలఇనవి తెలంగాణ జీవన వ్యవహరలు చక్కగ చెప్పడము జరిగింది.