పోస్టులు అభిప్రాయాలు 15 March 2010

Archive for "సంపాదకీయం"



సంపాదకీయం సోయి | 08 జూన్ 2007

బహుపరాక్‌

- డా|| నందిని సిధారెడ్డి

రెండు నదుల మధ్య నివసిస్తున్న ప్రజలకు రెండుపూటల తిండి దొరుకుతలేదు. కనీసం తాగెతందుకు నీళ్లు కరువవుడు నిజంగా విషాదం. నీటి వనరు కోసం నిత్య సంఘర్షణ నేటి కఠోర వాస్తవం. భూమినీ నీటినీ ఎడబాపుతున్న వలసాంధ్రుల పెడబుద్ధులు లెక్కించతరం గాదు. పూటకో వ్యూహం రోజుకో పథకంతో వెనుకబడిన జనాన్ని వేపుక తింటున్న రాకాసిపీడ నిలువరించ తరం గాదు. కొత్తగా గోదావరి నీళ్లు కృష్ణా నదిల కలిపి ఆంధ్రాకు తరలించేటందుకు ప్రణాళికలు రచించిండ్రు. మొత్తం చదవండి »

సంపాదకీయం సోయి | 02 మార్చ్ 2007

మూడో మోసం సాగది

- డా. నందిని సిధారెడ్డి

సత్యసాయిబాబా అసత్య ప్రచారానికి దిగిండు. తెలంగాణ వేరు కావాలనుడు మహాపాపమట. న్యాయాన్యాయాల వాదంలో వలసవాదులు ఓడిపోయిండ్రు. సెంటిమెంటు సెంటు రాసీ రాసీ తేలిపోయిండ్రు. అభివృద్ధి తర్కంతో అతకని గుణాంకాలతో చావుదెబ్బలు తిన్నరు. వలసవాదుల అస్త్రాలన్నీ వట్టిపోయినయి. మట్టి గరిచినయి. ఆఖరుకు పాపపుణ్యాల పాతకత్తి తీసిండ్రు. తెలంగాణ ప్రజల గొంతుకోయగల గొప్ప మహిమాన్విత బాబా ఎవరా! అని వెతికిండ్రు. అనుభవ ప్రాధాన్యత గుర్తెరిగి రాయలసీమ బాబా పవిత్రకార్యం చేపట్టిండు. మొత్తం చదవండి »

సంపాదకీయం సోయి | 05 డిసంబర్ 2006

అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు

కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని మోసం చెయ్యటానికే సిద్ధపడింది. పూటకో మాట, రోజుకో వేషం పుణ్యకాలం నైపుణ్యంతో వెళ్లదీస్తున్నది. తెలంగాణ చెయిజారి అధికారం పోతుందనేసరికి ఆంధ్రావలస సామ్రాట్టులకు కంపరం మొదలైంది. `అధికారాంతమున చూడవలె…’ అన్నరు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని వక్రీకరణలు, ఎన్ని అనునయింపులు. పాలకులు తమవిద్యలన్నీ ప్రదర్శిస్తున్నరు.
మొత్తం చదవండి »