గల్పిక సోయి | 02 డిసంబర్ 2006
కుతికె
- అనిశెట్టి రజిత
‘ఒక్కనాటిదా ఒక్కేటిదా… రోజు సచ్చెసావుకు దినదినం సాకులెందుకు… సోకాలెందుకు’… తనలో తను మాట్లాడుకోబోయి జర పెద్దగనే ఇంటిపక్కపొంటున్న కాలిబాటల కెల్లి పోయేటోల్లకు వినిపించే తీరుగనే అంటున్నాడు సత్తెయ్య.
అప్పుడే రోడ్ మీదికి బోయెటందుకు వస్తున్నరమేశు, జంగయ్యలిద్దరు సత్తెయ్యమాటలు. చెవునబడి ఒకరిమొకాలొకరు జూసుకొని ముసి ముసిగ నవ్వుకుంట `ఎవల గురించి సామెతలు జెప్తున్నవే సత్తెయ్యమావా `అనుకుంట సత్తెయ్య కుర్చున్నగద్దె దగ్గరికి నడిచిన్లు.



