SOYI

జానపదం
-గట్టు వెంకట్రావ్‌

ఎన్నియ్యలో… ఎన్నియ్యలో…

ఎన్నినాల్ల కచ్చిందమ్మా అందాల చందాల 		||ఎన్నియ్యలో||

నెత్తిమీద కడవ పెట్టి కొంగు నేమో నడముకుజుట్టీ

చేతిలో కొడవలి పట్టి- పొలముగొయ్య పోతాఉంటే

సుక్కల్ల చంద్రుడే నిన్నూ చూసి కన్నేకొట్టే		||ఎన్నియ్యలో||

పరిమోపు ఎత్తుకొని అడుగెనుక అడుగేసి

పాటపాడుకుంటు నువ్వు పొలము గట్టు దాటుతుంటే

నీపాటే వింటు కోయిలమ్మ,

పాట మరిచిపాయే		||ఎన్నియ్యలో||

సంధ్యవేల కాబట్టే నా మనుసు నిలువదాయే

కలిసిపోయి నా మనసూ ఆగమయి పోవట్టే

ముందునిన్నుచూసి నీ అందమంతవిందామే.	||ఎన్నియ్యలో||

తెలంగాణ జాతర
-రేగులపాటి కిషన్‌రావు

జాతర ఇది జాతర

తెలంగాణ జాతర

ఊరూరి జనంతోటి

సాగిపోవు జాతర	||జాతర||

చదువు బాగరావాలని

చల్లంగా ఉండాలని

కోరచేరవచ్చినట్టి

పిల్లవాండ్ల జాతర	||జాతర||

కొడుకు ఒకడు కావాలని

ఆడబిడ్డ కలగాలని

కోరచేరవచ్చినట్టి

ఆలుమగల జాతర	||జాతర||

రోగాలూ రావద్దని

బాధలన్ని తొలగాలని

కోరచేరవచ్చినట్టి

ముసలివాళ్ల జాతర	||జాతర||

పంటబాగ పండాలని

పాడి ఇంట ఉండాలని

కోరచేరవచ్చినట్టి

రైతన్నల జాతర	||జాతర||

బేహారం బాగసాగి

లాభాలూ కురువాలని

కోరచేర వచ్చినట్టి

వ్యాపారుల జాతర	||జాతర||

చక్కనైన చుక్కలనూ

చూడ చూడవచ్చినోళ్ల

సొగసుగాళ్ల అందాలను

చూచి మురవ వచ్చినోళ్ల	||జాతర||

కోడికూర గొర్రెకూర

కొనీ తినే వారి కొరకు

సినిమాలు సర్కసులూ

చూచి మురియు వారి కొరకు ||జాతర||

జాతర ఇది జాతర

స్వామి వారి జాతర

ఊరూరి జనంతోటి

సాగిపోవు జాతర	||జాతర||

పోరు బైలెల్లింది
- నల్లెల్ల రాజయ్య

మనసు మనసు గల్సి మాటలాడుకోని

గుండె గుండె కల్పి ఊసులాడుకోని

పోరూ బైల్లిందిర తమ్ముడా

అది హోరెత్తి పోతుందే చెల్లాలా ||పోరూ||

ఊరూ వాడా కల్సి ఉగ్రరూపం దాల్చి

ఉరిమినా మబ్బులవోలె ఉరుకుల పరుగులతోటి

ఊరూరు దాటిందిర తమ్ముడా

ఊర్ల పొలిమేరలు దాటిందే తమ్ముడా

ఊర్ల పొలిమేరలు దాటించే చెల్లెలా||పోరూ||

మండలాలు దాటి జిల్లాలుకు చేరింది

జిల్లాల్లో జనమంతా హారతులు పట్టి (నీరాజనమీయంగ)

జైతెలంగాణయని జేజేలు కొట్టంగ

జిల్లాలు దాటిందిర తమ్ముడా

గోల్కొండ ఖిల్లాకే చేరిందే చెల్లెలా ||పోరూ||

నిలువ నీడాలేని నిరుపేద జనమంతా

కూడు, గుడ్డా దొరకని కూలి బలగమంత

మన నీడ, మానజాడ లేకుండా జేసిన

వలస దోపిడి గాళ్ళకు వదులాబోమంటూ (వదిలేది లేదంటూ)

నీకండగా వస్తుండ్లు తమ్ముడా

దండు దండుగానే కదిలిండ్లే చెల్లెలా ||పోరూ||

తెలంగాణ కొరకు తెగువనే చూపించి

అమరులైనోళ్లా ఆత్మలాసాక్షిగా

తెగబడుమంటుండ్లు తమ్ముడా

నిన్నెగ బడామంటుండ్లే చెల్లెలా ||పోరూ||

ఆరువందలపది జీవో అమలుకానీయకుండ

అడ్డదారులల్లో అందల మెక్కేటోళ్ల (అందల మెక్కించేటోళ్ల)

మన భాష మన యాస హేళన జేసుకుంట

మన నీళ్ళు మన బీళ్ళు మింగికూసున్నోళ్ల

మెడబెట్టి గెంటాలెర తమ్ముడా

అరె తొడగొట్టి గెదమాలే చెల్లెలా ||అరె||

తెలంగానం
- పిట్టా సాంబయ్య

తెలంగాణ తెలంగాణ

తెలంగాణ తెలంగాణ

తెలంగాణా పాట పాడరో ఓ అక్కల్లారా

తెలంగాణా ఆట ఆడరో ఓ అన్నలారా ||తెలంగాణ||

గునుగూ తంగేడు పూలు అల్లిపూలు మల్లెపూలు

కట్ల పూలు ఎన్నో దెచ్చి కట్లు కట్లుగా పేర్చి

గౌరమ్మను మధ్యబెట్టరో ఓ అమ్మల్లారా

బతుకమ్మను ఆడరాండిరో ఓ చెల్లెల్లారా ||తెలంగాణ||

కాముని జాజిరి పాటలు కోలాటం ఆటలు

రోటికాడ నాటుకాడ మోటకాడ తోటకాడ

ఉయ్యాల పాట పాడరో ఓ అక్కల్లారా

కప్పతల్లి ఆట ఆడరో ఓ అన్నలారా ||తెలంగాణ||

పీరీల పండుగకు గుండం చుట్టూ తిరిగి

జట్టీలు మట్కీలు లాల్‌శావుకు మొక్కు ఇచ్చి

హస్సాయ్‌ దూలా ఆడరాండిరో ఓ తమ్ముల్లారా

అలాయి బలాయి తీసుకోండిరో ఓ అన్నల్లారా ||తెలంగాణ||

ఎముడాలా రాజన్న యాదగిరి నర్సన్న

సమ్మక్క సారక్కకు ఎన్నో దండాలుబెట్టి

కొమురెల్లి మల్లన్నకురో ఓ అక్కల్లారా

కోరి పట్న మేయాలిరో ఓ అన్నల్లారా ||తెలంగాణ||

కాకతీయ కళలకు కోటి కోటి వందనాలు

కిన్నెరసాని వన్నెలు గోదావరి పొంగులు

చార్‌మినార్‌ మక్కామసీదో ఓ అన్నల్లారా

గోల్కొండ గుండె కాయరో ఓ తమ్ముల్లారా

మన వేషం మనభాష మనయాసల ఈసడించి

జోకర్లకు బ్రోకర్లకు భాషపెట్టి గోసపెట్తే

తెలంగాణా తల్లడిల్లెరో ఓ అన్నలారా

చెంపను ఛెల్‌ మనిపించరో ఓ చెల్లెల్లారా ||తెలంగాణ||

పోతన్న మకరందం చెవులల్ల నింపుకొని

పాల్కుర్కి సోమన్నను మదిలోన ఉంచుకొని

కాళోజిని కళ్లకద్దుకో ఓ అన్నల్లారా

తెలంగాణా పాట అందుకో ఓ తమ్ముల్లారా ||తెలంగాణ||

గద్దరన్న గొంగడాట గోరటి ఎంకన్న పాట

అంజన్న ఆవేశం అందెశ్రీ ఆవేదన

రమేషన్న డప్పునందుకో ఓ అన్నల్లారా

దండుగ దరువేయరాండిరో ఓ తమ్ముల్లారా ||తెలంగాణ||

సాధించి తీరాలి మన తెలంగాణ
- సి. హెచ్‌. రమణాచారి

కష్టాల కడలిలో నా తెలంగాణ

కన్నీటి కెరటమే నా తెలంగాణ

వలస దోపిడిలోన నా తెలంగాణ

తీగ తెగినా వీణ నా తెలంగాణ ||తెలంగాణ||

భాష మనదీ గాదు-యాసమనదీ గాదు

మన మాట మన పాట ఎక్కిరింతయిపోయె

చదువు పుస్తకాల్ల మనమాట కరువాయె

సొంత కొంపలోనె పరాయి బ్రతుకాయె

సినిమా ఆటల్లోన - నా తెలంగాణా

విలను మాటయ్యింది- ||తెలంగాణ||

వీధి నాటకాలు, చిందు బాగోతాలు

ఒగ్గు కథలూ గొల్లసుద్దులూ మాయమై

వలస సంస్కృతి దాడి వరదలా ముంచంగ

కళలన్నీ కళదప్పి - పల్లె వెలవెలబోయె

కవుల కవితల్లోన - నా తెలంగాణా

కన్నీటి పాటాయె ||తెలంగాణ||

గోదారి కృష్ణమ్మ - పెనుగంగ ప్రాణహిత

జూరాల సింగూరు - మానేరు మంజీర

జలవనరులెన్నున్న - నీటికరువేరన్న

దారితప్పిన నీరు - సాగుభూములు బీడు

కటకటా కరువాయె నా తెలంగాణా

కన్నీటి చెరువాయె ||తెలంగాణ||

పడదవ్విన ఆడ నల్ల బంగారమే

బెల్లంపల్లి, సింగరేణి గోదావరీ ఖనులు

రామగుండము మనది వెలుగు ఖండమురన్న

సొమ్ము మనదే గాని - సోకెవరిదోరన్న

చీకటి రాజ్యంల - నా తెలంగాణా

వెలుగు నోచని బ్రతుకు ||తెలంగాణ||

పాడిపంటలు ఏవి? పసిడి ధాన్యము ఏది?

పనులు కరువైపాయె - బ్రతుకు బరువైపాయె

చేతివృత్తులు మునిగె - ఆత్మహత్యలు పెరిగె

ఆలుబిడ్డల నిడిచి - అయ్యవ్వలను ఇడిసి

మస్కాటు దుబాయి - తొవ్వ వట్టుడు ఆయె

తీరనీ అప్పులే - నాతెలంగాణా

తిండికీ తిప్పలే ||తెలంగాణ||

భాష ఒకటేననే - రాష్ట్ర మొక్కటేననీ

అన్నదమ్ములోలె - కలిసి వుందా మండ్రు

మాయమాటలు జెప్పి - మనల ముంచూతుండ్రు

ఏరువొయ్యా మంటే - నోరు మెదుపుత లేరు

పోరు బాటాలేసి - నా తెలంగాణ

సాధించి తీరాలి - మన తెలంగాణ ||తెలంగాణ||

ఏకు - మేకు
-నల్ల భూమయ్య

మా ఊర్లె మేం సిన్నగున్నప్పటి సందే సిటీ మున్సిపాలిటి ఉండేటిది. మా వూర్లె కంపిన్ల ఆఫీసర్ల పోరగండ్లకోసం యింగ్లీషు మీడియం బడి, కంపినోని మనుసుల పొరగండ్ల కోసం హిందీ మీడియం బడి వుండేవి. మాది సర్కారు బడి, గిదీంట్ల తెలుగు, తురుకం మీడియంలు వుండేటియి.

ఏ గోంతమందో పల్లెల్లల్ల కెల్లి అచ్చే పోరగండ్లు తప్పిస్తె కడుమ అందరు గూడ నగురంల పుట్టి పెరిగి నోళ్ళు, ఏరే ఏరే ‘దేశాల’ నుంచి, ఎక్కడెక్కన్నుంచో అచ్చిన కంపిన్ల జీతగాళ్ళ పోరగండ్లు వుండెటోళ్ళు.

మావూర్లె సీన్మథేటర్లల్ల అన్ని బాసల సీన్మలు అస్తుండేటియి. ఇంగ్లీషు, హింది, తమిళం, మళయాళం, తెలుగు… గందుకని పోరగండ్లు ‘మా చాలు’ గాండ్లు! తీరు తీరు సోకులు. ఒక కిరస్తానపు పోరడు ఆని ‘బాలు’ (తలెంట్రికలు) సోకు, తీరు ఏరేనే, పల్లెటూరోళ్ళు తలెంట్రికలు ముందు సగానికి నున్నగ గుండు జేసుకోని, ఎనుక సగం కురుసగ ఎంట్రికలుంచుకోని, జుట్టు (పిలుక) పెట్టుకోని, గాజుట్టును ముడేసుకునెటోళ్ళు. గాళ్ళ ఎంట్రికల తీరు గట్లైతే, గీ పోరని ఎంట్రికల తీరు గవీటికి వుల్టా వుండేటిది. ముందు జూడ కనిపిచ్చుటానికి బాలుకు బుగ్గలు గా బుగ్గల మందం ముందు ఎంట్రికలు తప్ప యిగ కడుమ పుర్రె అంత గూడ నున్నగ గుండు. ముందు నుంచి జూసెటోళ్ళకు అందరి సదువుకునే పోరగండ్ల వారమే (వలెనే) ఆనికి గూడ బాలు వున్నదనుకుంటరు. గది ఆని సోకు! గసుంటి సోకులమారి పోరగండ్లు గప్పటి సందేవున్నరు మా వూర్లె.

సిన్న తరగతుల పోరగండ్లు నెక్కర్లు, అంగీలు తొడుక్కుంటె, పెద్ద తరగతులోల్లు పైంట్లు, బుస్కోట్లు,తొడుక్కునేది.

మా బళ్ళె, ‘కాశినాథ్‌’ సార్‌ హింది జెప్పెటోడు. గప్పుడు గూడ బళ్ళె సార్లకు ఎల్తే. అన్ని సబ్జెక్టులకు సగపడ సార్లు వుండెటోళ్ళుగాదు. గసుంటప్పుడు ‘కాశినాథ్‌’ సారుని హింది ‘మాస్టరు’ గ ఎందుకు పెట్టిండ్లంటే అయనకు హింది అక్షరాలు సదువుడు, రాసుడు మా బాగనే అస్తయి, తట్టుకునుడు గిట్ట ఏం లేకుంటనే. పుస్తకాన్ని గడ గడ మా జదువుతడు- గండ్ల వున్న దున్నట్టుగనే మా జెప్పుతడు. గని, గదీంట్ల వున్న గొట్టు, సెడగొట్టు పదాలకు అర్థం ఆయనకు గూడ సమజు అయ్యేటిది గాదు. గందుకని హింది గైడుల వున్నదున్నట్టుగ, సూసుకుంట బోర్డుమీది కెక్కిచ్చెటోడు, బోర్డుమీదున్న గదీన్ని మేముగూడ వున్నదున్నట్టుగనే కితాబులల్ల దించుకునెటోళ్ళం! గంతకు దప్ప గవీటి అర్థం మాకు దెలువది, సారుకు తెలువది.

గని, కాశినాథ్‌ సారు, పాపం, ఎప్పుడు గూడ, ఎవళ్ళని గూడ గింత కొట్టిండన్నది లేదు. గని, ఆయిన బతికున్నంతల, మేం జూసినంతల మట్టుకు ఒక యిద్దర్నంటె యిద్దర్నే, గది గూడ ఒక్కొక్కపారే కొట్టిండు. మా బడి మొత్తానికి గూడ, ఐదో తరుగతి మొదలు, పదకొండో తరుగతి దనుక హింది జెప్పగల మొనగాడు గా కాశినాథ్‌ సార్‌ ఒక్కడే. ఇంకేసారుకూ హింది రాదు. కాశినాథ్‌ సారుకు ఎవళ్ళకు లేని గొప్ప గుణమున్నది గిది ఒక్కటే గాదు. ఇంకొకటి గూడ వున్నది. మా వూర్లె బడి పుస్తకాలు అమ్మే దుకాణం ఒకటి వున్నదంటె, గా ఒక్కటి గూడ, గది కాశినాథ్‌ సారు దుకాణమే. ఏటేట, కొత్త పుస్తకాలు కాశినాథ్‌ సారు ఎప్పుడు తెప్పిస్తడో, ఎప్పుడు వొడగొడ్తడో ఎవ్వలకు తెలువది. ఎవ్వరికి దొరుకుతయో, ఎవ్వరికి దొరుకయో గూడ తెలువదాయె. గందుకని కాశినాథ్‌ సారు దుకాండ్లకు కొత్త తరగతుల పుస్తకాలు దిగినయని తెలువంగనే యిగలైను. ‘లవకుశ’ సీన్మకు గద సీన్మథేటరు టికెట్ల కాడ తొక్కులాట వారం. పోరగండ్లుగా పుస్తకాల్ని సదివిపోసినా, పొయ్యకపోయినా పుస్తకాలు మట్టుకైతే వుండా లెగద, మోసుటానికి - ఏడాదంత. పోరగండ్లంత, ఎదిగిన తరుగతుల కొత్తపుస్తకాల కోసం, దేవేంద్రుని వారం పెయ్యంత కండ్లు వెట్టుకోని ఎదురు సూస్తంటరు. రోజూ బడికి రాంగ, పోంగ గా దుకాణం ముందటి తొవ్వనే తొక్కుతాంటరు. పుస్తకాలు అచ్చినయా అని అర్సుకునేటానికి.

పోరగండ్లకున్న గీ ‘కమ్‌జోరు’ ను ఆపేసి జూసి, నాడిని దొరుక పట్టుకున్నదంటె గా ఒక్క ‘భాస్కరు’ గాడే! పోరగండ్ల గా ‘నాదాను’ తనాన్ని బగ్గ జదివి తెల్సుకున్నడంటే గా భాస్కరు ఒక్కడే. భాస్కరుగాడు వుండుటానికి నాల్గుపూట్ల ఎత్తే వుంటడు. (ఆని ఎత్తేగంత-నాటికీ, నేటికి గూడ) గని, ఆని తలుకాయ మట్టుకు రాసగుమ్మడి పండంత వుంటది. ఇగ గదీంట్ల మెదడు గూడ గంతంత కుదిచ్చి కుదిచ్చి వుంటదన్నట్లే గద! కాశినాథ్‌ సారు పుస్తకాలని తెప్పిచ్చుటానికన్న ముందుగాల్నే, భాస్కరుగాడు ఇరువై, ముప్ఫై మైళ్ళ పెట్టున వున్నపక్క కాలేర్లకు పొయ్యి, యిన్నన్ని పుస్తకాల్ని కొనుక్కోని వచ్చి మునాఫా మీద పోరగండ్లకు అమ్మెటోడు! గీ సంగతులు కాశినాథ్‌ సారుకు తెల్సినై. అంటే భాస్కరుగాడు తన మునాఫాలకు సిల్లి పడేస్తున్నడన్న మాటే గద! భాస్కరుగాడు సారుకు పెట్టిన గీ ఎసరుకు సారు కుత కుత వుడికిపొయ్యిండు. ‘భాస్కరుగా! సొంత లాభము బగ్గ జూసుక - ఎదుటివాడికి కీడు తలపెడ్తావోయ్‌! సరే! సరే! సూస్త గద నీ సంగతి! గురువుకు పంగనామాలు పెట్టుడంటే గిదేనారా, బిడ్డ! నువ్వు గురువుకే పాఠం జెప్పవడ్తివి గదరా, ‘ప్రొలాదుని’ వారం. సరే! నీ సంగతి మంచిగనే జెప్పుత…’ అనుకున్నడు మనసుల… తెల్లారంగ క్లాసులకు అస్తె అస్తెనే కాశినాథ్‌ సార్‌ “అరేయ్‌, భాస్కరుగా! నిన్న జెప్పిన పద్యాన్ని (హింది కవిత) పురాగ నోటికి జేసిన వారా? కవితని యిగ అప్పజెప్పు గిప్పుడు” అన్నడు!

భాస్కరుగాడు లేసి నిలబడి

“పద్యాన్నా సార్‌!… సెయ్యలేదు సార్‌… రాదు సార్‌…” అన్నడు.

“రాదా! పద్యం రాదా! రాదారా పద్యం?” సారు

“రాదు సార్‌!” భాస్కర్‌

“అర్రాం పొట్టే కాంకే… జెప్ప జెప్పన వురుక్కుంట బండెక్కి పక్క కాలేర్లకు పొయ్యి పుస్తకాలు కొనుక్కదెచ్చి మునాఫాల మీద పోరగండ్లకు అమ్ముడస్తదిగని, నిన్న జెప్పిన పద్యం గియ్యాల రాదారా!… ఇటు, నా దగ్గరికి రా బేట!” అన్నడు సార్‌.

భాస్కర్‌ బయపడుకుంట సార్‌ టేబుల్‌ దగ్గరికి పోంగనే, సారు భాస్కర్‌ను సెంపలమీద అరిచేతుల తోటి సర్సిండు అట్లు దేలెటట్టు! కొట్టి “సమజ్‌ లేవ్‌ బేటా! యింకెప్పుడన్న గిట్లని తెల్సిందా, యిగ గప్పుడు జూడు- వట్టి పద్యాలను కాదు గద, ‘పద్య్‌ ఔర్‌ గద్య్‌’ అన్నీటిని గలిపి పురాగ కితాబ్‌కు కితాబ్‌నే నోటికి అప్పజెప్పుమంట! తెల్సిందిగద!” అన్నడు సారు…

ఒగనాడు…

కాశినాథ్‌ సారు గంతకు ముందు ఎప్పుడు గూడ నవ్వినట్టుగ మేం మట్టుకు సూడలేదు. ఎందుకో గని, గానాడు సారు నువ్వు మొకంతోటి ఆనందంగ కన్పియ్య వట్టిండు. ఆయన నవ్వు మొకం తోటి ఆనందంగ వుండుడే గాదు, సారు, మజాకు మాటలు గూడ పెట్టవట్టిండు. మమ్ములను గూడ నవ్వియ్యవట్టిండు! సారు గా మజాకు మాటలాడుకుంట దేనిమీదికెల్లో గని, ఒగ అంగ్రేజి మాటన్నడు- ‘లెక్చరర్‌’ను ‘లెక్చర్‌’ అన్నడు. గది ఇన్నంక ‘మాలక్ష్మి’ అరిసేతిని నోటికడ్డం పెట్టుకోని నవ్వవట్టింది. గంతే గాదు- “లెక్చర్‌ కాదు సార్‌, లెక్చరర్‌” అన్నది - నవ్వుకుంటనే - సారును తప్పు వట్టి అయిన తప్పును సవరిచ్చింది! గదీంతోటి కాశినాథ్‌ సార్‌కు గంతకు ముందు ఎప్పుడు రానంత కోపమొచ్చింది. ఊదు పొగేసిన పీరి వారం లేసిండు, తూలిండు.

“నన్నే తప్పువడ్తవానే, పోరికానా! (మాలక్ష్మి సారు అన్నట్టుగ మరీ గంత సిన్న పోరేంగాదు, పద్నాలుగు, పదిగేనేండ్లన్న మా వుంటై!) అర్రాం పొట్టీ కాంకే, యింట్ల వుంటే బోల్లుతోముడు, నీళ్ళు సేదుడు, బట్టలుతుకుడు, వంటజేసుడు గిట్ట సెయ్యవల్సి వుంటదని, గా పనులను తప్పిచ్చుకునుటానికి, బడికి రాకట, అచ్చి గిక్కడ కూకునుడు. గంతనే గని గీడికచ్చి సదివింది లేదు, పూసింది లేదు. మీదికెళ్ళి సారునే తప్పు పడ్తవా….” అనుకుంట సారు మా లక్ష్మి సెంపల మీద సెంపలమీద సర్సిండు- గంత పెద్ద ఆడపిల్ల సెంపల మీద - సారు కోపంల ఆయనను ఆయినే మర్సిపొయ్యి. పాపం, మా లక్ష్మి తెల్లటి రెండు సెంపలు ఎర్రగ అట్లు దేలినై. అందరి ముందు సారు తోటి - గీ ఈడు ఏ ఆడపిల్ల పడని దెబ్బలు తను తిన్నదిగదా అన్న సిన్నతనం, సిగ్గుతోటి ఆమె మొకం ఎర్రవడ్డది మందారపు పువ్వు వారం! ఏ యుగమందున, ఏ ఇల్లాలూ ఎరుగదు తల్లీ ఈ అవమానం! అన్నట్టు గైంది పాపం!

అగో, గీ రెండు తప్పిస్తే, కాశినాథ్‌ సార్‌ యింకెప్పుడు, ఎవ్వల్ని కొట్టిన పాపాన పోలేదు, పాపం!

లెక్కలకు ‘కేశవు రావు’ సార్‌ వుండెటోడు గీన మట్టుకు నువ్వద్దిగనే లెక్కల్నంటే లెక్కజేసెటోడే గాదు. ఏ లెక్కన్న గూడ ఆయినకు లెక్కేలేదు. గని, సెడ కోపగొండోడు. లెక్కలు రాకుంటే ఒకగపోరన్ని, కోపం అణుసుకోలేక డస్టరు సెక్కను వట్టి పోరని నెత్తిమీద లగాయించి వుతికిండు. గదీంతోటి పోరని నెత్తి నెర్రవాసి నెత్తురు గార పట్టింది.. గదీనికి ఆ పోరని తండ్రి సవారి లేసి సారుమీద పడటానికి అస్తే, సారు బడికి రాక తప్పిచ్చుకున్నడు. ఏడ తంతరో అని! హెడ్మాస్టరు పోరని తండ్రిని సమాదాన పర్సి, శాంత పర్సిండు. కేశవురావు సారుని పోరని తండ్రి తన్నంగ జూస్తామన్న పోరగండ్ల కోరిక తీరకుంటనే పొయ్యింది!

‘శివరాం’ సారు ‘తెలుగు’ జెప్పెటోడు. ఆయిన బోళ్ళ సెంకరుడు. ఆయిన పాఠం జెప్పుటానికి అస్తున్నడు అంటే పోరగండ్లు ఎగవడి ఎగవడి దగ్గెరి దగ్గెరికచ్చి కూకునెటోళ్ళు. ఆయిన పాఠం జెప్పుతున్నడంటె పోరగండ్లు - కిట్టమూర్తి పిల్లనగోయి వూదినప్పుడు గద లేళ్ళు సెవులు నిక్కవెట్టి నట్టుగ, నిక్కవెట్టుకునెటోళ్ళు. ఆయిన పాఠాన్ని మాటలతోటి సెప్పుడన్నది సానతక్కో. అంతగూడ ‘యాక్షన్‌’ తోటే అర్థం జేపిస్తడు. ‘కొట్లాడుటానికి సిద్ధమైండు’ అన్నదాన్ని నోటితోటి సెప్పడు - మల్సివున్న ఆయిన పొడుగు సేతుల అంగినిన, యింకింత మీదికి జరుపుకుంట సూపిస్తడు. ‘కయ్యానికి కాలుదువ్విండు’ అనడు, కాలును దువ్వి సూపిస్తడు….

ఆనెంక, కాశినాథ్‌ సార్‌ జాగల ఏరే సారు వచ్చిండు. ఆయినకు తెలుగు రాదు-హింది తప్ప. సోడబుడ్డి అద్దాలు. బగ్గ కంజూసోడు. పెండ్లాన్ని ఎంటవెట్టుకోని వుంటే రెండు కమురలకు కిరాయి పెట్టవల్సి వస్తదని పెండ్లాన్ని వూర్లనే యిడ్సి వుంటడు. పోరగండ్లకు సెప్పు తంటడు - “గింతకన్న గూడ తక్కో కిరాయికి దొరికే ఒక కమురను ఎతికి పెట్టుండ్లి” అని. దుకాండ్లు మూసేసే ఏళ్ళకే కాయకూరలు కొనుటానికి పోతడు- ఏరంగ మిగిలినయి అగ్గోల దొరుకుతాయని!… సారుకు తెలుగు రాదు గావట్టి యిగ పోరగండ్లకు దసుర పండుగు వారం! తుర్తి దీర సారును మజాకు వుడాయించవచ్చు! ఒగపోరడు బాగ జోరుతోటి “నమస్తే సార్‌!” అనెటోడు ధర్మరాజు గద అశ్వత్థామ హతః అన్నట్టుగ అని, గా తరువాత “గుడ్డి లంజకొడుక!” అనెటోడు పోరడు సారుని మెల్లగ “కుంజర” అన్నట్టుగ! సారుకు పోరగండ్లు తనని మజాకు వుడాయించుతన్నరు అని అనుమానమొచ్చి తన తోటి సార్లను అడిగిండు మతివెట్టుకోని “గుడ్డి లంజ కొడుక- కహే తో క్యా హై!?” అని. సారు వున్న ముచ్చట దెల్సుకున్నంక యిగ - గట్ల అన్న పోరగండ్లనే గాదు, అన నోళ్ళని గూడ యిరగ జోపుడు వెట్టిండు, రోజు గూడా. వట్టి జోపుడే గాదు రోజూ గని పరీక్ష పరీక్షకు గూడా అందర్ని ఫేలు చెయ్యవట్టిండు. గది తప్పించుకునటానికి గోంత మంది పోరగాండ్లు గాసారు దగ్గెరికి ప్రైవేటు ట్యూషనుకు పోవట్టిండ్రు. గీళ్లకి దెబ్బలు వుండయి, పరీక్షలల్ల పాసుగూడ. ప్రైవేటు ట్యూషన్‌కు పోనోల్ల గతి మట్టుకు యిగ గంటే - రోజూ తన్నులు - అన్ని పరీక్షలల్ల ఫేలు!

గిప్పుడు మా బడికి ‘ధర్మయ్య’ సారు వచ్చిండు తబాదులా మీద. గప్పటిదాన్క అన్ని పల్లెటూరు బడులల్ల సేసి వుంటడు. ఏరే ఏరే క్లాసులకు ఏరే ఏరే సబ్బెక్టులు సెప్పుతడు. అంటె, అన్ని సబ్జెక్టులు గూడ అస్తయన్న మాట! కడుమ సార్లు అందరు గూడ ఏదో ఒక్క సబ్జెక్టే జెప్పెటోళ్ళు. గాలెక్కన ధర్మయ్య సారు అందరికన్న గూడ మొనగాడు అన్నట్టే గద! గని సూసుటానికి మట్టుకు పిసోనివారం వుంటడు. కట్టుబొట్టు జూసి ఘనత జెప్పగ రాదు, కానరావు లోని ఘనతలెల్ల!.. పనసపండు ఘనత పైనేమి గలదురా అని తత్త్వం జెప్పినోడు గీ ధర్మయ్య సారుని సూడకుంటనే సెప్పివుంటడు! ధర్మయ్య సారు ఏసుకునే పైంటు, బుస్కోటు గిట్ట మంచి బారీ బట్టలే గని, ఆయిన మట్టుకు అచ్చం పల్లెటూరోడే. కుట్టిచ్చిన ముక్కు సెవుల సిల్లులు. సిన్నప్పుడు ముక్కుకు, సెవులకు పోగులు పెట్టుకోనేవుంటడు. సేతుల మీద పొడిపిచ్చుకున్న పచ్చబొట్లు… ధర్మయ్య సారు గట్ల ప్రత్యక్షమయ్యేటప్పటికి పోరగండ్లు ఆయనను సీపురు పుల్లంత గూడ ఖాతరు జేసుడు లేదు. తుడుసుక పోకట. మస్తు లొల్లి పెట్టుడు పోరగండ్లు. ఆ సారు క్లాసు అంటే యిగ పోరగండ్లకు లొల్లి అన్నట్టే. పోరగండ్లు-ఒకవైపు వుర్రూతలూగు కథనాలు, ఒక ప్రక్క వురికించు యుద్ధభేరీలు అన్నట్టుగ! కత్తులను ఘంటములు కదను తొక్కిన విచట! గా లొల్లికి సారు “లొల్లి పెట్టకుండ్లోయ్‌! నిశ్శబ్ధంగ వుండుండ్లోయ్‌” అనుకుంటు పచ్చి బరిగెను క్లాసురూము తలుపుమీద జోపుకుంట సొప్పజేసుడు..

మా హెడ్మాస్టరు మొకం సూసుటానికి గూడ పెద్దపులి మొకమే. ఆయిన ఎప్పుడన్న ఒగ పారి గస్తి దిరుగుటానికన్నట్టుగ ఎనుక సేతులు వెట్టుకోని మెల్లెగ, అడుగుల అడుగేసుకుంట ఒక్కొక్క క్లాసు రూంను ఎడుమకు, కుడికి జూసుకుంట, దాటేసుకుంటపొయ్యెటోడు. గంతదనుక తెగలొల్లి జేసిన క్లాసు రూములు గిప్పుడు పిల్లిని జూసిన ఎలుకల వారమే. సడెన్‌ బ్రేకు ఏసినట్లు లొల్లి ఒక్క పారే అణిగి పొయ్యేటిది- పాల పొంగు మీద నీళ్ళు పడ్డట్టుగ…

ధర్మయ్య సారు క్లాసుల పోరగండ్లు ఏగిడ్సి లొల్లి - వెడ్తున్నట్టుగ హెడ్మాస్టరుకు తెల్సింది. హెడ్మాస్టరు ధర్మయ్య సారుకు గురుబోధ జేసిండు. “తాళకంబెరుగవో, తగరంబునెరుగవో? ఉప్పుచింత పండు వూరిలో నుండగ కరువదేలవచ్చె? బరిగె సేతులవుండంగ పోరగండ్లు లొల్లి ఎందుకు మానుత లేరు? పుట్టమీద గొట్ట భుజగంబు జచ్చునా? నువ్వు తలుపు సెక్కల్ని యిరుగ సరిస్తె పోరగండ్లకు పెయ్యిఎట్ల నొస్తది? పాము మంత్రం గిట్ట నేరిస్తివా? యిక్కడ ఎవన్నో సెంపమీద జరిస్తే అక్కడెక్కడ్నో పాము కుట్టినోని విషం దిగినట్టుగ! తలుపు సెక్కల్ని సరుస్తుంటే పోరగండ్ల పెయ్యిల మీద వాతలు దేలుతున్నయా! నువ్వు బయపడితె కుట్టకుంట వుంటె కుమ్మరి పురుగంటరు- వాళ్ళు నిన్ను బయపెడతరు. కుట్టు, తేలు వారం! నువ్వు బయపెడితె ఆళ్ళు బయపడుతరు. గంత దనుక తనకెవ్వడు కపటిలేడు ధరలో అని పోరగండ్లు దుందు జేస్తరు. జీవులందే గాని శాలల ఏమున్నది? పోరగండ్ల పెయ్యిల మీద వున్నది గని, తలుపు సెక్కలల్ల ఏమున్నది? నోటి మాటలతోటి ఏమైతది పోరగండ్లకు? వానతోడ వచ్చు వడగండ్లు నిల్చునా? లొల్లి వెట్టకుండ్లోయ్‌ అనంటె పోరగండ్లు నిల్చునా? లొల్లి వెట్టకుండ్లోయ్‌ అనంటె పోరగండ్లు నోట్లె ఏలు వెట్టుకోనే వుంటరా? న్యూటన్‌ సూత్రాలన్నీ నూరుకోని తాగినోనివి! ధనం బలిమిలేని వాడ జనం బలం జూపవోయి అన్నట్టుగ జోపు మస్తుగ రాళ్ల వానను….” అన్నడు హెడ్మాస్టరు. పల్లెటూరు అబ్బాయిని పదునుపెట్టి, వెన్నుతట్టి- ఏమి రోజులచ్చెరో, ఎనుకటోలె లేవురో!

గప్పటి సంది యిగ జూసుకో ధర్మయ్య సారు!

“లొల్లి పెట్టకుండ్లోయ్‌” అన్న నోరు “లొల్లి వెడుతార్రా? అనవట్టింది. స్కేలు అంచులు పోరగండ్ల మట్టలమీద జోరుతోటి ఆడవట్టినై. లొల్లి దెంక పొయ్యింది. సారు ప్రశ్నలకు పోరగండ్లు జవాబు జెప్పకుంటె స్కేలు కొస్సటి దిక్కు అంచు మట్టలమీద బలంగ…. పోరగండ్లకు పొడి పొడి ప్రాణాలు పోవట్టినై… బుద్ధిజెప్పువాడు గుద్దిన నేమయా అన్నడు తత్త్వం జెప్పినోడు. గని, పురాగ గూత బందు అయ్యెటట్టు గుద్దుమన్నడా? గిప్పటి ధర్మయ్యసారు-పూవు మాటున ముల్లు పొంచిన చందంబు గిట్ల జేస్తె సదువస్తదా? మంచినీరు పోయ మల్లె పూయును గాని. పేరు ధర్మరాజు పెను వేప విత్తయా… పోరగండ్లు తల్లడిల్ల వట్టిండ్రు… గప్పుడు దీపాలు నీవే వెలిగించినావు. గిప్పుడు, గాఢాంధకారాన ముంచేందుకా! తారతమ్య మెరుగనేరని పశువువ.. పోరగండ్ల మట్టలు బూరెల వారం వుబ్బుడు.. మట్టల మీద నిమ్మకాయ రసం పూసుకుంటె గింతంత దెబ్బకే గంతంత వుబ్బుతై అని ఎవరో జెప్పుతె పోరగండ్లు నిమ్మకాయ రసం పూసుకోని రావట్టిండ్రు. పోరగండ్ల గా ‘యికుమతి’ సంగతి ధర్మయ్యసారు సెవున పడ్డది. గందుకని పోరగండ్ల మట్టలు ఎంత వుబ్బినా గూడ సగ్గి పోతున్నై అని యింకింత మట్టల మీద జోపుడు… గుండుకు బదులుగ గుండెను నిలిపి… కొన వూపిరులకు వూపిరులూది… తనువులోని ఈ బాధను పెదవి దాటనివ్వరు. నిప్పులు మింగి.. గడియ గడియ గండమాయె… ఉడుకెవనిదో వణుకెవనిదో.. ధర్మయ్యసారు పీరియడు అనంగనే పోరగండ్లు - దాని నూనగల్లు దార్డ్యంబులేకున్న - దాన్ని, యిడ్సిపెట్టి పోకటే దిక్కు. యుపముతోనె యుక్తి యున్నది గనవలె.. కత్తిని విసిరే వానిని ఆ కత్తితోనె గెలువాలని… ఒకనాటి వుద్యాన వనము! నేడు కనము! అదియె మరుభూమిగా నీవు మార్చేవులే!.. సారు బగ్గ నొప్పిస్తాంటే, తాము నొవ్వకుంట - తప్పించుక తిరుగువాడే ధన్యుడు- గందుకని ధర్మయ్య సారు పీరియడు అస్తున్నదనంగనే గదీనికి ముందే బాగ మంది పోరగండ్లుగా క్లాసు యిడ్సిపెట్టి కంట్లె పడకుంట పొయ్యి, గా పీరియడు అయిపొయ్యినంకనే వచ్చుడు వెట్టిండ్రు. తేలుకొండి గొట తేలేమిజేయురా? ధర్మయ్య సారు పీరియడునే ఎగ్గొడితే యిగ ధర్మయ్యసారు ఏం జేస్తడు? సచ్చి మళ్ళీ పుట్టంగాని, బ్రతికి మనం సావద్దు. నీరము తప్త లోహమున నిలిచి యనామకమై నశించు.. ధర్మయ్య సారు గీ పీడ, గీ తరుగతి దనుకనే వచ్చే ఏడు పై తరగతికి పోతె గీన పీడ పాసిపోతది గని…

ధర్మయ్య సారు దెబ్బలని తప్పించుకునుటానికి పోరగండ్లు ఎవరికి దొరికిన తొవ్వని గాళ్ళు అందుకున్నరు. గోంతమంది పోరగండ్లు వుడుత భక్తి వారం నమస్తేల తోటి సగవెట్టుకుంటె కొంతమంది వుషారు మంతులు మట్టుకు - విభీషణుని వారం సారు శెరణుజొచ్చిండ్రు. సారు కింక పెండ్లిగాలేదు. ఒక్కడే. ఒక కముర కిరాయికి తీసుకోని వుంటండు. పోరగండ్లు సారు యింటికి పొయ్యి సారుకు యింట్ల పనులల్ల, వంటపనులల్ల ఆసరా గావట్టిండ్రు. సారుకు నూతిలకెళ్ళి నీళ్ళుసేది, తోడి పెట్టుడు… గిదీంతోటి ఆళ్ళకు రెండు విధాల మునాఫా. దెబ్బలూ తప్పినై, పరీక్షలల్ల ఫేలు గాకట తప్పింది!..

హెడ్మాస్టరు మేనకోడలు గూడ గిక్కడ టీచరే. పోరగండ్లు ఆడి టీచర్లను గూడ యిడ్సెటోళ్ళు గాదు. ఆడి టీచర్లు పోరగండ్లు జేసే సేష్టలకు కక్కలేక మింగలేక వుండెటోళ్ళు.

ఒగ క్లాసుల ధర్మయ్య సారు పిర్యడు అయినంక ఎంటనే హెడ్మాస్టరు మేనకోడలు పిర్యడు వుంటది. గప్పుడు ధర్మయ్యసారు, ఆయిన పిర్యడు అయిపొయ్యినంక గా బెల్లు మెగినంక గూడ క్లాసు రూముని యిడ్సి - పెట్టెటోడే గాదు! కావాల్సుకుని! ఆడి టీచరు వచ్చి క్లాసు రూము తులుపు పక్కకు బైటనే నిల్సుండి పొయ్యేది మూజియంల పాలరాతి బొమ్మ వారం - సిగ్నలు పడని రైలుబండి ఒంటి సింగలు కాడ నిలవడి పొయ్యినట్టుగ… ధర్మయ్యసారు మనుసుల - పెరిగింది ఏదో మరో లోకం! ఎవరేమి అన్ననేమి, ఎగతాళి జేయనేమి? గని, క్లాసు రూమునే పట్టుకోని ఎల్లాడ వడెటోడు-మన లీడర్లు పద్దవతులను యిడువకుంట ఏళ్ళాడ వడ్తున్నట్టుగ..

క్లాసురూము లోపట ఆయన వుండంగ తను పోవద్దుగద! గట్లనే నిల్సుండి పొయ్యేటిది. ఆమె బగ్గ అందంగ వుంటది. యింక పెండ్లిగాలేదు. మరుమల్లెల, విరజాజుల సువాసనలు… తడిసిన వనుల గాలి నీ దారి తెల్పు అన్నట్టుగ ధర్మయ్య సారు ఆమె రాకను వాసన పట్టెటోడు. జిలుగు మెరుగుల చీరెశిల్పం. నడక సొబగులు, ఒడల మెరుగులు. ధర్మయ్యసారు ఆమె పదనోకుర నిస్వణాల్ని విని, కర కంకణ నిక్వణాల్ని వినుకుంట గట్లనే టైం పాసు జేసెటోడు! మగువలు కొలువగ దరిజేరగ మతి మాయుట యతులకు న్యాయమా? విడు విడుమా యిక నను విడుమా- నేను క్లాసు తీసుకొనుటానికి వస్తే నువ్వు విడువకుంట పట్టుకుంటవా, విడ్సిపో అన్నట్టుగ ఆమె.. నిలు నిలుమా చెలి నిలునిలుమా అన్నట్టుగా ఆయన! రుస రుస లాడుచు విసిరిన వాల్జడ ప్రేమ పాశమని తలిచితిలే అనుకుంటడు. నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు అనుకుంటడు.. నీ జడలో గులాబినై వెలిశానా? అని ప్రశ్నించుకుంటడు! పడతి జూసినపుడె.. పై నాశ ఆమె, ఊర్వశి అందాలు జూపి వూరిస్తోంటే, వూరిస్తొంటే, ధర్మయ్యసారు గుటుకలు మింగుతాంటడు. బిందె తోటి నీళ్ళకెడితె సందు దాటి సైగ జేస్తడు! కన్పిచ్చిన కాడికి ఆమె కచముల, కుచముల, కటి జఘనమ్ముల సూడాల్ననుకుంటడు..

మా హెడ్మాస్టరు అంటే అసుంటి, యిసుంటోడు గాదు. గాయిన యింగ్లీషుని, గ్యానాన్ని జూసి ‘డీ ఈ వో’ కే పైంటు పచ్చిగైతది! అందరు - పిసోడు, పిసోడు పల్లెటూరోడు అనుకోంగ గంత గడుసుదేలుడే గాకుంట, గిప్పుడు గంతటి హెడ్మాష్టరు మేనగోడలు మీదికే ‘పోజులు’ యిసుర వట్టె ధర్మయ్య సారు!

ధర్మయ్య సారు గప్పుడు ఏకు వారం అచ్చినోడల్ల, గిప్పుడు మేకు వారం దిగవట్టె. మన దేశానికచ్చిన అంగ్రేజోని వారం - ఎలక్షన్ల గెల్సినంక మన లీడర్ల వారం!

పొద్దుమూకినంక
-భూపాల్‌

మెడికల్‌ కాలేజీ ముందలి సందుల బస్సు దిగింది పుష్పలత. ఆడికెళ్లి నడుచుకుంట కోఠి ఆంధ్ర బేంకు కాడికొచ్చి ఎవర్నో టైం అడిగితే ఆరున్నర అన్నరు. ఉప్పల్‌ నుంచి కోఠి కాడికొస్తందుకు రెండున్నర గంటలైంది. ఆమె భర్త ఆరున్నర ఏడునడుమ ఈడనే కలుస్తనన్నడు. ఒక గంట మొదాలొచ్చి గాజులు, టిక్లీ బొట్లు, చిన్న స్టీలు టిఫిన్‌ బాక్సు కొందామనుకుంది. బస్సు లేటుగొచ్చుడు తోటి ఇగ అవి గొనే టైం లేదనుకుంది. భర్త ఇప్పుడో ఇంకో నిమిషానికో రావొచ్చు. హిమాయత్‌ నగర్‌ నుంచి రెండు గొట్టేవరకే ఉప్పల్‌ కొచ్చింది పుష్పలత. ఆడ తన భర్త మేనమామ దగ్గర ఆయిన చెప్పినట్లు వెయ్యిన్నర రూపాయలు తీసుకుంది. పుష్పలత చిన్నాయిన బిడ్డె తన చెల్లెలు పెండ్లుంది. చెల్లెకు చీర, జాకెట్‌ కొని పెండ్లి పిల్లను చేద్దామని భర్తతో పదిసార్లంటే నిన్న ‘సరే’ అన్నడు. సరే అనుకుంటనే “నా తాన పైసలు లేవు. ఉప్పల్‌ మామ నడిగిన రేపు రమ్మన్నడు. నువ్వు ఉప్పల్‌ పొయ్యి, పైసలు దీస్కొని కోఠి కాడికి పొయ్యి వుండు. నేను నా పని జూసుకొని సక్కగ ఆడికే ఒస్త. బట్టలు కొందాం. బుజ్జిని పక్కింటి ఆంటి దగ్గరుంచిరా!” అన్నడు.

అదేమాట పొద్దున కొలువు కాడికి పోతున్నప్పుడు గూడ చెప్పిండు. “అట్లనే ఆరున్నరకు బేంకు కాడ నిలవడ్త” అన్నది పుష్పలత.

ఆ బస్సు పాడుగాను గీడికొస్తందుకే ఉప్పలకెళ్ళి రెండు మూడు గంటలా! “అనుకొని మళ్ల బస్సుదేముందీ రోడ్లు సక్కగుండవాయె అదీగాక ఉశికె జల్లినట్టు జనమైరి. ఈ జనమంత ఏడికెళ్లొస్తున్నరో? ఎక్కడ పోతున్నరో? పుట్లకు పుట్లు ఏడ జూసినా జనాలే. పట్నం నిండా జనాలే.” అనుకుంది.

పుష్పలత పొత్తి కడుపు నొప్పిగుంది. ఉప్పల్‌ నుంచి బైలెల్లెటప్పుడు బాత్‌రూంకు పోలేదు. ఇంట్ల ఎవరో కొత్త కొత్త మొగోళ్లున్నరని సిగ్గయ్యింది. బస్సు దబ్బునొస్తే భర్తతోటి కలిసిపొయ్యి బస్‌పాస్‌లిచ్చే బస్‌స్టాండుల బాత్‌రూం పోదామనుకుంది. ఇప్పుడేమో యీనా ఇంకా రాడాయె. పుష్పలతకు ఏం తోస్తలేదు. మళ్లీ ఐదు నిమిషాలు దాటినయి.

‘ఒస్తే నిలవడ్తడు. నేను మొదలు పొయ్యి బాత్‌రూం జేసొస్త..’ అనుకొని బస్‌స్టాండుకు గాకుండ కామత్‌ హోటళ్లకు మెట్టెక్కి పొయ్యింది. మొదాలు లోపట మావోళ్లు ఉన్నరా అన్నట్టు తొంగిచూసింది. ఉట్టిగనే.. టిఫిన్లు జేసెతాన అటెనుక అటూ ఇటూ నిలబడి మూడో నిమిషం బాత్‌రూంలకు జారింది. మల్ల బైటికొచ్చి ఎవరన్నా తనను జూస్తున్నరా అని అటిటు చూసి మెల్లగ మెట్లు దిగి కిందికొచ్చింది. ఒచ్చి మొదటిలెక్కనే ఆంధ్రబ్యాంకు దగ్గర పెద్ద దర్వాజ ముంగట నిలబడి ఎదురుసూడ వట్టింది.

ఇంతల మూడేండ్ల తన కూతురు గుర్తుకొచ్చి డబ్బా టెలిఫోన్‌ ఏడుందోనని అక్కడిక్కడ చూసింది. పొద్దున్నే స్కూలుకు పొయ్యేటప్పుడు పగటికి ఒచ్చినంక ఆంటి దగ్గర్నే వుండుమని చెప్పింది. ఆంటికి కూడా తను కోఠీకి పోతున్న సంగతీ, పెండ్లి పిల్లను చేస్తందుకు చీరె కొనుక్కొస్తున్న ముచ్చటా చెప్పింది. ఆంటీ అంటే ఆమెకు ఆమెంటె ఆంటీకి మంచి సోపతుంది. తాను తిరిగొచ్చే వరకు పాపను బాగానే సూసుకుంటదని తెలుసు. ఐనా ఒకసారి ఫోన్‌ జేస్తే ఆంటీ సంతోష పడ్తదనుకుంది. ఈయన రానీ వొచ్చినంక చేద్దాం.. ఐన టైమయ్యిందిగా..

భర్త హయత్‌నగర్‌ అవతల తారామతి పేటలున్న కోళ్ల ఫారంల పనిజేస్తడు. యాడాది కింద జీతం కుదిరిండు. ఆ తార్మాతి పేటల బస్‌ ఎక్కితే అది సక్కగొచ్చె కోఠీ దవాఖాన దగ్గర దించేస్తది. ఆడికెళ్లి ఆంధ్రబేంకు కాడికి ఏమంత దూరముంది. నిజంగా చెప్పాల్నంటే ఈ…. అన్ని పనులు తెల్వితోటి చేసి ఉంటే హీరో హోండ తీస్కోవలసి నోడే… అని, కొన్న రొండు టెల్లర్లు సా తియ్యలేదు. సెకెండుహాండువి ఎవరో మోసం జేసి ఇప్పిచ్చిండ్రు. అవి సక్కగ నడవలే.. ఎప్పుడూ పాడయ్యేవి. ‘అవ్వ ఒడికిన నూలు తాత మొల్దారానికే సరి’ అన్నట్టు… అవిటి మరమత్తులకే అవి తెచ్చిన కిరాయి సరిపొయ్యేది. ఇగ ఇసిగిపొయ్యి అవిటిను అడ్డికి పావుశేరు అమ్మేశిండు. ఒచ్చిన లక్షరూపాయలు దీస్కొని ముంబాయి పొయ్యి బట్టలు కొనుక్కొచ్చి ఇంట్లనే అమ్మి వ్యాపారం జేస్తననీ అవీ మునిగి సల్లవడ్డడు.

మొదాలొచ్చినవి ఎన్ని రూపాయలు. అవి తక్వ పైసలా! ఏంకతా!! తన పెండ్లైనంకనే గదా భూమి అమ్మింది. అత్తగారు శంషాబాద్‌. ఆడ ఐదెకరాల భూమి ఉన్నదంత అమ్మితే పదిలక్షలొచ్చినయి. చెల్లె పెండ్లిజేసి ఇంత, అయ్యరోగానికి ఇంత ఖర్చు జేస్తే చెల్లె మంచిగనే ఎళ్లిపోయిందిగాని, తండ్రికి మందులు పడలేదు కాలంజేశిండు. భూమి అద్దాల పోలీసు సారు గుంటూరాయనకు అమ్మినంక ఒక్క యాడాదిలనే ధర ఎక్కడలేనంత పెర్గిపోయింది. ఆ ఐదెకరాలను ఆనుకొని అప్పుడే ఇంకో నలభై ఎకరాలు కొన్నడు ఆ సారు. ఆ భూమిల పనికోసం పదిమందిని పిలిస్తే దాంట్లకే పొయ్యిండు భర్త. గుంటూరు సారు భూమంతటికి ఫెన్సింగు ఏపిచ్చి టాక్టర్లు తెప్పిచ్చి దున్నిపిచ్చె. ఇంకా తోటలకోసం ఇంకేదో చిన్న ఫ్యాక్టరీ పెడ్తనని షెడ్డులు ఏపిచ్చె. భూమి అమ్మినంక యాడాదిలనే అరవై లక్షలకు ఎకరమైన తీరు జూసి అమ్మిన రైతులందరూ లబ్బలబ్బ మొత్తుకున్నరు. చేతులు గాలినంక ఆకులు పట్టుకుంటె ఏమొస్తది? ఐనా ఇద్దరు ముగ్గురు భూమి అమ్మినోళ్లు పొయ్యి సారూ మాకేమన్న పైసలియ్యరాదుండ్రి. అమ్మి మేం ఆగమైనం’ అందామనుకున్నదరు.. గని, అడగలేదు. పులి దగ్గరికి మేకపిల్ల పోతాది. ఐనా ఆ భూమిల్నే …….. కూలిపని జేస్కుంటుంది పుష్పలత. ధైర్నమే జేసింది. ఒకనాడు పొద్దూకంగ ఆ గుంటూరు సారు కారొచ్చింది జూసి ఆయన కూసునే ఆఫీసులకు పొయ్యి.. “సారూ! ఏదో బాధల భూమి అమ్ముకున్నం గని అది అమ్మవలసింది గాదు. ఇప్పుడు ఇచారించి ఫాయిదలేదుగనీ, ఇంతగనం ధర పెరిగిందిగదా! రైతులు మస్తు బాధ పడ్తుండ్రు. ఆళ్లు కుదార్తెం గుండాలని ఇన్ని పైసలియ్యజూపుండ్రి!” అన్నది.

గుంటూరు పోలీసు సారు నల్ల అద్దాలు దీసిండు. పుష్పలత దిక్కు సూసుకుంటనే జేబులకెళ్లి దస్తి దీస్కొని అద్దాలు తుడ్సిండు. చిరునవ్వు చిందజేసి పక్క కున్న మేనేజరు దిక్కు జూసిండు.

పుష్పలతమ్మా! ఎట్ల తోసిందమ్మా నీగీ ఇగురమూ? ఎవరన్న జెప్పిండ్రా? మీ మొగడు పంపిండా? పిడికెడు పిడికెడు మీసాలున్న మొగోళ్లు గూడ సారు దగ్గరికొచ్చి అడజాల్లెడు. నువ్వు మంచి ధైర్యమే జేసినవ్‌. ఐతే ఒకపని జెయ్యి నీయమ్మ కడుపులకు మల్లపొయ్యి, ఇంకో బాగ పైసలున్న తల్లికి పుట్టు పో..”

నువ్వేం మాట్లాడుతున్నవయ్యా, దున్యలలేని మాట చెప్పపడ్తవి. అంత ఎచ్చిడెందుకూ? రైతులం అడుగుతం. ఎట్ల వోతరు అమ్మ కడుపులకూ? నన్ను గన్నది ఎప్పుడో కండ్లు మూసింది. నీకమ్ముందిగా జెర్రపొయ్యి సూపరాదు. సిగ్గులేదు ఏది పడ్తె అది అనెటందుకు. ఐనా నడుమ నువ్వెవరు? నీతోటిగాదు నేను సారుతోటి మాట్లాడ్తందుకొచ్చిన” అన్నది.

సారు చిరునువ్వులే ఒల్కపోస్కుంట పుష్పతను కొంటెగ జూస్కుంట.. కన్ను గొట్టిండు. పుష్పలత ఇంకో సెకెండు ఆడ నిలవడలేదు. బైటికొచ్చి ఎడమకాలు చెప్పుతీసి గుంటూరు సారుమీదికి ఇసిరింది. నోటికొచ్చింది తిట్టుకుంట ఆ సారు భూమంత దాటి బైటపడ్డది. అటెంకాళ్ల ఇక మళ్ళీ పోలేదు. ఆమె భర్త గూడ పని ఇడ్సిపెట్టిండు. తన చేతులున్న మూడు లక్షలు పట్టుకోని హయత్‌నగర్‌ ఒచ్చిండు. అటెన్క టిల్లర్లు కొన్నడు. మునిగిపోయిండు.

పుష్పలత తల్లిగారూరు చేవెళ్ల. పదో తరగతి ఎప్పుడో పాసైంది. సదువిడిసి పెట్టి కలువకొమ్య పొయ్యేది. ఇంకా సదువాలె అనుకున్నా చదివిచ్చే తాహతు తండ్రికి లేక మానుకుంది. ఐనా పుస్తకాలంటే పడిసస్తది. ఏ పుస్తకం దొరికినా చదివేసే అలవాటు. అందుట్ల జెర్రన్ని మంచి పుస్తకాలూ చదివే వుంటది. అందుకేనేమో ఏ ముచ్చటకాముచ్చట ఇట్టె చెప్పుడు అలువాటైంది. లోకం తీరు తెలుసుకుంటందుకు గా సదువు పనికొచ్చింది గావొచ్చు.

బ్యాంకు ముంగట దిక్కులు చూస్త నిలవడ్డ పుష్పలతకు ఏడున్నర కాఒస్తున్నా పెనిమిటి రాలేదు. ఏమైందో? బస్సులున్నయోలేవో.. అనుకుంటుండంగనే పెద్ద సప్పుడైంది. ఏందో పేలినట్టు.. ఇంతలనే ఏడ్పులు.. మొత్తుకోళ్లు… అంతా గడ్‌బడ్‌… తను నిలవడతానికెళ్లి ఎడమ దిక్కు చూస్తే ఒకటే లొల్లి. అందరూ అటు దిక్కు ఉర్కుతుండ్రు. హోటల్ల గానీ సిలిండర్‌ పేలిపోయిందని అనుకుంట ఎవరో పోతున్నరు. తన భర్త వొచ్చే తొవ్వ అదే అక్కడనైతే లేడు గదా! నేనేం జేతునబ్బా?? అనుకుంట పుష్పలత ఆ హోటల్‌ దిక్కు పోవట్టింది. కాలుగాలిన పిల్లిలా తొక్కులాట. గుండెల్ల బుగులు బుగులు గుంది.

“గోకుల్‌ ఛాట్‌కే పాస్‌ బాంబ్‌ పేలీ… బోత్‌ ఆద్మీ మర్‌గయే” ఎవరో ఒర్లుతుండ్రు.. ఏడ్పులు.. హాహా కారాలు.. అయ్యే గోస. జెర్రంత దూరం బోయిన పుష్పలతకు దూరంగ తెగిపడ్డ కాళ్లు చేతులు జనం నడిమికెళ్లి కనపడ్తున్నయి.. అది జూసి అట్లే బీరిపోయింది. నోట మాటొస్తలేదు. “అయ్యో ఇదేం ఘోరం…” అనుకుంట “నువ్వేడున్నవయ్యా” అంటుంది గాని మాటొస్తలేదు. పదినిమిసాలు దాటినయి. పావుగంటైంది. అంతా లొల్లి లొల్లి. పుష్పలత నిలవడ్డతాన్నే రాయిలెక్క నిలవడి ఏడుస్తుంది. ఆయిన రాలేదు. పోలీసొచ్చింది.అందర్నీ తరుముతున్నరు. బస్సులు, కార్లు, ఆటోలు, స్కూటర్లు ఏవీ అటు దిక్కు పోతలేవు, ఏవీ ఒస్తలేవు. “ఓ అమ్మా… ఎళ్లిపో ఈడ నిలవడకు” అని పోలీసొకాయన బెదిరిచ్చిండు.

ఎటు పోవాలె?! ఏం జెయ్యాలె? భర్త రాలేదు. ఒచ్చే జాడకనపడ్తలేదు. ఎటు పొవాల్నో తెలుస్తలేదు. కోఠీ ఉమెన్స్‌ కాలేజి గోడపొంటి గోడపొంటి హరిద్వార్‌ హోటల్‌ దిక్కు రావట్టింది. గోకుల్‌ ఛాట్‌ దగ్గరంతా పీన్గలు అక్కడిక్కడ వున్నయి. అక్కడొక్కరు ఇక్కడొకరు ఏడుస్తూ మూల్గుతు కనపడ్డరు. ఈన గిట్ట అందుట్ల లేడుగదా. అదే యాల్లకు అట్లకెళ్లే ఒచ్చైనా ఏమి? అంబులెన్సు ఒచ్చింది. దెబ్బలు తాకినోళ్లను, సచ్చినోళ్లను దాంట్లేసుకొని పొయ్యింది కొంతమందిని. దాంట్లె గిట్ల ఉన్నడా ఏంది?! నేనేం జేతు? ఎవర్నడుగుదు? ఆడికి పొయ్యి తొంగి సూద్దామన్నా పోలీసులు, జనం తొక్కులాట.. ఐనా అందర్నీ నూకేసుకుంట గోకుల్‌ఛాట్‌ దగ్గరి దాన్క పొయ్యింది. ఆడ ఉన్నోళ్లల్ల తన భర్త జాడలేదు. ఊపిరి పీల్చుకుంది. ఐనా భయం. ఏడ్సుకుంట ‘ఈన’ ఏడికి పోయినట్టూ’ అనుకుంట చాదర్‌ఘాట్‌ బిడ్జీ దిక్కు నడిసింది. దాన్ని దాటి మలక్‌పేట్‌కొచ్చింది. తొవ్వ పొంటంతా రకరకాల మాటలు. ఐ.ఎస్‌.ఐ. టెర్రరిస్టుల పనే ఇది. మొన్న మక్కామశీదు ఇయ్యాల గోకుల్‌ఛాట్‌.. ఇప్పుడే తెలిసింది లుంబినీ పార్కుల గూడ బాంబు పేలిందంట ఎంతోమంది జచ్చిండ్రట. ఒకరు ముప్ఫైమందంటే ఇంకొకరు యాభైమంది అంటున్నరు. నూరుమందికి దెబ్బలు తాకిన యంటన్నరు.

“ఆ టెర్రరిస్టులకు దీంతోటి ఏమొస్తది? దేనికాశపడి ఇవ్వి జేస్తున్నరు? మనుషుల్ని సంపితే ఏమన్నా ఫాయిదుందా? ఇది మనుషులు చేసే పనిగాదు. పోలీసోళ్లు ఏం పీకుతుండ్రు? గవర్నమెంటేం జేస్తుంది? ఇట్ల ఇంకెన్ని జర్గుతయో! ఇంట్లకెళ్లి వెళ్లితే మల్ల ఇంటికి ఒయ్యే భరోసలేదు. ఏం కాలమొచ్చింది నాయనా” ఎక్కడ ఇన్నా ఇవేమాటలు.

‘ఇది భయంకరమైన భరించరాని అరాచక వాదం, ఈ అరాచక వాదాన్ని కూడా పరోక్షంగా ప్రభుత్వాలే పెంచి పోషిస్తయి. ఇది పిచ్చికుక్కల వ్యవహారం. దానికి మూలం ఇప్పుడున్న దేశ పరిస్థితి. మనుషుల నడుమ తారతమ్యం.. మూఢనమ్మకం, మతం, మూర్ఖత్వం సాగుజెయ్యని భూమిలో పిచ్చి మొక్కలు మొలిసినట్టు, కలుపుతీయని మడిలో పనికి రాని మొక్కలు బలిసిపోయినట్టు ఉన్న రోజులివి. ఇట్ల జరుగొద్దంటే ప్రభుత్వాలు మంచివై వుండాలె. కోటీశ్వరులు వాళ్ల స్వార్థం కోసం జనాలను బలిజేస్తరు. ఇక్కడ చచ్చింది అంతా మామూలు ప్రజలే. ఇది ఒక్క మనిషి చేసిన పనిగాదు. దీని వెన్క శానా పెద్ద బలగముంటది. అది బైటికి రాదు. నాల్గు రోజులే ఈగడబడంతా.. ఎన్కశిరి అంతా మర్సిపోతరు. మల్లా మామూలైతది” పుష్పలత తనకు తోచింది అనుకుంటుంది. తనల తనే మల్ల మల్ల మననం జేసుకుంట.. భర్తకోసం కండ్లతోటి లెంకుటాడుకుంట… రాత్రి పదిగంటలైనంక హయత్‌నగర్‌ ఇల్లు చేరింది. ఐనా భర్త ఇంటికి రాలేదు. ఆమె భయం రొండింతలైంది. ఏమైయ్యుంటడు? ఇప్పుడేం జేద్దు? అనుకుంట పెద్దగ ఏడుస్తు కూలపడ్డది. సుట్టు పక్కలోల్లంత గుమ్మిగూడిండ్రు.

కేసు
-వేణు సంకోజు

అందరూ అవాక్కయి వున్నారు.

అందరి ముఖాల్లోనూ ఒక పెద్ద విషాదఛ్చాయ.

‘మళ్ళీ ఏమై ఉంటుందా’ - అనుకుంటూ! వినకూడనిదేదో వినవలసి వస్తుందనుకుంటూ భయపడసాగింది సీతమ్మ.

ఫోను రిసీవరు పెట్టేసి మౌనంగా కూర్చున్నాడు పఠాభి.

సుధ కూడ ఏదో శంకిస్తూ, ఫోను ‘తన అత్తగారింటి వద్దనుండే కావచ్చుననుకుంటూనే అడిగింది - “ఎక్కడినుండి నాన్నా ఫోను?” ‘తనే చేశాడా?’ అని కూడ అడిగింది.

మౌనంగానే ఔనన్నట్టుగా తలూపాడు పఠాభి. అతని మౌనంతో సముద్రాలంతటి ఘోష. తుఫాన్లంతటి అలజడి, ప్రపంచయుద్ధాల్లోని అణుబాంబులంతటి విధ్వంసం. ఎన్నెన్నో వున్నాయి. అవ్యక్తమైన కసి. తనమీద తనకే అసహ్యం. ఏమీ చేయలేని తన అశక్తత మీద తనకే తెలియని ఉక్రోషం కలుగుతున్నాయి. తను ఒక ఆడకూతురును కన్నందుకే కదా తనకీ రంపపు కోత! ఫోనొస్తే భయం, ఉత్తరమొస్తేదడ, ఆ వూరి నుండి ఏవ్యక్తి వచ్చినా వణుకు. ఎన్నాళ్ళు-ఎన్నాళ్ళీ విధంగా? ఎన్నిసార్లు ప్రాధేయపడాలి? ఎంతమందిని బ్రతిమాలాలి? ఒకమారు వియ్యంపురాలిని, ఇంకొకమారు వియ్యంకుడిని, అనేకమార్లు అల్లుడుగారిని. ‘అల్లుడుగారిని’ ఆనుకోవాల్సి వచ్చినప్పుడు “గారిని” అనుకోబుద్ధికాలేదు పఠాభికి. ఎంత లోకువై పోయాడతడు! ఒక బిడ్డను కని గర్వంగా పెంచినందుకు - సంతోషంగా సాకినందుకు - డిగ్రీదాకా చదివించినందుకు, కంప్యూటర్‌ జ్ఞానం కూడ కలిగించినందుకు, అన్ని విధాలా- అవతలి వారు అడిగిన ప్రకారమే - ఉన్నంతలో అన్ని లాంఛనాలతో వైభవంగా పెళ్ళిచేసినందుకో- ఒక అయ్య - చఛ అయ్యకాదు రాక్షసుడు - పెనుభూతం - మానవమృగం చేతిలో పెట్టినందుకు - అందుకే కదా తాను అంతగా లోకువైంది. అంతగా మెత్తబడింది! తలచుకుని తలచుకుని, తనూ, తన భార్యా, వగచి-వగచి, బిడ్డముందు కన్నీళ్ళు కార్చలేకా, కళ్ళనీళ్ళు కళ్ళల్లోనే ఇంకించుకోలేకా-ఎంతటి నరకయాతన అనుభవించారు! ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇలా? ఆలోచనలో పడిపోయాడు పఠాభి!

“ఏమైందండీ - ఏమిటిలా డీలా పడిపోయారు? ఎప్పుడూ వుండేదేకదా! కొత్తేముంది ఇందులో? అంతకుముందు ఉత్తరం రూపంలో ఒక నరక కూపం మన ఎదుట నిలిచింది. అంతకన్న పూర్వం ఒక మనిషే వచ్చి మన గుండెల్లో గునపం లాంటి వార్తను గుచ్చి మరీపోయాడు. అంతకంటే ఇదేమీ పెద్దది కొత్తది అయివుండదు కదా!…”

“లేదు సీతా ఇది పాతది కాదు. నిన్నూ-నన్నూ - మనకుటుంబమంతటినీ కుంగదీసే మాట, తలెత్తుకుని తిరగనీయబోని అభాండం, ఎవరితోనూ పంచుకోలేని, కనీసం చెప్పుకోలేని లజ్జాకరమైన విషయం.” పిడికిళ్ళు బిగించలేకా, వూరుకోనూ లేకా, ముఖాన్ని రెండుచేతుల్లోకి తీసుకుని, పిసుక్కుని-పిసుక్కుని, ఏడ్వలేకా, అణచుకోలేకా, చివరకు ఒక్క పెట్టున బోరున రోదించసాగాడు పఠాభి.

మళ్ళీ నిశ్శబ్ధం. సీతమ్మా, సుధా - ‘విషయం ఏమై వుంటుందా’ అని, పఠాభి ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ వుండిపోయారు.

లేచి బయటకు నడిచాడు పఠాభి.

‘ఎక్కడికండి?” - భయం అధికమౌతుండగా అడిగింది సీతమ్మ.

“చావటానికైనా లేదు కదా!- తండ్రిని గనుక ఆపని చేయలేను” అన్నాడు పఠాభి. అందులో కసి వుందా అంటే వుండవచ్చు. బాధ, అసహ్యం, అసహనం, వుండవచ్చు. ఇవేవీ లేకపోవచ్చు కూడా. నిర్లిప్తత కాని ఉద్రేకం, ఉద్రేకమని స్పష్టంగా తోచని ఒక తెగింపు. మళ్ళీ కూతురు ముఖం చూసే ధైర్యం లేని ఒక అసహాయత అవమానం తాలూకు ఒక విధమైన జాలి… అన్నీ వుండవచ్చు.

సుధ ఇంట్లోనే వుండి పోయింది తన గదికి తాను పరిమితమౌతూ అపరిమితంగా కుమిలిపోతూ ఏకకాలంలో, తన అత్తవారింటిని ఎవరైనా తగులబెడితే బాగుండునని, తన తండ్రిని ఏ గంధర్వుడో వచ్చి కాపాడితే బాగుండుననీ అనిపించిందామెకు. ఉన్నపళంగా మృత్యుదేవత వచ్చి తన నుదుటిని ముద్దాడి మెత్తగా లాలించి తనని స్వర్గానికి కాకపోయినా నరకానికైనా సరే, కొనిపోతే బాగుండుననిపించింది. ఇక్కడి నరకం కన్న పరలోకం అనబడే నరకం అంత నరకంగా ఏమీ వుండకపోవచ్చునని కూడ ఆ క్షణంలో ఆమెకు అనిపించింది. అప్పుడే నిద్రలోంచి లేచి, గుక్కపట్టి ఏడుస్తున్న తన రెండవ పాప హర్ష-తిరిగి తననీ లోకంలోకి పడద్రోసినట్లుగా ఆమె తేరుకుంది- తేరుకోవడమేమిటి? తిరిగి దుఃఖంలోకి, యమయాతనల్లోకి కూరుకుపోయింది!

తమ గదిలో గుస-గుసగా మాట్లాడుకున్నారు సీతమ్మా- పఠాభి కొన్ని నిమిషాలు. ఏమి చేయాలో తోచడం లేదు వారికి. ఒక పెద్ద గండంగానూ, తమ పరిస్థితి ప్రస్తుతానికి ఒక అగ్నిగుండమే అన్నట్టుగానూ వుంది - వారికి.

“పోలీసులకు చెప్తే యింకేమైనా వుందా!” విచారిస్తాం మీ అమ్మాయిని స్టేషనుకి పంపించండంటూ ఇంటికి వస్తారు. వీధికి వున్న కళ్ళు చాలక ఒక్కొక్కరికీ వెయ్యేసి కొత్త కళ్ళ చొప్పున ఊరంతా కళ్ళ పర్యంతమై చూపుల గాయాలు చేసి రక్కి చంపుతుంది. లక్షల నోళ్ళుగా తెరచుకొని, గూబలు పగిలిపోతుంటే దిక్కులు పిక్కటిల్లేట్టుగా కాకపోయినా, అనునయిస్తూనే అన్నట్టుగా, సానుభూతిని కూడ ప్రకటిస్తూ వున్నట్టుగా - ప్రశ్నల వర్షం కురిపించి, పిడుగు పాటుకు గురిచేసినంత పనిచేసి విడుస్తుంది. ఎన్నికళ్ళకు - ఎన్నెన్ని నోళ్ళకు, ఎంతటెంతటి ఎకసెక్కలకు జవాబివ్వాలి! ఎందుకు తనూ, తన భార్యా, తన కూతురూ - చేయని నేరానికి దోషుల్లా నిలబడాలి? ఎంతకని ఓపిక వహించాలి? ఎందుకని మంద్రస్వరంతో బలహీనంగా మాట్లాడాలి? ఎవరేమన్నా, దెప్పి పొడిచినా, అంతా తమ తప్పేనంటూ, తమ కూతురే దోషురాలన్నట్టుగా ప్రవర్తిస్తూ - సర్వం తెలిసినట్టుగా, ప్రత్యక్ష సాక్షులైనట్టుగా మాట్లాడే వారి ముందు, కలగ జేసుకుని మరీ వ్యవహారాన్ని మరింత వ్యయం చేయజూస్తున్న వారి ముందు తలదించుకొనవలసి రావాలెందుకు? అనుకోసాగారు పఠాభి దంపతులు.

“పోలీసులకు కంప్లెయింట్‌ చేశానన్నాడా- చేయబోతున్నానన్నాడా?” కన్‌ఫర్మ్‌ చేసుకోవడం కోసం అడిగింది సీతమ్మ.

‘చేశానన్నట్టే చెప్పాడు’-పఠాభి జవాబు.

“ఇట్లా ఎన్నిసార్లు బెదిరించలేదూ?”-సీతమ్మ ప్రశ్న.

“ఈసారి నిజంగానే చేశానని, పోలీసుల రాకకోసం ఎదురుచూస్తూ వుండండంటూ ఫోను పెట్టేశాడు” అన్నాడు పఠాభి.

భయం, అసహ్యం, అసహాయత, ఆక్రోశం అన్నింటికీ గుర్తుగా రెండు మూడు కన్నీటి బిందువులు రాలిపడ్డాయి సీతమ్మ కళ్ళనుండి. కుప్పగూలినంత పనైందామెకు. ‘పరమేశ్వరా’ అనే పదం కూడా ఆమె నోటి వెంట రాలింది.

“నాన్నా - ఆయనేదో ఉపద్రవం కొత్తగా తెచ్చిపెట్టవచ్చు. కానీయండి. కానున్నది కాకమానదు. నేనింకా మునుపటి లాగా భయాన్ని భరిస్తూ, అతడిని సహిస్తూ, ఒంటిమీద ఎప్పటికప్పుడొక సరికొత్త నరకాన్ని అంటించుకుని తిరగలేను. నేనిప్పుడు దేనికైనా సిద్ధపడివచ్చాను. మీరు కూడా అలాగే సిద్ధంకండి” ఆవేశంగా అన్నది సుధ!

“ఎట్లా సిద్ధం కాగలమమ్మా? ఏమని చెప్పాలి నీకు?” మనిషి ముక్కలై పోతున్నట్టుగా, గాలితో మాట్లాడుతున్నట్టుగా అన్నాడు పఠాభి.

“విడాకులు అనే కదా నాన్నా అని వుంటాడు- నేను కోరుకున్నది అదే కదా! ఇప్పటిదాకా అది నెరవేరలేదు. ఇప్పుడు వాళ్ళే కోరుతున్నారు. నేనందుకు సిద్ధమే”- తెగేసి చెప్పింది సుధ.

“విడాకులు తనుకాదు మనమే కోరుతున్నామనీ, తాము కలసివుందా మన్నందుకే నీవు హత్యాప్రయత్నం చేశావని, అతడు తప్పించుకోగా, పారిపోయివచ్చావని కంప్లెయింటిచ్చాడటమ్మా పోలీసులకు”- గాద్గదికంగా అన్నాడు పఠాభి.

“అబద్ధం ఆ పనిచేసింది అతడు”. చావును తప్పించుకొని వచ్చింది నేను. ఈ విషయం పక్కవారిని అడిగితే అక్కడికక్కడే తేలిపోతుంది” డిఫెన్సులో పడినట్టుగా చెప్పింది సుధ.

“తేలిపోతుంది! ఎంత బాగా నమ్ముతున్నావమ్మా! మనమూ మనమూ విచారించబోతే ఎవరైనా ముందుకొచ్చి విషయం మాట్లాడవచ్చు. చొరవ చేసుకుని అతడిని మందలించనూ వచ్చు. పోలీసులదాకా వెళ్ళిందంటే ఎవరు ముందు కొస్తారమ్మా - నీ అమాయకత్వం గాని! చూసినా, విన్నా- ఏమీ చూడనట్టు, ఏదీ విననట్టు వుండిపోవడం కన్న వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? మనకోసం స్టేషను మెట్లెక్కుతారా? సాక్షి సంతకాలు చేస్తారా? బెదిరింపులకో - ప్రలోభాలకో ప్రయత్నించకుండా వుంటారా మోసం, దగా చేయబూనినవాళ్ళు? ఇవన్నీ తట్టుకోవడానికి ఎవళ్ళు మాత్రం సంసిద్ధులౌతారు? వాళ్ళకు మాత్రం వాళ్ళ సంసారాలూ - బాగోగులూ వుండవా? వాళ్ళను మాత్రం ఇబ్బంది పెట్టే హక్కు ఏమైనా వుందా మనకు? ఏం చేయగలం తల్లీ” - జాలిగా బిడ్డ తల నిమురుతూ అడిగాడు పఠాభి.

సుధ అప్పటిదాకా గుండె దిటవు కలదానిగా నిలబడింది కాస్తా, టపటపా కన్నీరు కారుస్తూ, ఇద్దరు బిడ్డల వంక దీనంగా చూస్తుండి పోయింది. వర్ష- తల్లి కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తుంటే, హర్ష-కేరింతలు కొడుతూ తన తల్లితో ఏదో ముచ్చట్లాడబోతున్నది. అసలు విషయం తల్లి ద్వారా చూచాయగా తెలుసుకుంది సుధ.

తాను వున్నదానికన్న ఎక్కువ ఇంట్రోవర్ట్‌గా అగుపిస్తాడు నిరంజన్‌. పి.ఎస్‌.సి. పరీక్ష రాశానని, రేపో మాపో ఫలితాలు వెల్లడవడం, ఇంటర్వ్యూలు జరిగి జూనియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరడమే తరువాయి అంటూ వివాహమాడాడు సుధను.

పెళ్ళిచూపులప్పుడు కట్నం వద్దని, బాహ్య సౌందర్యంకన్న ఆంతరిక అందమే తనకిష్టమని అందరి హృదయాలనూ చూరగొన్నాడు. ఎంతో కలివిడిగా అందరితో మాట్లాడి, హుందాగా వ్యవహరించాడు. పెళ్ళి అయింతరువాత ఒకటికి రెండుసార్లు, ఇంకా అనేక పర్యాయాలు - ఎప్పుడు వచ్చి వెళ్ళినా ఆనందంగా వుంటూ, అందరినీ ఆనంద పరుస్తూ వచ్చాడు.

పి.ఎస్‌.సి. లో సెలెక్షన్‌ వస్తుందని, లక్షరూపాయలు కావాలంటూ వచ్చి కూర్చున్నాడొకనాడు ఆకస్మికంగా. పఠాభికి పెళ్ళిచేయగల స్తోమత తప్ప కట్నకానుకలు ఇచ్చే తాహతు లేదని తెలుసు. ఆమాట అతడు వివాహానికి ముందే స్పష్టంగా చెప్పియున్నాడు. అయినా, అల్లుడు అనవసరంగా అడగలేదుకదా, ఉద్యోగం కోసమే కదాని, తన పి.ఎఫ్‌. లోంచి పార్ట్‌ఫైనల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే యాభై ఐదు వేలు చేతికందాయి. అందులోంచి ఐదువేలు తన అవసరాలకోసం అట్టిపెట్టుకొని యాభై వేలు అల్లుడికి అందజేశాడు. “అంతా ఏర్పాటైతే బాగుండును” అన్నాడు నిరంజన్‌. ఎటువంటి మొహమాటమూ లేకుండా. చివుక్కుమన్నది పఠాభి మనస్సు. అయినా తమాయించుకుని, “అదికాదల్లుడూ, నా వల్ల అయ్యింది అంతే. అంతా ఇచ్చేశాను” - అని ప్రాధేయపూర్వకంగా చెప్పాడు. “అబద్ధమెందుకూ? ఐదువేలు అట్టిపెట్టుకున్నారటకదా!” నిలదీస్తున్నట్టుగా అన్నాడు నిరంజన్‌. అసహ్యంగా అనిపించింది పఠాభికి.

“సీతా - ఆ ఐదువేలు కూడా తెచ్చి అల్లుడుగారికివ్వు” అన్నాడు పఠాభి - ఏదో నేరస్తుడు నేరాన్ని అంగీకరిస్తూ, పోలీసుల ముందు వికారంగా నిలబడ్డట్టు.

‘వద్దు-వద్దు, ఆ ఐదువేలతో నా పని అవుతుందా? ఇంకా యాభైవేలకోసం నేనే ఎవడికాళ్ళో పట్టుకోవాలి తప్పదు అంటూ లేచి వెళ్ళాడు నిరంజన్‌. జరిగిందానికి పశ్చాత్తాప పడుతున్నట్టుగా వుండిపోయాడు పఠాభీ, సీతమ్మా.

“ఇట్లా ఎన్ని కాలేజీలని మారుస్తారో అల్లుడుగారూ- ఈ సంవత్సరంలోనే ఇది రెండవది. గత సంవత్సరం ఒక కాలేజీ. అంతకుముందొక రెండు కాలేజీలు. ఆ స్రవంతి కాలేజీలో తీసుకున్న అడ్వాన్సు ముప్పయివేలు తీరనేలేదు. ఇప్పుడు కాలేజీ కూడా మారుస్తానంటే ఇదో ఇరవై వేలూ, తీర్చేస్తోమత లేకుండా అప్పులు చేసుకుంటూ పోతే ఎట్లా?” కొంచెం అనునయంగా, బాధగా - అయిష్టంగా, అర్థింపుగా నన్నట్లు అడిగాడు పఠాభి.

“గమనిస్తున్నానండీ - మూడేళ్లకే నేను మురికి అల్లుడినై పోయాను. వద్దంటే ఇద్దరు ఆడపిల్లల్ని మీ బిడ్డ కన్నది కదూ - అందుకూ లోకువూ పోయాను. నేను ప్రభుత్వ కాలేజీ ఉద్యోగం సంపాదించలేకపోయాననే కదా ఈ చులకన భావం. దీనికి కారణం ఎవరంటారు? లక్ష రూపాయలివ్వమంటే మూల్గుతూ-ముక్కుతూ యాభైవేలిచ్చారు. అవతలివాడది నా మొహాన్నే విసిరి కొట్టాడు. అయితే, ఆడబ్బేదో అట్లాగే వుండి - పిల్లల్ని పొదుగుతూ వుంటుందనుకున్నారా? మాట్లాడితే డబ్బిచ్చానో - డబ్బిచ్చానో అని గుర్తుచేస్తుంటారు, నాకోసం - నా వాళ్ళకోసం కాకపోయినా, మీ కూతురుకోసం, మీ మనవరాళ్ళ కోసం ఒళ్ళంతా గొంతు చేసుకుని, అరిచి-అరిచి పాఠాలు చెప్పుకొస్తున్నాను. ప్రైవేటు కాలేజీల్లో. ఏవో రెండో- కాకపోతే మూడో క్లాసులు ఆరవ్వచ్చు రోజుకి - నాలుగో, ఐదో, ఆరంటే నా వల్లకాదు. నేనేం మీలాగా ఎస్టీటిని కాదు నోరెత్తకుండా పనిచేసుకుంటూ పోవడానికి. కాన్పులు చేయించాను. పురుళ్ళుపోయించాను. రక్తం ధార పోశాను. అందుకు ఇంతయింది. ఇందుకు అంతయిందంటారు. నాకేం కట్న కానుకలిచ్చారా? తులాభారం చేశారా? లోకంలో ఎవరూ ఏ అల్లుడికీ, కూతురికీ చేయంది చేస్తున్నారా? అడ్వాన్సుగా తీసుకున్నది కూడా అప్పే!” గట్టి - గట్టిగా అరిచాడు నిరంజన్‌.

“కొంచెం నిదానంగా మాట్లాడండల్లుడు గారూ, అడ్వాన్సయింది, అప్పయింది తేడా లేకుండా పోయేది తీర్చినప్పుడు కదా! మేం కట్నమిచ్చినట్టుగాని, ఆర్థికంగా తూగినట్టు గానీ ఎప్పుడైనా ఎవరితోనైనా అన్నామా?” సంజాయిషి చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు పఠాభి.

“మీరుండండి. ఏమయ్యా - మేమేమీ చేయలేదా? ఏమీ అదనంగా ఇవ్వలేదా? యశోదా ఆస్పత్రిలో మీ అమ్మగారు చేరినప్పుడు అయిన ఇరవై నాలుగు వేల బిల్లు మీ మావయ్య కాదా కట్టింది? నిన్నగాక మొన్న మీ నాన్నాగారికి అపోలోలో చేయించిన వైద్యానికి అయిన పదిహేనువేలు ఎక్కడినుంచొచ్చాయి? నా చేతిగాజులూ, బంగారు గొలుసు ఎవరికి అర్పించామయ్యా?”- అవేశంగా, ఎన్నడూ లేనంతటి ఉచ్ఛస్వరంతో, సజల నేత్ర అయి అన్నది సీతమ్మ.

“సీతా నువ్వూరుకో. అల్లుడుగారి మనస్సులో వుండేదేదో అననీ. అయ్యా! పురుళ్ళు పోయించటం మా బాధ్యతే. బట్టలూ, బంగారం కొని పెట్టడం మావంతే. అదేదో ఆవేశంగా, బాధకొద్దీ అన్నమాటలను పట్టించుకోకు. మేం అదనంగా చేసిందేమీ లేకపోగా మీకొక దమ్మిడీ అయినా ఇచ్చిన వాళ్ళం కాము. పొరబాటున స్వతంత్రించి ఏదో చెప్పబోయాను. ఏమీ అనుకోకు నాయనా” అని పఠాభి అంటుండగానే కలుగజేసుకుని-

“స్వతంత్రం కాదు అలుసు. నేనంటే ఆలుసు మీకు. ఇదే చెప్తున్నాను. ఏ కాలేజీలోనూ నేను నా ప్రమేయంతో చేరలేదు. నాకు బయట పదివేలిస్తామంటున్నా, ఐదేసి వేలకు మీరే కుదిర్చారు. అడ్వాన్సులూ - రాద్దాంతాలూ నాకు తెలియవు. అవేవో, మీరు చూసుకోండి - మానండి, నాకనవసరం. ఈసారి ఎవరి ప్రమేయమూ లేకుండా ముఖ్యంగా మీ ప్రమేయం అస్సలు లేకుండా, నాకుగా నేను ఒక కాలేజీలో వెదుక్కుంటున్నాను. నాకు మీ కూతురూ వద్దు, మీ వ్యవహారమూ వద్దు. మీ సంబంధానికో నమస్కారం. ఇంతటితో మీ బాగోతం కట్టిపెట్టండి” అంటూ విసురుగా వెళ్ళిపోయాడు నిరంజన్‌.

చూపులకు నిరంజన్‌ చాలహుందాగా, అందంగా వుంటాడు. ఎవరితోనైనా తాపీగా మాట్లాడతాడు. అతనిలోని ఒక విధ్వంసుకుడు భూతద్దంలో కాదు గదా ఎక్స్‌రేలతో కూడ బయటపడడు. వివాహమైన రెండు మూడు నెలల నుండే అతనిలోని విధ్వంసకుడు కళ్ళు తెరిచాడు. కాళ్ళూ-చేతులూ-అన్నింటికీ పనిచెప్పాడు.

సుధ బక్కపల్చగా, నాజూకుగా, చలాకీగా, అందంగా, ప్రసన్నంగా వుంటుంది. ఆమె నవ్వు, అందమైన పలువరస - ఆమె అందాన్ని మరింత పెంచేట్టుగా వుంటాయి. అందంతోపాటు తెలివైన సుధకు చదువన్నా, ఏదైనా ఉద్యోగరంగంలోకి ప్రవేశించాలన్నా ఇష్టం. గోషాలో పెట్టడమనేది ఒకటీ తక్కువగాని సుధ ఎవరి ఎదుటపడ్డా. ఆఖరుకు ఆమె కన్నతండ్రితో చనువుగా వున్నా సహించేవాడు కాదు నిరంజన్‌. అటువంటప్పుడు ఆమెను ఉద్యోగం కోసం బయటకు పంపుతాడా? ససేమిరా అన్నాడు. ఏవో ఉద్యోగాలకోసమని ఎన్నెన్నో దరఖాస్తులు చేసిందామె. కొన్నింటికి రెస్పాన్స్‌ వచ్చింది. చిన్నవీ, చితకవీ అయినా సరే, ఉద్యోగాలన్న తరువాత చన్నీళ్ళకు వేన్నీళ్ళు తోడన్నట్టుగా, ఆర్థికంగా సహాయకారి కాగలదని ఎంత చెప్పినా నిరంజన్‌ వినిపించుకోలేదు. ఎంతో సఫకేషన్‌కి గురైంది సుధ. మానసికంగా చితికిపోయింది కొంతకాలం. ఇక వాటి జోలికి పోవడం మానేసింది.

ఇంట్లో సుధకు ప్రత్యక్ష నరకాన్ని చవి చూపిస్తుంటే నిరంజన్‌ని అతని తల్లిదండ్రులే వారింప జూశారు. కాని ఫలితం లేకపోయింది. తండ్రి పెంపకంలో కొంత స్వేచ్ఛగా పెరిగిన సుధకు పుస్తకాలంటే ఇష్టం. వాటికీ దూరం చేశాడు నిరంజన్‌. ఒంటరిగా కూర్చుని నిర్వ్యాపారంగా ఉండటమిష్టం నిరంజన్‌కి. పుస్తకాల్ని ఆమె చేతుల్లోంచి లాక్కుని విసిరికొట్టేవాడు. అదేమంటే తనమీద మోజు తీరిందని, తనను అవాయిడ్‌ చేయజూస్తుందని కొత్త నిందలు వేయబూనేవాడు. సుధకు వ్రాయడంలో కూడ కొంత ప్రవేశం వుంది. “ఎవడికోసమే ఈ రచనలు?” ఎవడిమీదనే నీ విరహం?” అంటూ గుడ్లురిమి, కనీసం ఆమె వ్రాసిందేదో చూడనైనా చూడకుండా చించేసేవాడు. ఒకనాడేదో తాపత్రయం కొద్ది తాను వ్రాసుకున్న వాక్యాలు తాత్వికంగానూ, కొంచెం లోతుగానూ వున్నాయనిపించి, భర్త చించేసిన కాయితాలను ఒకచోట చేర్చి, తిరిగి వాటిని అతికించి చదువుకోబోతుంటే గమనించిన నిరంజన్‌- పైశాచికంగా ప్రవర్తించి, చిరుగుకొకటి చొప్పున ఆమె శరీరాన్ని కొవ్వొత్తితో కాల్చాడు. బాధ భరించలేక నోట్లో గుడ్డలు కుక్కుకుని ఏడ్చింది సుధ. కాలిన గాయాలు మానేదాకా తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

జరిగిందంతా తెలుసుకున్న తల్లిదండ్రులు కుమిలి - కుమిలి రోదించారు. సుధ జీవితాన్ని ఆమె నిర్ణయానికి వదిలేయటానికి అంగీకరించారు. విడాకులు కోరింది సుధ. ఏమీ చెప్పలేదు నిరంజన్‌. అవుననీ కాదనీ చెప్పక నాన్చుతూ వచ్చాడు. వారం, నెల, ఆరునెలలు గడిచాయి. ఉన్న ఉద్యోగం పోయి చివిరి గడ్డంతో వికారంగా, ఫకీరులాగా మారి వచ్చాడు. మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం. ఏడ్పులూ - తీర్పులూ అయ్యాయి. బుద్ధొచ్చిందన్నాడు. ఎవ్వరూ నమ్మలేదు. నమ్మలేదన్న విషయం అతనికీ తెలుసును. కాని సుధకు తప్పింది కాదు. మనసూ, ఆత్మా అనేవాటినన్నింటిని చంపుకుని వెళ్ళింది. సంసార సాగరంలోకి - దుఃఖపు ఊబిలోకి - ఒక అలలాగ - ఒక పీడకల లాగ - రెక్కల్దెగిన పక్షిలాగ - గాయపడిన కూన లాగ - సుధ!

చిన్నపాటి పట్టు చిక్కింది గనుక ఇక విజృంభించాడు నిరంజన్‌. మెత్తగా అగుపిస్తూనే కన్పించని కత్తితో నిత్యం ఒక కొత్త విధంగా, ఏదోవొక నెపంతో కోస్తూ- వస్తున్నట్టుగా - విసిగిస్తూ - రాచి రంపాన పెడుతూ వచ్చాడు. ఉన్నట్టుండి ఉద్యోగం మానేశాడు. ఉన్నఫళంగా స్థలం మారుద్దామనేవాడు. ఆరునెలలకోచోటు మార్చి మార్చి విసిగించాడు. ఈ కాలేజీ బాగోలేదంటే- ఆ కాలేజీ సరిపడదని, చేజారిపోయిన ఉద్యోగానికల్లా పఠాభిదే కారణమంటూ వచ్చాడు.

ఈలోగా పఠాభి ఉద్యోగ విరమణ కూడా చేశాడు. ఆదాయం సగమైంది కాని అవస్థలు రెట్టింపయ్యాయి. ఒక్కగానొక్క కూతురనుకుంటే జీవితానికి సరిపడా నరకయాతనే మిగిలింది. ప్రభుత్వ చాకిరీ చేసి - చేసి వెన్నుపూస విరిగినంత పనైంది. అల్లుడి దయవల్ల పిడికెడు గుండె కాస్తా చిల్లు - చిల్లు అయ్యింది. కూతురు స్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతావుంది. భార్య ముఖం చూస్తే మనస్సు ఉసూరుమంటా వుంది. వివాహ వ్యవస్తమీదా, సమాజంలో కొనసాగుతున్న అక్రమ తీరుమీదా రోత కలుగుతూ వుంది. అటువంటి స్థితిలో కూతురు ఆకస్మికంగా ఒకనాడు ఇంటికి రావడం, మరునాడు ఫోనురావడం - కలరావ్యాధి - చికున్‌ గున్యా, డెంగ్యూలు తగ్గకుండానే టైఫాయిడ్‌ మీద టైఫాయిడ్‌ మొదలైనట్టుగా పరిస్థితి దాపురించినట్లయింది. భయంకరమైన దిగులు ఎన్నడూ లేనంతగా ప్రారంభమైంది.

ఇదంతా గ్రహించిన సుధ - తండ్రి తెలియజేయలేని, తెలియజేయాలంటే నోరు రాని విషయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకున్నది గనుక ఒక నిర్ణయానికి వచ్చింది. దుఃఖించి, శుష్కించి పోవడం వల్ల ప్రయోజనం లేదని, కన్నీళ్ళు కడిగేసుకుని ఇక బయలుదేరింది.

“అదేమిటమ్మా - ఎక్కడికీ ప్రయాణం?” - పఠాభీ, సీతమ్మా ఒక్కసారే అడిగారు సుధను.

“అత్తవారింటికి” - చాల కాన్ఫిడెంటుగా జవాబిచ్చింది సుధ.

“ఈ స్థితిలోనా? అందునా ఈ ఫోను వ్యవహారం”- అంటూ చెప్పలేకా, దాచలేకా సతమతమయ్యాడు పఠాభి.

“నాన్నా - అసలేం జరిగిందో, ఆయనేం మాట్లాడిందీ నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడ నాకిప్పుడు లేదు. నా కాపురాన్ని నేను చక్కబెట్టుకోగలదో లేదో గాని, నాకుగా నేను నిలబడగలననే ధైర్యంవచ్చింది. అదిచాలు. నాకింక ఎటువంటి బెరుకూ లేదు. మీరేం బాధ పడకండి. భయం అంతకన్నా పెట్టుకోకండి. త్వరపడి నేను ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడను. నావెంట సైతం ఎవ్వరూ రాకండి. నేను ఒక్కదాన్నే ఈ వ్యవహారం తేల్చుకోదలచుకొన్నాను” అంటూ బిడ్డలనిద్దరినీ వెంటబెట్టుకుని బయలుదేరింది. కుడిచేతిలో ఒక చేసంచి, ఎడమ చేతిలో పెద్దమ్మాయి వర్షను పట్టుకుని, చిన్నపాప హర్షను చంకనెత్తుకొని, ఆమె అలాగుండె నిబ్బరంతో వెళ్ళుతుంటే, ఏమీ తోచక, అడ్డగించి ఆమెను ఆపనూ లేక చూస్తూ వుండిపోయారు. సీతమ్మా, పఠాభి.

“ఏం ఎందుకొచ్చినట్టు? ఎవడికోసమైతే వెదుక్కుంటూ వెళ్ళిపోయావో వాడి దర్శనం కాలేదా? అయినా, ఆశ్రయం ఇవ్వను పొమ్మని తన్ని తరిమేశాడా? అలా దిక్కు లేక పాతమొగుడే దిక్కని, సిగ్గూ లజ్జా లేక తిరిగి వచ్చావా?” రెచ్చగొడుతున్నట్టుగా అరిచాడు నిరంజన్‌.

మౌనంగా ఇంట్లోకి నడిచింది సుధ. అత్తగారు చేసంచిని తీసుకుని వర్షను అక్కున చేర్చుకుంటే, మావయ్య ఒళ్ళోకెళ్ళి వాలింది హర్ష. అలా అదే పనిగా అరుస్తూనే వుండిపోయాడు నిరంజన్‌. చేతికి ఏ వస్తువు అందితే అది నోటుబుక్కూ-పెన్నూ-పెన్సిలూ-కంపాస్‌ బాక్సు - టీ కప్పు - ఏవి తోస్తే దాన్ని తీసుకుని నేలకేసి కొడుతూ, విసిరేస్తూ, చిందులు తొక్కసాగాడు. ఏమీ జరగనట్టు, అసలింక తనకేదీ పట్టదన్నట్టు, లోపలికెళ్ళి తన పనేదో తను చేసుకుంటూ పోయింది సుధ. ‘నాన్నా’ అంటూ పిల్లలు సమీపిస్తే, కసిరి కొట్టాడు నిరంజన్‌.

“పిల్లలేమన్నారు?” అడిగారు తల్లిదండ్రులు.

“మీరు మాట్లాడకండి. మీరంతా వొకటే. ఆ పిల్లలంటే నాకసహ్యం. నాకిప్పుడు ఆడజాతంటేనే అసహ్యం కలుగుతున్నది” కేకలేస్తున్నట్టుగా అన్నాడు నిరంజన్‌.

“వీడి ఖర్మ” అన్నట్టుగా పసిపిల్లలను తీసుకుని పక్కకు తొలగి పోయారు తల్లిదండ్రులు.

పగలు కాస్తా సాయంత్రంలోకీ, సాయంత్రమేమో రాత్రిలోకీ జారుకున్నాయి. అంతసేపూ మౌనం. కాకుంటే ప్రేలాపన లాగా నిరంజన్‌ అరుపులు. మధ్య మధ్య ఆటలాడుకుంటూ అల్లరల్లరిగా తిరుగాడుతున్న పిల్లలమీద కసురుకోవడం. ఆ స్థితిని వింతగా గమినించి పిల్లలు దూరం తొలగిపోవడంతో సరిపోయింది.

“నా గదిలోకి రావద్దు” అంటుండగానే విసురుగా, బలంగా తలుపులు తీసుకుంటూ లోపలికి ప్రవేశించి పక్కలు పరిచింది సుధ.

అంతటి బలాన్ని, తెగువను తొలిసారి అనుభవ పూర్వకంగా తెలుసుకున్నానిపించింది నిరంజన్‌కి. నివ్వెరపోయాడు, కాని, ఆ ఫీిలింగుని వ్యక్తం చేయకుండా దాచుకునే విఫలయత్నం చేశాడు.

“ఎవడబ్బ సొమ్మో ఇక్కడ దాచినట్టు పీకలదాకా నొక్కొచ్చింది. కనీసం తినమనైనా అనలేదు. బరితెగించింది కదా” అన్నాడు సుధ నుద్దేశించి నిరంజన్‌.

ఆమె రోశపడలేదు.

చిరాకూ, అవమానం, కసితీరా ఆమెను కొట్టి చంపేస్తే బాగుండునన్న భావాలు కలిగినై నిరంజన్‌కి. కాని సాహసించలేదు.

లైట్లార్పేసింది సుధ.

తిరిగి వెలిగించాడు నిరంజన్‌.

మళ్ళీ ఆర్పేసే ముందు ఒక చూసు చూసింది సుధ-నిరంజన్‌ వైపు. ఏదో శక్తి ఆవహించినట్టుగా వుంది. కళ్ళు నిప్పుకణికల్లా ఎర్రబడి వున్నాయి. సూటిగా ఆమెకళ్లలోకి కాదు - కనీసం ఆమె ముఖం వైపు కూడా చూడలేకపోయాడు నిరంజన్‌. “మళ్ళీ లైట్లు వెలిగించావో…” అన్నట్టుగా ఆర్పేసింది. ఇక సాహసించలేకపోయాడు నిరంజన్‌.

ఇరువురూ నడుం వాల్చారు కాని ఎవ్వరూ నిద్రకు ఉపక్రమించలేదు. రెండు అగ్ని గుండాలుగా మండుతున్నారు లోలోపలే. కళ్ళు మూసుకునే ఎవరికివారు ఆవేశంతో వేగిపోతున్నారు. గది కూడా వేడెక్కినట్టుగా ఉక్కబోసి దిక్కుతోచక హైరాన పడుతున్నట్టుగా ఉంది. తన చుట్టూ వేడినే తిప్పుకుంటూ ఫాను సొమ్మసిల్లి పోతున్నట్టుగా వుంది. కాలం ఆగిపోయినట్టుగా కూడ వుంది. మౌనం మాత్రమే చోటుచేసుకుని పదిలంగా పరుచుకున్నట్టుగా వుంది.

గంట గడిచింది. రెండు గంటలు గడిచినవి. మూడుగంటలు…. సుధలేచి నిరంజన్‌ ఫ్యాంటును విప్పదీయడం ప్రారంభించింది. అతడు ముడుచుకుపోసాగాడు. బలంగా లాగేసింది.

‘ఏమిటిది లజ్జలేకుండా?’అని గద్దించబోయాడు. అండర్‌వేర్‌ని కూడ లాగి పారేసింది. లేచి చెంప చెళుమనిపించబోయాడు. చెయ్యి పట్టుకుని విరిచేసినంత పనిచేసింది. ‘కుయ్యో మొర్రో’ అని మొత్తుకుంటుంటే, తాను లేచి, అంతకుముందే సిద్ధం చేసుకున్నకత్తిని తీసి, లైటువేసి, ఎడమచేతిని అతని తొడల మధ్యకు పోనిచ్చి.. పట్టుకుని, కత్తిని ముందుకు తెచ్చింది- కోసేసేందుకన్నట్టుగా.

‘హోహో’ అంటూ పెద్దపెట్టున అతగాడు అరవబోతుంటే మూతి పగిలేట్టుగా చాచికొట్టి - “ఏరా ఈ పనిచేస్తే హత్యాయత్నానికి పూనుకున్నానని కంప్లెయింటు ఇచ్చావు కదా..”

“లేదు-లేదు, నేను కంప్లెయింటు ఇవ్వలేదు. ఇచ్చానని అబద్ధం చెప్పినాను” వణికిపోతూ, ఏడుస్తూ, చెమటలు కక్కుతూ, చేతులు జోడిస్తూ, మూతి పగిలిందేమోనని తడిమిచూసుకుంటూ, మొరపెట్టుకుంటున్నట్లుగా అన్నాడు నిరంజన్‌.

“ఏం ఫరవాలేదు. ఇప్పుడు చెయ్యరా పోలీసులకు ఫోను- నేను ఆపనే చేయబోతున్నాను” అంటూ, అంగీని కూడ విప్పదీయ సాగింది సుధ. నివారించే ధైర్యం చాలక, ఎక్కడ కత్తికి పనిచెప్తుందో నన్న భయంతో పిరికి-పిరికిగా, పిచ్చి-పిచ్చిగా, అతలా కుతలమైపోతూ, అంగీని తానే విప్పేసుకున్నాడు. అంతకుముందే బనియణ్‌లేదు.

“నాది తప్పే- నన్ను క్షమించు - నేనేమీ పోలీసులకు ఫోను చేయను. నిన్నింక హింసించను- నామానాన నన్నొదిలేయి. నీకు దండం పెడతాను. నీ జోలికి రాను. నీకాళ్ళు పట్టుకుంటా” నంటూ కాళ్ళవైపు సమీపించబోయాడు నిరంజన్‌. ఆమె దూరం తొలగుతూ ఒక మూలను చూపించి అక్కడ కూలబడమన్నట్టుగా సైగచేసింది. ఆ పనిచేయబోతూ ప్యాంటును చేతిలోకి తీసుకోబోయాడు.

“ఊఁ అదక్కడపెట్టు. అంతసీను లేదు నీకు. నీకిదే శాస్తి. తెల్లారేదాకా ఆ మూలనే పడి చావు. కదిల్తే నీ గతి అంతే” అంది మహోగ్రంగా.

లైటు ఆర్పేయబోయాడు నిరంజన్‌. తొలిసారి ఆరాత్రి అతనికి తన భార్యే ఒక పరాయి స్త్రీగా - ఒక మృత్యుదేవతగా, భయంకరంగా అగుపించింది. సిగ్గూ-బిడియం ఒక్కసారిగా అనిపించసాగాయి.

వెంటనే అతని ప్రయత్నాన్ని అడ్డగిస్తూ లైటు వెలిగించింది సుధ. “ఈ లైటు ఇట్లాగే వెలుగుతూ వుంటుంది తెల్లారేదాకా. నిద్రపోతావో-మేల్కొని చస్తావో నీ ఇష్టం. నేను మాత్రం నిద్రపోను” అంది సుధ.

“నేను కూడా నిద్రపోను. నా బుద్ధి తక్కువై ఇటువంటి అభాండం వేశాను. నా తప్పు కాయి” అంటూ చెంపలు చెళ్ళు చెళ్ళున వాయించుకోసాగాడు నిరంజన్‌.

“రేపటి నుంచి నా ప్రవర్తన మార్చుకుంటాను. నీకు అవమానం కలిగించే హాని కలిగించే ఏ పనీ చేయను. కాలేజీకి సరిగ్గా హాజరై అప్పుల పాలు కాకుండా చూసుకుంటాను. మీ తల్లిదండ్రులను నానా హింసలు పెట్టాను. అవన్నీ మనసులో పెట్టుకుని కత్తికి పనిచెప్పొద్దు. ప్రమాణం చేస్తున్నా”నంటూ మళ్ళీ రోదనం చేయసాగాడు.

ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనం అతనికి మరింత వణుకు పుట్టించింది. తన వంటిని, తన దిగంబరత్వాన్ని - తన లజ్జాకరమైన పరిస్తితిని చూసుకుని తనకు తానే కుళ్ళిపోయినట్టుగా, కంపుగొడుతున్నట్టుగా భావించి, గతుక్కుమంటూ వుండిపోయాడు నిరంజన్‌.

తెల్లగా తెల్లారింది.

కాలేజీకి రెడీ అయిన వాడల్లా - యజమాని ముందు బానిసలాగా ఆమె అనుమతి కోసం అన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు నిరంజన్‌.

“పోయి చావు” అన్నట్టుగా చూసింది సుధ.

తోక ఆడించుకుంటున్నట్ట బయలుదేరాడు నిరంజన్‌.

పఠాభికి ఫోను చేసి - “నాన్నా రాత్రికి రాత్రే పోలీసు కేసు సెటిల్‌ చేసినాను. నిశ్చింతగా వుండండి. ఇక ఏ ఇబ్బందీ లేదు” అంటూ ఫోను పెట్టేసింది సుధ.

బతుకు
-బి.వేణుగోపాల్‌

చిగురులు తొడిగిన అడివి పచ్చగా కళకళలాడుతున్నది. గ్రీష్మ తాపాన్ని తీర్చడానికి వసంతం హరితాన్ని పులిమి వెళ్ళినట్లున్నది. సూర్యుడు నడినెత్తి మీదున్నడు.అప్పటి వరకు విస్తరించిన చెట్ల నీడ చెట్టు మొదలువరకే వచ్చింది. బుగబుగమని మండుతున్న ఎండను సైతం లెక్కచేయక అడవితో యుద్ధానికి వచ్చినట్లు తునికి పొదలను వెతుక్కున్న గుంపు అటు ఇటు కదలాడతున్నది. చిన్న,పెద్ద తేడా లేకుండా తునికాకు (చుట్టాకు) లను టిక్‌ టిక్‌ మని తెంపుతున్నారు.కాళ్ళు చేతులు యంత్రంలా ఆడుతున్నాయి.

ఎండకు నేనుసై అంటూ అపుడే వచ్చిన ఎర్రటి లేత చిగురుటాకును స్పర్శిస్తూ, దాని క్రిందున్న ఆకును తెంపుతూ మట్టిలో పడిన మనుబోతు అడుగులను చూసి “ఓరి మల్లిగా….. మనుబోతు అడుగులు జూసినావురా………. ఇట్లా ఆ లొద్దిలకు పోయినట్లున్నయి.” అని బుచ్చయ్య పరిశీలనగా అడుగుల వంకనే చూస్తూ, చుట్టాకులను తెంపుతూ బుడ్డగా చెక్కుకున్న దోతిలో వేస్తున్న మల్లయ్య తో అన్నాడు.

“ఏదే… అవు సయే… నిన్న పొద్దుగూకి కట్టెలకచ్చినోళ్లకు కనిపించినానయట. ఏడనే రెండే వున్నయట. ఎన్నో మందలకు మందలుండేడిది. అవురా…. మునుపటి లెక్క జీవరాశి ఎక్కడిది?”

“అందరు శికారి చేయవట్టిరి. చూడు అని చుట్టూచూపిస్తూ,” అడవి ఏమన్న ఉన్నదా…. సాఫ్‌ సత్తెనాష్‌ బట్టిచ్చిండ్రు. పెద్ద పెద్ద చెట్లు లేనే లేవు. టేకు చెట్లయితే బంగారమైనయి.” అని అనగానే పక్కనే ఉన్న తుర్పిబాయి తన కొంగును నడుముకు చుట్టుకొని ఏర్పడిన సంచిలో వేగంగా తెంపుతున్న ఆకులను వేస్తూ,” అంటే కోపాలస్తయి. గని, అడివిని కాపాడదల్గి సంఘం సంఘం అని ఓ…. ఎగిరితిరి.గిపుడేమైంది? సంఘం లేనపుడు, ఆఫీసర్లు లేనపుడు జంగలే మంచిగుండే,

ఇంటికీ,యగుసంకు కట్టె తెచ్చుకునా జంగల్‌కు ఏమికాలే, గిపుడు అందరూదొంగలే, ఉత్త బంగిమంది. దానిచ్చి అదే మొలిచి పెర్గే అడివికి సంఘాలెందుకు? ఆఫీసర్లెందుకు?” అని సహజంగా మారిన వ్యవస్థపై గల ఏహ్యా భావం వల్ల కోపంతో అన్నది. ఇరువులు మొదట నొచ్చుకున్న ఆమె చెప్పిన సత్యానికి తలలూపారు. ఎందుకంటే మొదట సంఘాలచ్చినపుడు చొరవతో ముందుకు నడిచారు. “అవు… సయే” అంటూ బుచ్చయ్య ఎండతీవ్రత ఎక్కువగావడం వల్ల, పక్కనే గల పూసుగు చెట్టు నీడలోకి వెళ్ళాడు. అడవిలో జంతుజాలం ఇష్టంతో సేదతీరే నీడ ‘పూసుగుచెట్టు’ నీడ. అంత చల్లని దట్టమైన నీడ ఏ చెట్టు ఇవ్వదు.

మళ్ళీ తుర్పిబాయే. “ఆఫీసర్లయితే బట్టే బాజిగాండ్లు.ఈళ్ళకు సై అనేటోళ్ళు గావాలె బుచ్చి మామ. ఒళ్ళుసై అంటరు దొంగలు. ఈళ్ళు దొంగలే ఆళ్ళు దొంగలే. ఇగ రక్షణ ఏడిది?” అని కుండ బద్దలుగొట్టినట్లు మాట్లాడుతున్న తుర్పిబాయి ఎవరి తప్పులైనా గిట్లనే కడిగిపారేస్తది.

“అవు… ఆ…ఆ.. “ అని నగుతూ బుచ్చయ్య, మల్లయ్య ఒకరికొకరు బీడి వెలిగించుకున్నారు.

“తుర్పక్కా… ఒక్క అడివే కాదే ఊరుసుక గట్లనే అయింది. అంత ఆగమైంది. మునుపటి లెక్క ప్రేమలు లేనేలేవు.” అని చెమర్చిన కళ్ళతో మల్లయ్య అంటుంటే.

“‘అంత లంగలయిండ్లు. మునుపటి లెక్క ఏడున్నరు. బుచ్చిమామ మీ నారిగాడైతే బామ్టయిండు. నిత్తె తాగి గుసలాడుతున్నడు. తాగి గా జనిగి పోషిని పొట్టు పొట్టు తిట్టిండట. అది కేసు బెడ్తనంటున్నది.”

“అరె… ఇడు గాళ్ళ జోలికి పోవుడేంది. ఆళ్ళు జంగల్‌ సంఘం అనుకుంట ఎట్ల జేస్తున్నరో ఎరుకనే గదా! లమ్డికొడుక్కి ఎంత చెప్పిన గంతే ఎప్పుడు గుసలాడుతడు.

నారాయణ బుచ్చయ్య రెండో కొడుకు తాగుబోతుగా మారిండు. బుచ్చయ్యకు అదే బాధ.

“ఎందుకు గుసలాడడే మామ తాగినంత కల్లు ఊర్ల దొరుకుతున్నది. గా గుల్‌ఫారం కల్లు తాగి పతి ఒక్కడు సాతగాకుంటయిండ్లు. ఉత్తమబ్బు తయారవుతున్నారు. ఇంక పనేం జేస్తారు” అని మల్లయ్య అంటుంటే మత్తులో జోగుతున్న పల్లె కళ్ళెదుట కనిపించింది బుచ్చయ్యకు. గుండెను ఒకేసారి పెకిలించినట్లయింది. పక్కనే ఉన్న భీమలింగు “మీ నారిగాడి కంటె మా సూరిగాడు దండికడ్డు తయారయిండు. ఆనికి పోటి చెవిటి గంగడు. పే కొడుకులు ఒక్కొన్నిమించి ఒక్కోడు తయారయిండ్లు. తాగుడు గుసలాడుడు. నిత్తె ఇదే పని.”

కోపం దిగమింగిన గొంతుతో “అవురా… దరిద్రం కల్లు యాడనుంచి అచ్చెరా! అంత ఎద్దు కష్టం గీల్లే జేస్తున్నరు. పండుగ లేదు. పబ్బం లేదు. నిత్తె తాగుడే. యాడ్నుంచి పైసలస్తున్నయి.” అంటూ విచారంలో పడిపోయాడు బుచ్చయ్య.

“మొత్తం ఊరే అట్ల తయారయిందే. ఒక్కడు పని సక్కగ జెస్తలేడు. ఎప్పుడు కొట్లాటలే. ఉన్న భూమిని దున్నుకోక, కైకిలి సాతగాక, లచ్చిగాడు తాగి తాగి సావలేదా నిరుడు.” అని తుర్పిబాయి, ముగించింది.

తుర్పి మాటలు విన్న బుచ్చయ్యకు గుండెలో రాయి పడ్డట్టయింది.

అంతలో “నడుండ్రి.. నడుండ్రి ..” అంటూ గుంపులోని కొందరూ అంటుంటే మల్లయ్య లేచి “పదవే బుచ్చయ్య మామ బగ్గయాల్లైంది.” అంటూ తన చేతిని బుచ్చయ్యకు ఆసరాగా అందించాడు.

జమ చేసిన చుట్టూకును పెద్ద సైజు ముల్లెలాగ కట్టుకొని ఎవరికి వారు నెత్తిమీద ఎత్తుకొని పల్లెదారి పట్టారు. యుద్ధం ముగిసిన సైనికుల్లా. చుట్టాకుకు సాధారణంగా పొద్దునే పోయి మధ్యాహ్నం కల్ల తిరి గివస్తారు.

ఒకరి వెనుక ఒకరు వడివడిగా నడుస్తున్నారు. పిల్లలేమో నేను ముందంటే నేనంటూ ఒకరినొకరు దాటవేయాలనే ప్రయత్నంలో వేగంగా నడుస్తున్నారు. పిల్లబాట వెంబడి మార్చ్‌ఫాస్ట్‌ చేస్తున్నరు.

బుచ్చయ్య విచారం నుంచి తేరుకొనేలేదు. పిల్లగాండ్లు యారవడి ఐదేండ్లు అయింది. వేరుపడతామని కోట్లాట బెట్టిండ్లు. ఆళ్ళన్నట్లే కోరుకున్నదే పంచిచ్చిన్న. గని,ఒక్కడు సక్కగ బతుకత లేడు. నిత్తె ఏదొక కోట్లాట. ముగ్గురికి మూడెకరాల దాక అచ్చింది. ఒక్కనాడు సక్కగ పంట పండలేదు. తగ్గ కష్టం జేస్తనేలేరు. కలిసి ఉన్నపుడు దేనికి లోటు లేకుండే. అన్ని కర్చులు పోంగ ఎంతో మిగులుతుండే. వట్టి అడ్లు, జొన్నలు, కొర్రెలు,సామలు, పెసల్లు, మినుములు, తొగళ్ళ, శెనగలు, బబ్బర్లు, అలసందలు, దనియాలు ఎన్నో తీర్లపంటలు. అన్ని గింజలు పండేడిది. బయట ఏమి కొనక పోతుంటమి. ఇంటోళ్లందరు కష్టం చేసేడిది. ఆ కష్టం ఇయ్యాళ్ళ ఎందుకు చేస్తలేరు. ఉన్న ఎనిమిది, పదిఎకరాలల్ల అందరు అనందంగా బతికిండ్లు. గిపుడు మంచికి మూడెకరాలల్ల చిన్న కుటుంబం ఎందుకు బతుకుతలేదు? గిప్పటోళ్ళు గిట్ల ఎందుకు అవుత్నురో సమజయితలేదు. అచ్చిన మూడెకరాల సాగుజేసుకోక అచ్చిన పైసలతోట తాగుకుంట తిర్గి, గిపుడేమో జీతం ఉంటున్న చిన్నోడు. ఎప్పుడు దురస్తవుతడో? పెద్దోడు సిస్తుగ జేసుకున్న ఈ నడుమ ఆడు గిట్లనే చేస్తున్నడు. ఇగ నారిగాడెమో గిట్ల అనుకుంటూ ఆలోచనలతో సాగుతున్న బుచ్చయ్య నడక భారమై దారి తప్పుతున్నడు.

ఇది చూసి మల్లయ్య “ఏం సోంచాయిస్తున్నవే మెల్లంగా… చూసినడు. దారి తప్పుతున్నవు” అని అనగానే బుచ్చయ్య తేరుకొని,

“ఊరే దారి తప్పింది నేనేం లెక్కరా?

“ఊరి గురించి గిపుడు బాధపడి ఏం ఫాయిద లేదే బుచ్చిమామ ఊర్లఅందరు పెద్దోలయిండు, నాపార్టీ నాపార్టీ అనుకుంట జెండను మొలకు చుట్టుకొని ఎగురుతున్నరు. పని చాత గాకుంటయిండ్లు. అన్ని పార్టీలోళ్ళు ఊర్ల ఉంటే ఎట్లుంటది బుచ్చయ్య మామ బింగి మంది అయిండ్లు.” అని తుర్పిబాయి ఆవేశంగా చెప్పింది.

మళ్ళీ తనే “కష్టమచ్చినా సుఖమచ్చినా కలిసి ఉన్న ఊర్ల కొట్లాటలు ఎక్కువాయే! కలిసి మెలిసి ఉన్నోళ్ళే పగదార్లు అవుత్నురు. ఇగ ఏడికెళ్ళి దురస్తవుతరు.” అని తుర్పిబాయి బాధతో చెపుతున్నది. వెంటనే మల్లయ్య “ఎప్పుడు ఒకటే తీరుండది. కాలం మారుతుంది.”

ఏమి మారుతది తమ్మి చేసి చేసి ఆడోళ్ళ రెక్కలన్ని పడిపోతున్నయి. ఇంకెన్ని రోజులు గిట్ల.”

“మీకు ఒక్కటి చెప్పుత సక్కగ ఇనుండ్రి.” అని మల్లయ్య అనగానే ఏంది అని చెవులు రిక్కించారు. ఎందుకంటే మల్లయ్య ఊర్ల సమాజ్‌దారు. అందరు ఇజ్జత్‌ ఇస్తరు.

“పుట్టింది యవుసంనే కని ఎన్నడు యవుసం సాతి ఇవ్వలేదు. ఎప్పుడు బాకీల బతుకే. పడ్డ కష్టంకు ఫలితం ఎన్నడులేదు. గీ బతుకులు గింతేనెమె అనుకున్నం. కని, పత్తికి పది వంకలు బెట్టి పదిపైసలు మిగలకుండ చేసిన సేటుకు గుంజి కొట్టినంగద అని అనగానే, తుర్పిబాయి అడ్డు తగులుతూ “హిమ్మత్‌ ఇచింది అడవిలో న్యాయమే కదా! భయపడి గీచుట్టూకు కట్టల ధర సుక పెంచిండ్లు.” అని అనగానే

“అయితే గిప్పడేం జేసుడు.” అని విసుగ్గా బుచ్చయ్య అన్నాడు. “గప్పటి హిమ్మత్‌ గిపుడు గావాల్నే బుచ్చయ్య మామ.

బయట శత్రువులు, ఇంట్ల శత్రువులు ఎన్నోద్దులు ఇట్ల”?

“‘ఆధైర్యం గిపుడు అస్తదా మల్లయ్య” అని భీమలింగు నిర్వేదంగా అన్నడు.

“ఎందుకు రాదు భీమలింగు బొప్పా.”

“ఏ ….ఈ కడ్లను దంచుతనే ఇంటరు.” అని గుంపులోని కొందరు ఆడవాళ్ళు కసిగా అంటున్నరు.

“చెడుతున్న ఊరు తరుగుతున్న అడివి మన చేతుల లేదురా! దొంగలకు వార్తలందించినోడు గదెదో అంటరు గద మల్లయ్య. ఆ….ఇన్‌ ఫార్మర్‌ గాళ్ళు జమైన ఊర్ల ఏమి చేయరాదు. ఆడికి భయపడి నోళ్ళకు తాళం వేసుకోలేదా! చావు మీదకు తెచ్చుకున్నోళ్ళు లేరా! మన తోటి ఏమైతది?” అని బుచ్చయ్య నిస్సహయత ఆవిరించియున్న గొంతుతో అన్నడు.

“నేను చెప్పిన గదనే బుచ్చయ్య మామ! కాలం ఒకటే తీరుండది. ఎండాకాలం అయినంక వానాకాలం ఎప్పుడు ఒక్కొళ్ళదే పై చేయి కాదు.” అని మల్లయ్య ఆశావాద దృక్పదంతో చెపుతున్నాడు. అదయితే నిజమే.

అంతలో ఊరి పోనాదికి వస్తుండగా ఊరికి పోలీసులు వచ్చారు. బుచ్చయ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది.

ఎప్పుడో కబురు అందిన నారిగాడు ఎస్సైముందు ప్రత్యక్షమైనాడు. తాగిన నారిగాడు తుళ్ళుకుంట కంట్రోల్‌ చేసుకుంటూ నిల్చున్నాడు. అయినా తుళ్ళుతున్నాడు.

ఊరిలో సగం కంటె ఎక్కువ మంది తాగిఉన్నరు. అదే వింతలోకం.

ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న గుంపు అడివి నుండి ఊరిలోకి యుద్ధం ముగించిన సైనికుల్లా వచ్చేశారు. నెత్తిన ముల్లెలనుప్పుడే ఆలస్యం.

పతిక్రా పక్రటనలు
పోసాని మురళీ కృష్ణ దర్శకత్వంలో “ఆపరేషన్‌ దుర్యోధన” చిత్రంలో తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను, సంస్కృతిని కించపరుస్తూ, అవహేళన చేస్తూ సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రా సినీ పెట్టుబడిదారుల దురంహకారానికి ఈ సంభాషణలు, సన్నివేశాలు నిదర్శనాలు. ఈ దురంహాకార పూరిత వైఖరిని తెలంగాణ రచయితల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.

తెలంగాణ ప్రజలను, సంస్కృతిని, ఉద్యమాన్ని కించపరస్తున్న సన్నివేశాలను, సంభాషణలను వెంటన్‌ చిత్రంలోంచి తొలగించవలసిందిగా “దుర్యోధన” నిర్మాత, దర్శకులను డిమాండ్‌ చేస్తున్నాం. ఈ సన్నివేశాలు, సంభాషణలు తోలిగించే వరకు తెలంగాణలో ఈ చిత్రం ప్రదర్శనలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. అదే విధంగా దర్శక, నిర్మాతలు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం.

తెలంగాణ అన్ని జిల్లాల తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు “దుర్యోధన” సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ల ముందు నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని పిలుపునిస్తున్నాం.

తెలంగాణ భాష, సంస్కృతి అంగడి సరుకు కాదని వేల సంవత్సరాల ఉమ్మడి వారసత్వమని, తెలంగాణ భాషా సంస్కృతులను కించపరిస్తే సహించే ప్రసక్తి లేదని కోస్తాంద్ర సినీ పెట్టుబడిదారులను ఈ సందర్భంగా మేం హెచ్చరిస్తున్నాం.

- తెలంగాణ రచయితల వేదిక తేది 4.6.2007

హైదరాబాద్‌లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బెంగాలి (బంగ్లాదేశ్‌) రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై మజ్లిస్‌ ఎమ్మెల్యేల అమానుషదాడిని తెలంగాణ రచయితల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. బంగ్లాదేశ్‌లో మెజారిటి ఫాసిస్టు మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ‘లజ్జ’ లాంటి నవలలు రాసినందుకు బంగ్లాదేశ్‌ ఇస్లామిక్‌ మతోన్మాదం తస్లీమాను దేశ బహిష్కరణకు గురిచేసింది. ఇక్కడ భారతదేశంలో ఫాసిస్టు హిందూ మతోన్మాదాన్ని లౌకిక ప్రజాస్వామిక శక్తులన్నీ ఐక్యంగా ఎదుర్కోవల్సిన ఈ సందర్భంలో మజ్లిస్‌ ఇటువంటి మతోన్మాద దాడులకు పాల్పడడం అమానుషం. ఇది రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులను, లౌకిక వాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. లజ్జతో తలదించేసుకోవాల్సిన ఈ చర్య హైదరాబాదీ ‘తహజీబ్‌’కు, తెలంగాణ సహనశీల సంస్కృతికి వ్యతిరేకం. దేశంలో ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్యతకు ఇటువంటి మతోన్మాదదాడులు భంగం కలుగజేస్తాయని మజ్లిస్‌కు మేం హెచ్చరిస్తున్నాం.

‘నీ అభిప్రాయాలతో నేను విభేదిస్తున్నప్పటికీ నీ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం ప్రాణం అర్పిస్తాను’ అన్నది ఇవ్వాల్టి ప్రజాస్వామిక యుగంలో మనందరి ఆదర్శం కావాలని వేదిక భావిస్తున్నది. ఈ దాడి తస్లీమా భావప్రకటనా స్వేచ్ఛమీద జర్గిన దాడిగా భావిస్తూ ఆమెకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. తస్లీమాపై దాడికి పాల్పడిన దుండగులపై చట్ట ప్రకారం ప్రాసిక్యూట్‌ చెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నాం. రాష్ట్రంలో లౌకిక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

- తెలంగాణ రచయితల వేదిక, తేది 9.8.2007