మన సంస్కృతి సోయి | 07 జూన్ 2007
సాంస్కృతిక జీవనంలో కుండ - ఆదిలాబాద్ రంజన్ల ప్రత్యేకత
-బి. వేణుగోపాల్ రెడ్డి
తొలకరికి పులకరించిన నేల మట్టి సౌరభాలను వెదజల్లుతుంది. సువాసనలతో నిండిన ప్రకృతిని చూసి మనిషి విహంగమవుతాడు. జంతువులను వేటాడి రక్తపు వాసన మరిగిన మనిషి ఆదిమ మనిషి వాసనతో నిండిన మట్టిని హత్తుకుంటాడు. మొత్తని మట్టిని తన చేతులలో మురిపెంగా లాలిస్తాడు. ‘మన్ను బొమ్మను’ చేసి పరవసిస్తాడు. మొత్తం చదవండి »
మన సంస్కృతి & వ్యాసాలు సోయి | 02 మార్చ్ 2007
అంతరించిపోతున్న తెలంగాణ పంటల సంస్కృతి - ఒక పరిశీలన
- బి. వేణుగోపాల్ రెడ్డి
సంస్కృతి వివిధ రూపాలలో కనపడుతుంది. ముఖ్యంగా ఒక ప్రాంత ప్రజలను గుర్తించాలంటే వారి కొట్టుబొట్టు, భాష మరియు ఆహారపు అలవాట్ల ఆధారంగా గుర్తించగల్గుతాము. అయితే ఆహారపు అలవాట్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. వీటి ఆధారంగా వారి సంస్కృతి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మొత్తం చదవండి »
మన సంస్కృతి & వ్యాసాలు సోయి | 02 డిసంబర్ 2006
తెలంగాణ జన్మనిచ్చిన అద్భుత జానపద కథలు
- డా|| ముదిగంటి సుజాతా రెడ్డి
జానపద సాహిత్యం ఒక మహాసముద్రం. దాని పుట్టుక మూలాలను గురించి తెలుసుకోవటం మహా కష్టం. ఆదిమ మానవుని అనుభవం కల్పనల నుంచి ఎన్నో కథలు పుట్టాయి. అతని భయం ఆకాంక్షలు దైవరాక్షస శక్తుల మీద నమ్మకాలు ఆలోచనకు అందని సంఘటనలు తీర్చుకోలేని కోరికలు అందుకోలేని లోకాలు అద్భుతమైన కథల సృష్టికి ప్రేరణలయ్యాయి. మానవాతీతమైన అద్భుత శక్తులు అతని తీరని కోరికలను సాకారం చేసేవిగా కథల్లో దూరాయి. మొత్తం చదవండి »
మన సంస్కృతి & వ్యాసాలు సోయి | 02 డిసంబర్ 2006
తెలంగాణ జానపద కళాకారుల ‘గణనాయక ప్రార్థనలు’
- రంగురాజు పాపయ్య
(కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ, దేశ, భాష, కలిమి, లేమి, సజ్జన, దుర్జన, స్వ, పర, తరతమ భేద భావనలు లేకుండా గణనాయకుడు కాపాడగలడనే నమ్మకంతో ప్రార్థనలు చేసే ఆయా జానపద కళాకారుల సహృదయతకు నమస్కరిస్తూ….)
జానపదవృత్తి కళాకారులు ఎందరో మన రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు. ఏ మారుమూల గ్రామాల్లో ఉన్నా, ఆయా కళాకారుల కళాప్రదర్శనల్లో మొట్టమొద గణనాయక ప్రార్థన ఉంటుంది. అందరకూ శుభం జరగాలనే తపన కళాకారుల గళాల్లో కదలాడుతూ ఉంటుంది. మొత్తం చదవండి »



