పోస్టులు అభిప్రాయాలు 13 March 2010

Archive for "సభలు-సమావేశాలు"



సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007

“ఎన్నాద్రి” ఆవిష్కరణ

ప్రముఖ కవి డాక్టర్‌ కాసుల లింగారెడ్డి రచించిన “ఎన్నాద్రి” కవితా సంకలనాన్ని హైదరాబాద్‌లోని బషీర్‌బాగు ప్రెస్‌ క్లబ్‌లో జూలై 7,2007 రాత్రి వరవరరావు ఆవిష్కరించారు. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007

అందరినోట … అదే మాట తెలంగాణ

జాతీయ సదస్సులో వెల్లివిరిసిన చైతన్యం - ప్రత్యేక రాష్ట్రంపై సాహితీ పోరు

‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం… ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం” అంటూ అందెశ్రీ ఆలపించిన ప్రారంభ గీతం జూలై 19న భువనగిరిలో జరిగిన తెలంగాణ సాహిత్య సదస్సుకు సరికొత్త ఉత్సాహోన్ని ఇచ్చింది. దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న ఈ ప్రాంత సాహిత్య కళారూపాలను ప్రజల చెంత చేర్చాలనే తలంపుతో ‘తెలంగాణ సాహిత్యం- జీవిత చిత్రణం పేరిట ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు తెలంగాణ అభిమానుల గుండెలను హత్తుకుంది. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007

సాహితీ చరిత్రలో ఆదిలాబాద్‌ జిల్లాకు అన్యాయం

సాహితీ చరిత్రలో ఆదిలాబాద్‌ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ప్రముఖ రచయిత, ప్రాచీన లిఖిత గ్రంథాల పరిశోదనాలయ సంస్థ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ జయదీర్‌ తిరుమలరావు అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌ 7న నిర్మల్‌లో మునిపంతులు రచించిన గోండిభారతం పుస్తక సంకలనాన్ని తిరుమలరావుతో బాటు ప్రముఖ సిని డైరక్టర్‌, మాభూమి ఫేమ్‌ బి.నర్సింగరావులు ఆవిష్కరించారు. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007

తెలంగాణ కవిత - 2007 ఆవిష్కరణ

తెలంగాణ కవుల నిరసన, ధిక్కారం, ఆగ్రహం, ఆవేదన, గోసలతో కూడిన ఆత్మగల్ల కవిత్వం “తెలంగాణ రాష్ట్ర అవతరణని బలంగా కాంక్షిస్తున్న ‘ఓ అవ్వ’ చేతుల మీదుగా తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ఆదిలాబాద్‌ స్థానిక అమరవీరుల స్థూపం వద్ద యువకవి వేణుగోపాల్‌ రెడ్డి నినాదాల మధ్య ఆవిష్కరణ జరిగింది. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తెలంగాణా కవితా వైతాళికులు

“తెలుగు సాహిత్యం గర్వించదగిన ఎందరో మహా కవులనూ, రచయితలనూ, తెలంగాణ సాహిత్యం సృష్టించుకున్నది. మట్టి మనషులు ఇక్కడ చైతన్యంతో మహా కవులుగా రూపొందారు. సామాన్యులు మాన్యులైన మహారచయితలుగా సాహిత్యాన్ని సృష్టించారు. మఖ్దుం, దాశరధి, కాళోజి, వానమాములై, సుద్దాల హనుమంతు, సి. నారాయణ రెడ్డి తదితర కవితా వైతాళికులను స్మరించటం స్ఫూర్తిదాయకం” అంటూ పలువురు వక్తలు విశ్లేషించారు. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007

పెండ్యాల రాఘవరావు “నా ప్రజాజీవితం” పుస్తకావిష్కరణ సభ

ప్రజల కోసం జీవించి వారి బాధలను తమ బాధలుగా భావించి ప్రజా పోరాటం చేసిన మహానీయుల ఆదర్శమే స్వచ్చమైన ప్రజాస్వామ్యానికి పునాదిగా పలువురు వక్తలు అభివర్ణించారు. స్వాతంత్య్ర యోధుడు పెండ్యాల రాఘవరావు 20వ వర్ధంతిని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 10న ఆయన ఆత్మకథ ‘నా ప్రజా జీవితం’ పుస్తకావిష్కరణ వరంగల్‌ జిల్లా పరిషత్‌ హాల్‌లో జరిగింది. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007

వీరయోధుల స్ఫూర్తితో సామ్రాజ్యవాదాన్ని అంతం చేయాలి

నాటి స్వాతంత్య్ర పోరాట వీరయోధులను స్ఫూర్తిగా తీసుకొని సామ్రాజ్యవాదాన్ని అంతం చేయటానికి ఉద్యమిరచాలని విరసం నాయకులు వరవరరావు పిలుపునిచ్చారు. జూలై 17న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ హస్టరీ సోసైటీ అధ్వర్యంలో లోకేశ్వర్‌ రాసిన “1857 హైదరాబాద్‌ తిరుగుబాటు గాథలు” పుస్తకావిష్కరణ జరిగింది. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సోయి | 07 జూన్ 2007

‘పేగుబంధం’ ఆవిష్కరణ

ఎన్నో సాహిత్య ఉద్యమాలకు, ప్రక్రియలకు నల్లగొండతో అవినాభావ సంబంధం ఉందని ప్రముఖ రచయిత అల్లం రాజయ్య అన్నారు. బోధనం నర్సిరెడ్డి రాసిన ‘పేగుబంధం’ కథల పుస్తకాన్ని మార్చి 10వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆయన ఆవిష్కరించారు. గ్రామీణ మానవ సంబంధాల్లోని ఉన్నత విలువలను ఎటువంటి జిమ్మిక్కులు లేకుండా రచయిత ఈ కథల్లో ఎంతో హృద్యంగా చిత్రించాడని ఆయన ప్రశంసించారు. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సోయి | 07 జూన్ 2007

”ధిక్కారం” పుస్తకావిష్కరణ

-రిపోర్టు నల్లెల రాజయ్య

ఏప్రిల్‌ 20వ తేదీనాడు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హన్మకొండలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అనేక మంది సాహితీ ప్రముఖులు, సాహిత్యాభిలాషుల సమక్షంలో ”ధిక్కారం” పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఒక చారిత్రక సందర్భ విశ్లేషణతో వరవరరావు రాసిన ముందు మాటతో వరంగల్‌ రచయితల సంఘం పక్షాన నల్లె రాజయ్య, వడ్డెబోయిన శ్రీనివాస్‌ల సంపాదకత్వం, ఎం.ఎ.బాసిత్‌ కృషితో ప్రకటించిన ”ధిక్కారం” సామ్రాజ్యవాద వ్యతిరేక కవితా సంకలనాన్ని ప్రముఖ కవి, తెలంగాణా రచయితల వేదిక అధ్యక్షులు నందిని సిధ్ధారెడ్డి ఆవిష్కరించగా, రచయిత, సాహితీ విమర్శకులు, వీక్షణం వర్కింగు ఎడిటర్‌ ఎన్‌. వేణుగోపాల్‌ సమీక్షించారు. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సోయి | 07 జూన్ 2007

సూరత్‌లో తెలంగాణ అవగాహనా సదస్సు

గుజరాత్‌ రాష్ట్రంలో సూరత్‌ పట్టణములో నివసిస్తున్న తెలంగాణీయులు ఫిబ్రవరి 26వ తేదీన ‘తెలుగు వికాస మండలి’ ఆధ్వర్యంలో తెలంగాణ అవగాహనా సదస్సును నిర్వహించారు. రాత్రి 8 గంటలనుండి 12.00 గంటల వరకు దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ అవగాహనా సదస్సు సభికులను ఉర్రూతలూగించింది. తెలంగాణ తల్లికోసం ప్రవాస తెలంగాణీయులు చూపిస్తున్న ఆర్తికి అద్దం పట్టింది. మొత్తం చదవండి »

Next Page »