పాటలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:56 pm
తెలంగాణ జాతర
-రేగులపాటి కిషన్‌రావు
జాతర ఇది జాతర
తెలంగాణ జాతర
ఊరూరి జనంతోటి
సాగిపోవు జాతర ||జాతర||
చదువు బాగరావాలని
చల్లంగా ఉండాలని
కోరచేరవచ్చినట్టి
పిల్లవాండ్ల జాతర ||జాతర||
కొడుకు ఒకడు కావాలని
ఆడబిడ్డ కలగాలని
కోరచేరవచ్చినట్టి
ఆలుమగల జాతర ||జాతర||
రోగాలూ రావద్దని
బాధలన్ని తొలగాలని
కోరచేరవచ్చినట్టి
ముసలివాళ్ల జాతర ||జాతర||
పంటబాగ పండాలని
పాడి ఇంట ఉండాలని
కోరచేరవచ్చినట్టి
రైతన్నల జాతర ||జాతర||
బేహారం బాగసాగి
లాభాలూ కురువాలని
కోరచేర వచ్చినట్టి
వ్యాపారుల జాతర ||జాతర||
చక్కనైన చుక్కలనూ
చూడ చూడవచ్చినోళ్ల
సొగసుగాళ్ల అందాలను
చూచి మురవ వచ్చినోళ్ల ||జాతర||
కోడికూర గొర్రెకూర
కొనీ తినే వారి కొరకు
సినిమాలు సర్కసులూ
చూచి మురియు వారి కొరకు ||జాతర||
జాతర ఇది జాతర
స్వామి వారి జాతర
ఊరూరి జనంతోటి
సాగిపోవు జాతర ||జాతర||




on 09 మార్చ్ 2010 at 5:21 am 1.pindiga srinivas …
తెలంగాణ జాతర
జై తెలంగాణ