సభలు-సమావేశాలు సోయి | 01 మార్చ్ 2007
గుండెలను తడిచేసిన మంజీర పరవళ్ళు - ఉత్తేజం నింపిన మరసం ఇరవై ఏళ్ళ మహాసభలు
రిపోర్టు : తోట అశోక్
ఉప్పొంగే భావాలతో, ఉద్యమ నాదాలతో మెతుకు సీమ గుండెలను తడిచేస్తున్న మంజీర రచయితల సంఘం ఇరవై ఏళ్ళ మహాసభలు మెదక్ జిల్లా సిద్దిపేటలో స్ఫూర్తిదాయకంగా జరిగాయి. 2006 నవంబర్ 11, 12 తేదీలలో కాళోజీ ప్రాంగణంలో జరిగిన సభల్లో మాటలు, పాటలు, ఆటలు పరవళ్ళు తొక్కాయి. మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాలనుండి రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొని సాహిత్యంపై అభిమానం చెదరలేదని నిరూపించారు. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 మార్చ్ 2007
తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకుందాం
- తెలంగాణా రచయితల వేదిక
తెలంగాణా ప్రజల మనోభావాలకు భిన్నంగా విశాలాంధ్రను ముందుకు తెచ్చిన రాజకీయ శక్తులు తెలుగు తల్లిని నెలకొల్పారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క సామాజిక, చారిత్రక అంశంతోను, తెలంగాణ మూలాలకు సంబంధం లేని తెలుగు తల్లికి భిన్నంగా తెలంగాణా తల్లిని ప్రతిష్టించుకోవాలని కోరారు. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 మార్చ్ 2007
ముదిగంటి సుజాత రెడ్డికి ‘రంగినేని ఎల్లమ్మ’ సాహిత్య పురస్కారం
సిరిసిల్ల రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్ మరియు చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు రంగినేని మోహన్‌రావు తన తల్లి కీ||శే|| రంగినేని ఎల్లమ్మ పేర నెలకొల్పిన ‘రంగినేని ఎల్లమ్మ రెండవ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం తేది.09.01.2007 మంగళవారం రోజున సిరిసిల్లలోని రంగినేని ట్రస్టులో జరిగింది. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 డిసంబర్ 2006
తెలంగాణ ‘కయిత’కు కైమోడ్పు
తెలంగాణా
సాంస్కృతిక చైతన్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించాయి. జీవితంలోని లోతులను, సామాజిక వెనుకబాటు తనంలోని మూలాలను వెతికాయి. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అందరూ అక్కడ ‘కయితలు’ చదివారు. పాటలు పాడారు. మరో మలుపు తిరిగిన తెలంగాణ ఉద్యమాన్ని రచయితలు, కవులు, కళాకారులు సై అన్నారు. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 డిసంబర్ 2006
అస్తిత్వ ఆకాంక్షల కోసం గొంతెత్తిన కరీంనగర్ రచయితలు
తెలంగాణా ఉద్యమ వ్యాప్తికి ఢిల్లీకైనా కదలాలని ‘కవిగాయక తెలంగానం’ సభ తీర్మానం
- రిపోర్టు : అన్నవరం దేవేందర్
కరీంనగర్ కవులు రచయితలు గాయకులు తమ అస్తిత్వ ఆకాంక్షల కోసం మరోసారి గొంతెత్తి నినాదించారు. తెలంగాణా ఆత్మ గౌరవ ఉద్యమం కోసం సాహిత్యాన్ని ఊపిరిగా చేసికొని కదలాలని నిర్ణయించారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24, 2006 ఆదివారం రోజు కరీంనగర్ ఫిలిం భవన్లో ‘కవిగాయక తెలంగానం’ సదస్సు పేరిట జిల్లా వ్యాప్తంగా ఉన్న 150 మంది కవులు రచయితలు సమావేశం అయ్యారు. సదస్సు అంతా ఒకటే తండ్లాట ‘‘మన తెలంగాణ మనగ్గావాలి’’. మొత్తం చదవండి »
సభలు-సమావేశాలు సోయి | 01 డిసంబర్ 2006
కాళోజి ఉద్యమస్ఫూర్తితో పనిచేయాలి
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడవు
సంకోచపడియెదపు సంగతేమిటిరా
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవేటి



