పోస్టులు అభిప్రాయాలు 07 February 2012

సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007 03:13 pm

వీరయోధుల స్ఫూర్తితో సామ్రాజ్యవాదాన్ని అంతం చేయాలి

నాటి స్వాతంత్య్ర పోరాట వీరయోధులను స్ఫూర్తిగా తీసుకొని సామ్రాజ్యవాదాన్ని అంతం చేయటానికి ఉద్యమిరచాలని విరసం నాయకులు వరవరరావు పిలుపునిచ్చారు. జూలై 17న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ హస్టరీ సోసైటీ అధ్వర్యంలో లోకేశ్వర్‌ రాసిన “1857 హైదరాబాద్‌ తిరుగుబాటు గాథలు” పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సభలో వరవరరావు పోల్గొని మాట్లాడుతూ నాటి పోరాట వీరయోదులు లక్ష్యాలు, ఆశయాలు అసంపూర్ణంగా మిగిలాయని చెప్పారు. తెలంగాణ నేలలో గత తరాలు విత్తిన త్యాగాల విత్తనాలు నేటికీ విభిన్న అధిపత్య వ్యతిరేక పోరాటాలలో నిరంతరం వికసించి పరిమళిస్తూనే ఉన్నాయని చెప్పారు. నేడు సామ్రాజ్యవాదం మరింత బలపడిపోయిందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద దళారులు దేశ ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారని చెప్పారు. సామ్రాజ్యవాదాన్ని అంతం చేయడానికి తుర్రే భాజీఖాన్‌, మౌల్వి అల్లాఉద్దీన్‌లను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రచయిత లోకేశ్వర్‌ మాట్లాడుతూ 1857 తిరుగుబాటులో హైదరాబాద్‌ పాత్రను ప్రపంచానికి చాటి చెప్పాలనే, అకాంక్షతో ఆ అమర వీరులకు స్మరించుకోవాలన్న ఆశతో ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ కన్వీనర్‌ టి.వివేక్‌ అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక ప్రధానకార్యదర్శి వేణు సంకోజు, వీక్షణం మాసప్రతిక ఎడిటర్‌ ఎన్‌. వేణుగోపాల్‌, తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటి కన్వీనర్‌ పాశం యాదగిరి, ఉస్మానియా యూనివర్సిటి ప్రోఫెసర్‌ అడప సత్యనారాయణ, చరిత్ర పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్‌, శ్రీధర్‌ దేశ్‌పాండే తదితరులు పాల్గోని మాట్లాడారు.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో