సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007
“ఎన్నాద్రి” ఆవిష్కరణ
ప్రముఖ కవి డాక్టర్ కాసుల లింగారెడ్డి రచించిన “ఎన్నాద్రి” కవితా సంకలనాన్ని హైదరాబాద్‌లోని బషీర్‌బాగు ప్రెస్ క్లబ్‌లో జూలై 7,2007 రాత్రి వరవరరావు ఆవిష్కరించారు. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007
అందరినోట … అదే మాట తెలంగాణ
జాతీయ సదస్సులో వెల్లివిరిసిన చైతన్యం - ప్రత్యేక రాష్ట్రంపై సాహితీ పోరు
‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం… ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం” అంటూ అందెశ్రీ ఆలపించిన ప్రారంభ గీతం జూలై 19న భువనగిరిలో జరిగిన తెలంగాణ సాహిత్య సదస్సుకు సరికొత్త ఉత్సాహోన్ని ఇచ్చింది. దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న ఈ ప్రాంత సాహిత్య కళారూపాలను ప్రజల చెంత చేర్చాలనే తలంపుతో ‘తెలంగాణ సాహిత్యం- జీవిత చిత్రణం పేరిట ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు తెలంగాణ అభిమానుల గుండెలను హత్తుకుంది. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007
సాహితీ చరిత్రలో ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం
సాహితీ చరిత్రలో ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ప్రముఖ రచయిత, ప్రాచీన లిఖిత గ్రంథాల పరిశోదనాలయ సంస్థ డైరక్టర్ ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 7న నిర్మల్‌లో మునిపంతులు రచించిన గోండిభారతం పుస్తక సంకలనాన్ని తిరుమలరావుతో బాటు ప్రముఖ సిని డైరక్టర్, మాభూమి ఫేమ్ బి.నర్సింగరావులు ఆవిష్కరించారు. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007
తెలంగాణ కవిత - 2007 ఆవిష్కరణ
తెలంగాణ కవుల నిరసన, ధిక్కారం, ఆగ్రహం, ఆవేదన, గోసలతో కూడిన ఆత్మగల్ల కవిత్వం “తెలంగాణ రాష్ట్ర అవతరణని బలంగా కాంక్షిస్తున్న ‘ఓ అవ్వ’ చేతుల మీదుగా తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ఆదిలాబాద్ స్థానిక అమరవీరుల స్థూపం వద్ద యువకవి వేణుగోపాల్ రెడ్డి నినాదాల మధ్య ఆవిష్కరణ జరిగింది. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తెలంగాణా కవితా వైతాళికులు
“తెలుగు సాహిత్యం గర్వించదగిన ఎందరో మహా కవులనూ, రచయితలనూ, తెలంగాణ సాహిత్యం సృష్టించుకున్నది. మట్టి మనషులు ఇక్కడ చైతన్యంతో మహా కవులుగా రూపొందారు. సామాన్యులు మాన్యులైన మహారచయితలుగా సాహిత్యాన్ని సృష్టించారు. మఖ్దుం, దాశరధి, కాళోజి, వానమాములై, సుద్దాల హనుమంతు, సి. నారాయణ రెడ్డి తదితర కవితా వైతాళికులను స్మరించటం స్ఫూర్తిదాయకం” అంటూ పలువురు వక్తలు విశ్లేషించారు. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007
పెండ్యాల రాఘవరావు “నా ప్రజాజీవితం” పుస్తకావిష్కరణ సభ
ప్రజల కోసం జీవించి వారి బాధలను తమ బాధలుగా భావించి ప్రజా పోరాటం చేసిన మహానీయుల ఆదర్శమే స్వచ్చమైన ప్రజాస్వామ్యానికి పునాదిగా పలువురు వక్తలు అభివర్ణించారు. స్వాతంత్య్ర యోధుడు పెండ్యాల రాఘవరావు 20వ వర్ధంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 10న ఆయన ఆత్మకథ ‘నా ప్రజా జీవితం’ పుస్తకావిష్కరణ వరంగల్ జిల్లా పరిషత్ హాల్‌లో జరిగింది. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007
వీరయోధుల స్ఫూర్తితో సామ్రాజ్యవాదాన్ని అంతం చేయాలి
నాటి స్వాతంత్య్ర పోరాట వీరయోధులను స్ఫూర్తిగా తీసుకొని సామ్రాజ్యవాదాన్ని అంతం చేయటానికి ఉద్యమిరచాలని విరసం నాయకులు వరవరరావు పిలుపునిచ్చారు. జూలై 17న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ హస్టరీ సోసైటీ అధ్వర్యంలో లోకేశ్వర్ రాసిన “1857 హైదరాబాద్ తిరుగుబాటు గాథలు” పుస్తకావిష్కరణ జరిగింది. మొత్తం చదవండి »
స్పందన సోయి | 01 సెప్టెంబర్ 2007
స్పందన : జూలై - సెప్టెంబర్, 2007
బి.వి.ఎన్. స్వామి గారు ఎంతో కష్టపడి ఎన్నో రచనల/పుస్తకాల పేర్లు, రచయితల విశిష్టతలు మరియు విశిష్ట రచనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు మరియు అభినందనలు.
ఇటీవలి తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత తెలంగాణకు ఆంధ్రోల్లు (పెత్తనాలు చేసిన) చేసిన అన్యాయాల పైన ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎంతో సాహిత్యం వచ్చింది. మొత్తం చదవండి »



