సంస్మరణ సోయి | 07 జూన్ 2007
మృత్యుముఖంలో మళ్ళీ మెరిసిన ‘విద్యుల్లత’
- అంపశయ్య నవీన్
పదమూడు నెలలు కాన్సర్ వ్యాధితో పోరాడిన ఎం.వి. తిరుపతయ్య చివరకు మార్చి 11న అర్థరాత్రి చివరి శ్వాస విడిచారు. 4.2.2006 నాడు తిరుపతయ్యకు ఈ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. కడుపులో పెద్ద పేగుకు సోకిన ఈ వ్యాధి కాలేయానికి కూడా వ్యాపించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. మూడుసార్లు ఆపరేషన్ చేశారు. వ్యాధి సోకిన భాగాల్ని తొలగించారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదు. మొత్తం చదవండి »
సంస్మరణ సోయి | 02 మార్చ్ 2007
అస్తమించిన అక్షరసూర్యుడు… ముద్దసాని రాంరెడ్డి
- కె.వి. నరేందర్
ఎవరెస్టునెక్కాలంటే ఉండాల్సింది ఆక్సిజన్ కాదు… ఆత్మవిశ్వాసం… మనకన్నీటి ఏటికి ఎదురీదాలంటే కావాల్సింది సానుభూతికాదు… నిబ్బర పోరాటం… విధి వేయి గాయాలు చేసినా వెరువక ఆశల పతంగాలు ఎగరేసేవాడే నిజమైన దీరుడు. కాలం కత్తిగీతలుగీసినా… కలల విహాంగాలు విసిరేవాడే ధీరుడు… మొత్తం చదవండి »
సంస్మరణ సోయి | 02 మార్చ్ 2007
అష్టావధాని, కవిశిరోమణి అందె వెంకటరాజం గారి సాహితీసేవ
- బి.యస్.రాములు
తెలంగాణలో కవులకు కరవు లేదు. కరీంనగర్ జిల్లా కవులకు, కళాకారులకు పుట్టినిల్లు. అందె వెంకటరాజం సాంప్రదాయ కవిత్వ రీతుల్లో పుట్టిపెరిగిన కవి. జీవితమంతా దానికే అంకితమిచ్చారు. సెప్టెంబరు 11 సోమవారం 2006న పరమపదించిన ఆయన వయస్సు 73 సంవత్సరాలు. ఆయన కోరుట్ల డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చరరుగా 1992 జూన్ 30వ తేదీన రిటైరయ్యారు. మొత్తం చదవండి »
సంస్మరణ సోయి | 02 మార్చ్ 2007
తెలంగాణ ఆణిముత్యం ‘హీరాలాల్ మోరియా’
- కె. పి. అశోక్ కుమార్
హైదరాబాదు స్వాతంత్య్ర పోరాటయోధుడిగా, విప్లవ ధోరణులతో కూడిన సంస్కరణాభిలాషిగా, ప్రముఖ పత్రికా రచయితగా చరిత్రకారునిగా, కవిగా, కథా రచయితగా, నవలాకర్తగా, ప్రజాస్వామ్యవాదిగా, సామాజిక పరిణామాను శీలుడుగా ప్రస్తుతించబడ్డ హీరాలాల్ మోరియా లాంటి బహుముఖ ప్రజ్ఞాశీలురు అరుదుగా కనిపిస్తారు. మొత్తం చదవండి »



