పోస్టులు అభిప్రాయాలు 08 September 2010

Archive for "సమీక్షలు"



సమీక్షలు సోయి | 01 డిసంబర్ 2006

‘తెలంగాణా శతక సాహిత్యం’ : డా|| పల్లేరు వీరస్వామి గారి పరిశోధన గ్రంథం

- డా|| శంకరమంచి శ్యాంప్రసాద్

 తెలుగులో నిత్యనూతన చైతన్యంతో పరవళ్ళు తొక్కుతూ సజీవ స్రవంతియై కవితా మాగాణంలో నిత్యం కవితా కుసుమాలను విరబూయిస్తున్న విశిష్ట సాహిత్య ప్రక్రియ శతకం. కవి హృదయం నుండి లావాలా పొంగివచ్చే భావధారకు అక్షర చిత్రికను పట్టిస్తుంది శతకం. ఆస్తికుని ఆర్తికి, రసికుని శృంగారానికి, సామాజకుని ఆవేదనకు, వేదాంతుని తాత్వికతకు వేయేల ఏ భావానికి ఆ రూపాన్నిస్తూ అవతరించిన నాటి నుంచి ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న సాహిత్య ప్రక్రియ శతకం. మొత్తం చదవండి »

సమీక్షలు సోయి | 01 డిసంబర్ 2006

తెలంగాణా అస్థిత్వ కవిత్వం: `పొక్కిలి’

- సబ్బని లక్ష్మీనారాయణ

పొక్కిలి కవిత్వం పుట్టుక, నేపథ్యం సమాజమే అయినపుడు ఒక నేల గురించి, జాతుల గురించి వెలువడే సాహిత్యం, కవిత్వం సజీవ రూపాలై ఆ నేల, ఆ ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలనూ ప్రతిబింబిస్తుంటాయి. తెలంగాణా గడ్డకు ఒక ఉజ్వలమైన సాహిత్య చరిత్ర, నేపథ్యం ఉంది. ఈ నేలపై తలెత్తిన ఉద్యమాల్లో తెలంగాణా సాయుధ పోరాటం మహోన్నతమైనది. తెలంగాణాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రజాపోరాటమది. మొదటినుంచి ఇది పోరు గడ్డ, అణిచివేయబడ్డ గడ్డ, దగా చేయబడ్డ గడ్డ. ఆ నేపధ్యంలోంచి అద్భుతమైన రచనలు వెలువడ్డాయి. ఒకనాటి నిజాం నిరంకుశ పాలన రోజుల నుంచి, తెలంగాణా సాయుధ పోరాటం నుంచి స్పందించి, భాషలు కాదని, దేశాలు కాదని ఈ నేలను, ఈ నేల పోరాటాలను గూర్చి అద్భుతంగా కవిత్వం చెప్పిన వారున్నారు. మొత్తం చదవండి »