పోస్టులు అభిప్రాయాలు 03 September 2010

Archive for "వ్యాసాలు"



వ్యాసాలు సోయి | 07 జూన్ 2007

ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 1

- బి.ఎన్‌.స్వామి

కథలు, కవితలు అనేకం వస్తున్నాయి. సాహిత్యం సంపద్వంతం అవుతున్నది. అనేక దృక్ఫధాలతో వెలువడుతున్న సాహిత్యం అనేక రకాలుగా పదిలపరచబడుచున్నది. ఒకచోట నిక్షిప్తం కానిది అనేకం ఉంది. అదంతా పాఠకులకు చేరాలి. అనేకులు కథలు రాస్తున్నారు. ఎవరెవరు ఏమి రాస్తున్నారు? ఎంతమంది రాస్తున్నారు? అనే లెక్క తేలియాలి. లెక్క తెలుసుకునే క్రమంలోనే చరిత్ర నిర్మాణం జరుగుతది. సమాజం అనేక అస్థిత్వాల మధ్య ముక్కలు ముక్కలుగా కొనసాగుతుంది. మొత్తం చదవండి »

వ్యాసాలు సోయి | 07 జూన్ 2007

ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 2

- బి.ఎన్‌.స్వామి

58. చైతన్య ప్రకాశ్‌
కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రకాశ్‌ రేణ కథా సంపుటిని వెలువరించారు. ఇతని కథలకు క్లుప్తత ప్రాణాధారంగా ఉంది. నిమ్నకుల సమస్యల్ని కథలుగా చిత్రించారు. బతుకు రేవు, చంద్రకళ, అమీన, రేణ లాంటి కథలు వీరి కథా కౌశలానికి నిదర్శనాలు. లోతైన అవగాహన, సామాజిక సమస్యల పట్లగల పరిశీలన, వీరి కథల్లో తొంగి చూస్తాయి. మొత్తం చదవండి »

వ్యాసాలు సోయి | 07 జూన్ 2007

ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 3

- బి.ఎన్‌.స్వామి

118. రామ శంకర్‌
కరీంనగర్‌ జిల్లాకు చెందిన వీరి అంతర్మథనం అనే కథ నల్లకలువలు కథా సంకలనంలో ప్రచురితమైంది. వీరు అనేక కథలు రాశారు.

119. రామ భోజ
కరీంనగర్‌కు చెందిన బి. రాములుగారు రామ భోజ అనే పేరుతో రచనలు చేశారు. ఎక్కడవేసిన గొంగళి…., చీడపురుగులు, సంస్కారి అనే కథలు వీరి సామాజిక స్పృహకు నిదర్శనలు. మొత్తం చదవండి »

వ్యాసాలు సోయి | 07 జూన్ 2007

కాపు రాజయ్య - చిత్రకళ

- డా|| కొండపల్లి శేషగిరిరావు

రాజయ్య నా చిరకాల మిత్రుడు-మేముభయులం స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్ & క్రాఫ్ట్‌స్ లో ఇంచుమించు రెండేళ్ల తేడాతో డిప్లోమా తీసుకొన్నాం! నేనతని గుణ గణాలను కొంతైనా గుర్తెరుగుతాను! అతనికి బాల్యం నుండి సహజమైన పట్టుదల, దీక్ష, కృషి చేయటం అలవాటు! విద్యార్థి దశ పూర్తయింతర్వాత సిద్దిపేటలో ఉదరవోషణకై స్థిరపడి పల్లెపట్టుల వాతావరణం బాగా జీర్ణించుకొన్నాడు! అది అతని మనోఫలకంపై ముద్ర వేసింది! మొత్తం చదవండి »

వ్యాసాలు సోయి | 07 జూన్ 2007

నా తెలంగాణా గురుతు గిదన్న…

- రాజు

తెలంగాణా తెలంగాణా తెలంగాణ. ప్రస్తుతం ప్రతిచోట తెలంగాణా చర్చానీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు దిక్కూ, దిశను వదలి ప్రయాణించి ప్రజల్లోనూ నమ్మకాన్ని పోగొట్టుకొన్న తెలంగాణా రాష్ట్ర ఉద్యమం (మళ్ళీ) కె.సి.ఆర్‌ ఘన విజయంతో మళ్ళి ఊపందుకుంది. కొందరైతే దాదాపు తెలంగాణా ఏర్పడినట్టేనని భ్రమపడ్తున్నారు. ఇది అతిశయోక్తే కాని తెలంగాణా రాష్ట్రం తుది ఉద్యమం సాగించేందుకు ఇది అనువైన సమయం. మొత్తం చదవండి »

వైతాళికులు & వ్యాసాలు సోయి | 02 మార్చ్ 2007

తెలంగాణ వైతాళికుడుగా వట్టికోట ఆళ్వారుస్వామి

- ఎన్. వేణుగోపాల్

ఫిబ్రవరి 5, 2007 ఆళ్వారుస్వామి 46 వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం

ఆళ్వారుస్వామికి పూర్వరంగం
భూస్వామ్య, రాచరిక సమాజాలలో భూస్వామినీ రాజునూ మేల్కొలపడానికి స్తోత్రపాఠాలు పాడేవ్యక్తిగా ఉనికిలోకి వచ్చిన వృత్తి వైతాళికుడు. ఆ పదాన్నే ఆధునిక సమాజాలలో ప్రజలను చైతన్యపరచిన తొలితరం ఆలోచనాపరులను, మేధావులను, ప్రచారకులను, సామాజిక కార్యకర్తలను, ప్రజానాయకులను ఉద్దేశించి కూడ వాడడం జరుగుతున్నది. సర్వసాధారణంగా భూస్వామ్య, రాచరిక, మధ్యయుగ సమాజాలు పెట్టుబడిదారీ, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలుగా మారే పురుటినొప్పులు పడుతున్నప్పుడు ఆ మార్పును త్వరితం చేసిన, గానంచేసిన, ఆ మార్పుకు విస్తృత ప్రజాసంఘీభావం సమకూర్చిపెట్టిన మేధావులను, బుద్ధిజీవులను, సృజనకర్తలను వైతాళికులని పిలవడం జరుగుతున్నది. మొత్తం చదవండి »

వ్యాసాలు సోయి | 02 మార్చ్ 2007

కాకతీయ కళ, నా అనుభవం

- డా|| కొండపల్లి శేషగిరిరావు

విద్యార్ధిదశలో నున్నప్పుడు నేను తరచుగా వేయి స్థంభాల గుడిని చూచి దాని అద్భుత నిర్మాణానికి ఆశ్యర్యపడి ఆనందించేవాడిని. నా స్నేహితులను, ఆట పాటలను వదిలి వంటరిగా శిల్పాలను తరచు తిలకించే వాడిని. నల్లరాతితో చెక్కిన శిల్ప స్థంభాలను, ప్రతిమలను వాటి అలంకరణను చూచి ఏదో దైవికానందాన్ని పొంది వాటి కళాప్రాభవానికి ముగ్దుడనయ్యేవాణ్ని. మొత్తం చదవండి »

మన సంస్కృతి & వ్యాసాలు సోయి | 02 మార్చ్ 2007

అంతరించిపోతున్న తెలంగాణ పంటల సంస్కృతి - ఒక పరిశీలన

- బి. వేణుగోపాల్ రెడ్డి

సంస్కృతి వివిధ రూపాలలో కనపడుతుంది. ముఖ్యంగా ఒక ప్రాంత ప్రజలను గుర్తించాలంటే వారి కొట్టుబొట్టు, భాష మరియు ఆహారపు అలవాట్ల ఆధారంగా గుర్తించగల్గుతాము. అయితే ఆహారపు అలవాట్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. వీటి ఆధారంగా వారి సంస్కృతి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మొత్తం చదవండి »

వ్యాసాలు సోయి | 02 మార్చ్ 2007

గిరిజనుల స్వప్నసాకార వేదిక నాగోబా జాతర

- డా|| ఉదారి నారాయణ

ఏ జాతి సంస్కృతి అయినా ఆ జాతి ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. సంస్కృతి ఆత్మంతా పండగలలోనే ప్రతిబింబిస్తుంది. త్వరితగతిన మారుతున్న మానవ జీవితం ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకొని ఒకింత బరువుగా ముందడుగు వేస్తూనే ఉంది. పాశ్చాత్య సంస్కృతి వల్ల వర్తమానదేశాలు విపరీత ప్రభావాలకు గురి అవుతున్నాయి. మొత్తం చదవండి »

వ్యాసాలు సోయి | 02 మార్చ్ 2007

తెలంగాణ కవిత్వం - ప్రాపంచిక దృక్పథం

- కాసుల ప్రతాపరెడ్డి

తెలంగాణ కవిత్వానికి ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం వుంది. ఇది సంకుచితమైందో, కేవలం రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షకు మాత్రమే పరిమితమైందో కాదు. అంతకు మించిన దృక్పథాన్ని అది వ్యక్తం చేస్తున్నది. నిర్దిష్టత నుంచి సార్వజనీనతను వ్యక్తం చేసే అత్యుత్తమ కవిత్వానికి తెలంగాణ ప్రాంతీయ కవిత్వం ఇవాళ్ల ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితుల్లో తెలంగాణ కవిత్వం ప్రాసంగికత మరింత పెరిగింది. మొత్తం చదవండి »

Next Page »