Uncategorized సోయి | 26 నవంబర్ 2006 12:41 pm
సోయి గురించి
సవినయ సంకల్పం
తెలుగు సాహిత్యంలో ఇప్పుడు తెలంగాణ రుతువు. తెలంగాణ నేల సుభిక్షమై, ఇక్కడి జీవితం నిత్యవసంతమయ్యే దాక ఈ ఋతువు ఎడతెగదు. సిద్దిపేటలో అంకురించిన ఆలోచన, కరీంనగరంలో మొలకెత్తి, వరంగల్లులో విరగబూసి - ఇప్పుడు నల్లగొండలో నిండుగా ఎదిగింది. తెలంగాణా సాహిత్య సాంస్కృతిక ఆకాంక్షలన్నిటికీ వాహికగా, చరిత్ర అందించిన బాధ్యతను నెరవేర్చే అక్షర సారధిగా తెలంగాణా రచయితల వేదిక అవతరిస్తున్నది. తెలంగాణా సాహిత్య రంగంలోని రచయితలు, సాహిత్యాభిమానులు, పాఠకులు అందరూ రచయితల వేదికమీద నిలుపుతున్న ఈ విశ్వాసం అసామాన్యమైనది. ఈ ఆదరణ మోపుతున్న భాద్యతను రచయితల వేదిక సవినయంగా స్వీకరిస్తున్నది.
రకరకాల భావ వర్గాలకు చెందిన రచయితలు ఒక ఉమ్మడి ఆకాంక్షల ఆధారంగా సమీకృతం కావడం సాధారణ విషయం కాదు. ‘రచయితల వేదిక ’ ఈ విషయంలో చూపిస్తున్న చొరవ, వివేకం, సహనం మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కష్టార్జితమైన ఈ విషయాలు సహజంగానే కొందరు వ్యక్తులకు కంటగింపుగా మారాయి. తెలంగాణా రచయితల వేదిక మీద కొందరు చేస్తున్న ఆపాదనాలు, ఆరోపణలు అన్నీ ఈర్షాసూయల ఫలితాలే. అటువంటి ద్వేషజీవులు ముందుకు తెస్తున్న వాదోపవాదాలలో గాని, వివాదాలలోగాని పాల్గొనటానికి ‘రచయితల వేదిక’కు ఎటువంటి ఆసక్తి లేదు. క్రియాశీలమైన ఆచరణ మాత్రమే ఎవరి చిత్తశుద్ధికైనా గీటురాయి అని మా విశ్వాసం. తెలంగాణా సాధనలో తెలంగాణా రచయితల వేదిక సాహిత్య, సాంస్కృతిక రంగాలద్వారా నిరంతరంగా కృషి చేస్తుందని మామీద ప్రేమాభిమానాలు చూపుతున్న ప్రజలందరికి మరొకసారి వాగ్దానం చేస్తున్నాము.
- సోయి ప్రచురణకర్త
తెలంగాణ సోయి (త్రైమాసిక సాహిత్య సంచిక వివరాలు)
(భారత దేశ) సభ్యులకు మాత్రమే : విరాళం రూ 10/-
తెలంగాణ రచయితల వేదికను సంప్రదించవలసిన చిరునామా :
ప్రచురణ కర్త : డా|| నందిని సిధారెడ్డి, అధ్యక్షులు,
తెలంగాణ రచయితల వేదిక
17-112, తూంబాయి, శ్రీనగర్ కాలనీ, సిద్దిపేట, మెదక్ జిల్లా - 502 103.
ఫోన్ : 08457-224877, 9440381148.
రచనలు పంపవలసిన చిరునామా :
శ్రీధర్‌రావు దేశ్‌పాండే
జి-1, వరలక్ష్మి అపార్ట్‌మెంట్స్, రోడ్ నెం. 5, అలకాపురి, హైదరాబాద్ - 500 035.
ఫోన్ : 040-24030154, 9949998912.
కవర్ డిజైన్ లే అవుట్ :
శ్రీ దత్తసాయి గ్రాఫిక్స్,
1-1-651/8, గాంధీనగర్, హైదరాబాద్-500 080.
ఫోన్ : 040-27673868.
ఇందులోని భావాలు రచయితలవే.




on 02 ఫిబ్రవరి 2007 at 12:19 pm 1.sridhar deshpande …
సోయిని ఈ విధంగా డిజైను చేసినందుకు అభినందనలు.
శ్రీధర్ దేశ్‌పాండే
on 27 ఫిబ్రవరి 2007 at 11:13 am 2.Chukka Srinivas …
మంచి సాహిత్య సంచిక ప్రచురిస్తునందుకు ధన్యవాదాలు.
on 12 మే 2007 at 9:49 pm 3.ramulu …
ఇటీవలి సంచిక అంటె ఏప్రిల్ ది ఇంకా మార్కెట్లొకి రాలేదా? వచ్చినా వెబ్లో పెట్టలేక పోయారా? సమాయానికి వచ్చేట్టు చూస్తే పత్రిక దానికదే ముందుకు సాగుతుంది. నేను అమెరికాలో ఉండికూడా పత్రికకు చేయగలిగిన సహాయం ఉంటే చెప్పండి నిరభ్యంతరంగా,సంతోషగా నిర్వహిస్తాను.కథలు,పాటలు,పుస్తకసమీక్షలు సమయానికి రాకపోతే జరుగుతున రజకీయాలమీద విష్లేషణలు రాయించండి.నన్ను రాయమంటే కూడా రాస్త,కాని మళ్ళీ మీరు ఎడిట్ చేయడానికి ,వెబ్ లో పెట్ట డానికి ఎలావీలౌతుందా అని నా సందేహం. తెలంగాణ టైమ్స్ కూడా వెబ్ లో పాతవాటినికూడా వేస్తూ,కొత్తది కూడా వేయండి. మన తెలంగాణకు వున్న పత్రికలే చాలాతక్కువ మరి ఇవికూడా సమయానికి రాక పోతె ఎట్లా? మీరుచాలా పని వత్తిడిలో ,సభలు,సమావెశాల్తో సతమౌతారని తెలుసు.దాన్ని అధిగమించాలంటె తగిన వాళ్ళను సభా వేదికలనుండే అప్పీల్ చేస్తూ పత్రిక నిర్వహణ కొరకు కొత్తవారిని ఆయా పనులకు అసిస్ట్ చేయమని కోరడంలో తప్పు లేదనే భావిస్తున్నాను.అవే వేదికలనుండి ఆర్ధిక సహాయం అవసరమైతే కూడా తప్పులేదని నా అభిప్రాయం.ఏ రకంగా నైనా పత్రిక ను ఆగకుండా ముందుకు తీసుకు పోవాలనే వుద్దేశంతోనే ఇదంతా రాస్తున్నాను.ప్రత్యుత్తరం రాస్తే సంతోషం.
రాములు చందా
on 19 మే 2007 at 9:47 pm 4.Sridhar deshpande …
సోయి పాఠకులకు నమస్కరములు
సోయిని ఇష్టంగా చదువుతుందుకు సంతోషం.
సోయి ఎప్రిలు - జూను 2007 సంచిక వారం రోజుల్లో వస్తున్నది.
వెబ్ లో కూడా పెడతాము.
సోయిని చదివి అభిప్రాయాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు.
శ్రీధర్ రావు దేషపాండే
on 12 జులై 2007 at 12:19 am 5.డా.దార్ల వెంకటేశ్వరరావు …
సోయి పత్రిక చూశాను. ఇప్పుడు వెబ్ చూస్తున్నాను. చాలా బాగుంది. తెలంగాణ సంస్కృతిని చరిత్రీకరించటం, దానితో పాటు మూలన పడిన సంస్కృతిని వెలికి తీయటం ప్రశంసనీయమైన కార్యక్రమం. మీకు అభినందనలు. తెలంగాణ ప్రాంతం వారికే కాకుండా తెలంగాణ సానుభూతి పరులకూ మీరు మీ పత్రికలో అవకాశం కల్పించండి. దాని వల్ల తెలంగాణ ఉద్యమం మరింత బలపడుతుంది.
అభినందనలతో
మీ
దార్ల
on 07 నవంబర్ 2008 at 6:37 am 6.ravikumar …
సోయి గురించి ఇక్కడా అక్కడా విన్నాను. దయచేసి నేను సోయి పత్రికను ఎలా పొందగలనో తెలిపి సాయపడగలరా? 9989265444 నా మొబైలు నెంబరు. నమస్తే.
on 11 నవంబర్ 2008 at 11:13 pm 7.prabhakar …
సొయి చాల బగుంది కని, సాహిత్యమ్ గురుంచి కొత్త వారికి పరిచయమ్ చెస్తె చాల బగుంతుంది
on 13 జనవరి 2010 at 3:34 am 8.ramnarsimhareddy …
అద్భుత0
08680-275125