పోస్టులు అభిప్రాయాలు 04 February 2012

Archive for "కవితలు"



కవితలు సోయి | 02 సెప్టెంబర్ 2007

జానపదం

-గట్టు వెంకట్రావ్‌

ఎన్నియ్యలో… ఎన్నియ్యలో…
ఎన్నినాల్ల కచ్చిందమ్మా అందాల చందాల ||ఎన్నియ్యలో||

నెత్తిమీద కడవ పెట్టి కొంగు నేమో నడముకుజుట్టీ
చేతిలో కొడవలి పట్టి- పొలముగొయ్య పోతాఉంటే
సుక్కల్ల చంద్రుడే నిన్నూ చూసి కన్నేకొట్టే ||ఎన్నియ్యలో||

పరిమోపు ఎత్తుకొని అడుగెనుక అడుగేసి
పాటపాడుకుంటు నువ్వు పొలము గట్టు దాటుతుంటే
నీపాటే వింటు కోయిలమ్మ,
పాట మరిచిపాయే ||ఎన్నియ్యలో||

సంధ్యవేల కాబట్టే నా మనుసు నిలువదాయే
కలిసిపోయి నా మనసూ ఆగమయి పోవట్టే
ముందునిన్నుచూసి నీ అందమంతవిందామే. ||ఎన్నియ్యలో||

కవితలు సోయి | 07 జూన్ 2007

మాయం

- బోదిరెడ్డి మధుసూధన్‌ రెడ్డి

హైటెక్‌ రాజ్యంలో
అన్ని పనులు అల్కగానే జరుగుతాయి
ఇప్పుడు మనుషుల ‘మాయం’ కూడ
హైటెక్‌ మాయనే
పెన్నుతో, పేపర్‌తో డాక్టర్‌తో,
పనిలేకుండానే పనైపోతుంది. మొత్తం చదవండి »

కవితలు సోయి | 07 జూన్ 2007

తెలంగాణ

-మంగ్లారపు దివాకర్‌

ఆంగ్లేయుల పాలనలో లేకున్నా
ఆజాదీ కోసం ఓ యేడాది పాటు
అధికంగా పోరు సాగించి స్వేచ్ఛసాధించిన
తెలంగాణా, త్యాగాలకు అడ్డ-తెలంగాణ గడ్డ మొత్తం చదవండి »

కవితలు సోయి | 07 జూన్ 2007

ఆల్లు కష్టపడ్తర్సార్‌… మనోళ్ళు సోమరిపోతులు

- ఏనుగు నరసింహారెడ్డి

ఆల్లు
కోనసీమ కొబ్బరాకులమ్మి
ప్రజ్ఞాపురంలో పత్తితోట కొంటరు
మూడోపంటకు నీరిడ్సుకొని
సెక్రెటేరియెట్ల నౌకర్లల్లుంటరు మొత్తం చదవండి »

కవితలు సోయి | 07 జూన్ 2007

మోదుగపూలు

- నాంపల్లి సుజాత

పొట్టకూటికి తప్పని కొత్తఫీట్లు
పండు గుండెల్లో కత్తిదించందే
గొంతు జారదు
సౌదీ మస్కట్‌ దుబై
ఏ పేరైనా పొరుగోడికి ఊడిగవే, మొత్తం చదవండి »

కవితలు సోయి | 07 జూన్ 2007

వలస దోపిడి

- ఆర్‌. చందా

పొట్టి శ్రీరాములు పేరు జెప్పినరు
విశాలాంధ్ర నేర్పాటు జేసినరు
ఇత్తుదెచ్చినరు పొత్తు గూడినరు
మిగులు నిధులను మింగివేసినరు మొత్తం చదవండి »

కవితలు సోయి | 07 జూన్ 2007

రాయి

- కె.ఎస్‌. అనంతాచార్య

మనుషులు అమెరికాకు
పక్షులు సైబేరియాకు
బండలు పట్నాలకు
వలసలు, వలసలు, వలసలు !! మొత్తం చదవండి »

కవితలు సోయి | 02 మార్చ్ 2007

అందుకో జోహార్లు! వట్టికోట ఆళ్వారు

- ఎస్. నర్సిరెడ్డి
ఎల్.పి (టి) జిల్లాపరిషత్ హైస్కూల్, మాదారం (కలాన్)

అందుకో జోహార్లు వట్టికోట ఆళ్వారు
మా మాదారం గ్రామ ప్రజల నీరాజనాలు
మమతల కోవలె లాంటి మాదారంలో పుట్టి
గౌరారం మండలానికే గౌరవాన్ని తెచ్చిపెట్టి మొత్తం చదవండి »

కవితలు సోయి | 02 మార్చ్ 2007

వందనాలు వట్టికోట ఆళ్వారుస్వామి

- ఎర్ర యాదయ్య, టీచర్, చిత్తలూరు

పల్లెనిను తలుస్తుంది జిల్లనిను గొలుస్తుంది
తెలంగాన తల్లినీకై తల్లడిల్లిపోతుంది
ఓ… వట్టికోట ఆళ్వారూ
వందనాలు వందనాలు నీకు మా జోహార్లు ||2|| మొత్తం చదవండి »

కవితలు సోయి | 02 మార్చ్ 2007

ఆళ్వారూ ! ప్రజల పోరు !

- గింజల నరసింహారెడ్డి

ఆళ్వారూ ! వట్టి కోట
ఆళ్వారూ ! ప్రజల పోరు !
తెలంగాణ వైతాళిక
జలదాల్లో ఒక్కడవై
మీర్ మాకరువును కూల్చే
చైతన్యపు వానకారు. మొత్తం చదవండి »

Next Page »