వ్యాసాలు సోయి | 01 మార్చ్ 2007
తెలంగాణాలోని కొన్ని ప్రమాణవాక్యములు
- కైరిక దేవరావు
జానపద సంస్కృతి ఒక మహాసముద్రము. అందులో జానపద సాహిత్యమొక మహానది. జానపదులు చేసే విభిన్న వృత్తులు, వ్యవసాయం, పశుపోషణ, చేనేత ఇత్యాదులన్నీ మరొక మహానది. వారి దేవతలు, ఆరాధనా పద్ధతులు మరొకమహానది. వారి ఆటపాటలు, వారి వినోదాలు, ఉత్సవాలు, వివాహాది సకల సంస్కార సంచయం మరొక మహానది. మొత్తం చదవండి »
వార్తల్లో & వ్యాసాలు సోయి | 01 మార్చ్ 2007
మట్టి మనుషుల పాదయాత్ర
- పరవస్తు లోకేశ్వర్
“చల్తే చలో చల్తే చలో చల్తే చలో
ఏ వక్త్ కీ ఆవాజ్ హై చల్తే ఛలో”
మట్టికాళ్ల మహారాక్షసి కోస్తా ఆంధ్ర అంతర్గత వలసవాద పెత్తనానికి వ్యతిరేకంగా తల్లి తెలంగాణా విముక్తి కోసం భూమి పుత్రుల పాదయాత్ర- నేలతల్లి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం మట్టి మనుష్యుల జైత్రయాత్ర. నడక నడక. నడక నడుస్తున్న చరిత్ర. మాకాళ్ళ మీద మేం నడుస్తున్నాం. మా నేల మీద మేం నడుస్తున్నాం. మేం ముందుకు మున్ముందుకే నడుస్తాం. ప్రపంచం మా వెంట నడుస్తుంది. నడక. నడక. నడక మా నేస్తం- కంటికి దూరమైతె కాలికి దూరమా? మొత్తం చదవండి »
కవితలు & వ్యాసాలు సోయి | 01 మార్చ్ 2007
గులాబీలు 07
- అమ్మంగి వేణుగోపాల్
కొబ్బరిబొండాంలోని నీళ్ళు తెలంగాణవి
అమ్ముకొని తినేది ఆంధ్రావాలా
సొమ్మెకడిది సోకొకడిది
లక్ష ఉద్యోగాలు తెలంగాణవి మొత్తం చదవండి »
వ్యాసాలు సోయి | 01 మార్చ్ 2007
హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయానికి ఆళ్వారుస్వామి పేరు పెట్టాలి
ఆళ్వారు స్వామి సంస్మరణసభలో తీర్మానం
నల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలం, మాదారం (కలాన్), గ్రామంలో వట్టికోట ఆళ్వారుస్వామి 1915 నవంబర్ 1న జన్మించారు. 1961 ఫిబ్రవరి 5న మరణించారు. 46 ఏండ్ల తన చిన్న జీవితంలో ఆళ్వారుస్వామి నిర్వహించిన భూమిక, చూపిన ప్రభావం ఆయనను తెలంగాణ వైతాళికుడుగా, ప్రజల మనిషి తెలంగాణ ప్రజల మనస్సుల్లో స్థిరపడిపోయేటట్లు చేసినాయి. మొత్తం చదవండి »
మన సంస్కృతి & వ్యాసాలు సోయి | 02 డిసంబర్ 2006
తెలంగాణ జన్మనిచ్చిన అద్భుత జానపద కథలు
- డా|| ముదిగంటి సుజాతా రెడ్డి
జానపద సాహిత్యం ఒక మహాసముద్రం. దాని పుట్టుక మూలాలను గురించి తెలుసుకోవటం మహా కష్టం. ఆదిమ మానవుని అనుభవం కల్పనల నుంచి ఎన్నో కథలు పుట్టాయి. అతని భయం ఆకాంక్షలు దైవరాక్షస శక్తుల మీద నమ్మకాలు ఆలోచనకు అందని సంఘటనలు తీర్చుకోలేని కోరికలు అందుకోలేని లోకాలు అద్భుతమైన కథల సృష్టికి ప్రేరణలయ్యాయి. మానవాతీతమైన అద్భుత శక్తులు అతని తీరని కోరికలను సాకారం చేసేవిగా కథల్లో దూరాయి. మొత్తం చదవండి »
మన సంస్కృతి & వ్యాసాలు సోయి | 02 డిసంబర్ 2006
తెలంగాణ జానపద కళాకారుల ‘గణనాయక ప్రార్థనలు’
- రంగురాజు పాపయ్య
(కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ, దేశ, భాష, కలిమి, లేమి, సజ్జన, దుర్జన, స్వ, పర, తరతమ భేద భావనలు లేకుండా గణనాయకుడు కాపాడగలడనే నమ్మకంతో ప్రార్థనలు చేసే ఆయా జానపద కళాకారుల సహృదయతకు నమస్కరిస్తూ….)
జానపదవృత్తి కళాకారులు ఎందరో మన రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు. ఏ మారుమూల గ్రామాల్లో ఉన్నా, ఆయా కళాకారుల కళాప్రదర్శనల్లో మొట్టమొద గణనాయక ప్రార్థన ఉంటుంది. అందరకూ శుభం జరగాలనే తపన కళాకారుల గళాల్లో కదలాడుతూ ఉంటుంది. మొత్తం చదవండి »



