SOYI
జానపదం
		<description>-గట్టు వెంకట్రావ్‌
ఎన్నియ్యలో... ఎన్నియ్యలో...
ఎన్నినాల్ల కచ్చిందమ్మా అందాల చందాల 		||ఎన్నియ్యలో||
నెత్తిమీద కడవ పెట్టి కొంగు నేమో నడముకుజుట్టీ
చేతిలో కొడవలి పట్టి- పొలముగొయ్య పోతాఉంటే
సుక్కల్ల చంద్రుడే నిన్నూ చూసి కన్నేకొట్టే		||ఎన్నియ్యలో||
పరిమోపు ఎత్తుకొని అడుగెనుక అడుగేసి
పాటపాడుకుంటు నువ్వు పొలము గట్టు దాటుతుంటే
నీపాటే వింటు కోయిలమ్మ, 
పాట మరిచిపాయే		||ఎన్నియ్యలో||
సంధ్యవేల కాబట్టే నా మనుసు నిలువదాయే
కలిసిపోయి నా మనసూ ఆగమయి పోవట్టే
ముందునిన్నుచూసి నీ అందమంతవిందామే.	||ఎన్నియ్యలో||
తెలంగాణ జాతర
		<description>-రేగులపాటి కిషన్‌రావు
జాతర ఇది జాతర
తెలంగాణ జాతర
ఊరూరి జనంతోటి
సాగిపోవు జాతర	||జాతర||
చదువు బాగరావాలని
చల్లంగా ఉండాలని
కోరచేరవచ్చినట్టి
పిల్లవాండ్ల జాతర	||జాతర||
కొడుకు ఒకడు కావాలని
ఆడబిడ్డ కలగాలని
కోరచేరవచ్చినట్టి
ఆలుమగల జాతర	||జాతర||
రోగాలూ రావద్దని
బాధలన్ని తొలగాలని
కోరచేరవచ్చినట్టి
ముసలివాళ్ల జాతర	||జాతర||
పంటబాగ పండాలని
పాడి ఇంట ఉండాలని
కోరచేరవచ్చినట్టి
రైతన్నల జాతర	||జాతర||
బేహారం బాగసాగి
లాభాలూ కురువాలని
కోరచేర వచ్చినట్టి
వ్యాపారుల జాతర	||జాతర||
చక్కనైన చుక్కలనూ
చూడ చూడవచ్చినోళ్ల
సొగసుగాళ్ల అందాలను 
చూచి మురవ వచ్చినోళ్ల	||జాతర||
కోడికూర గొర్రెకూర
కొనీ తినే వారి కొరకు
సినిమాలు సర్కసులూ
చూచి మురియు వారి కొరకు ||జాతర||	
జాతర ఇది జాతర
స్వామి వారి జాతర
ఊరూరి జనంతోటి
సాగిపోవు జాతర	||జాతర||
పోరు బైలెల్లింది
		<description>- నల్లెల్ల రాజయ్య
మనసు మనసు గల్సి మాటలాడుకోని
గుండె గుండె కల్పి ఊసులాడుకోని
పోరూ బైల్లిందిర తమ్ముడా
అది హోరెత్తి పోతుందే చెల్లాలా ||పోరూ||
ఊరూ వాడా కల్సి ఉగ్రరూపం దాల్చి
ఉరిమినా మబ్బులవోలె ఉరుకుల పరుగులతోటి
ఊరూరు దాటిందిర తమ్ముడా
ఊర్ల పొలిమేరలు దాటిందే తమ్ముడా
ఊర్ల పొలిమేరలు దాటించే చెల్లెలా||పోరూ||
మండలాలు దాటి జిల్లాలుకు చేరింది
జిల్లాల్లో జనమంతా హారతులు పట్టి (నీరాజనమీయంగ)
జైతెలంగాణయని జేజేలు కొట్టంగ
జిల్లాలు దాటిందిర తమ్ముడా
గోల్కొండ ఖిల్లాకే చేరిందే చెల్లెలా ||పోరూ||
నిలువ నీడాలేని నిరుపేద జనమంతా
కూడు, గుడ్డా దొరకని ...</description>
తెలంగానం
		<description>- పిట్టా సాంబయ్య
తెలంగాణ తెలంగాణ
తెలంగాణ తెలంగాణ
తెలంగాణా పాట పాడరో ఓ అక్కల్లారా
తెలంగాణా ఆట ఆడరో ఓ అన్నలారా ||తెలంగాణ||
గునుగూ తంగేడు పూలు అల్లిపూలు మల్లెపూలు
కట్ల పూలు ఎన్నో దెచ్చి కట్లు కట్లుగా పేర్చి
గౌరమ్మను మధ్యబెట్టరో ఓ అమ్మల్లారా
బతుకమ్మను ఆడరాండిరో ఓ చెల్లెల్లారా ||తెలంగాణ||
కాముని జాజిరి పాటలు కోలాటం ఆటలు
రోటికాడ నాటుకాడ మోటకాడ తోటకాడ
ఉయ్యాల పాట పాడరో ఓ అక్కల్లారా
కప్పతల్లి ఆట ఆడరో ఓ అన్నలారా ||తెలంగాణ||
పీరీల పండుగకు గుండం చుట్టూ ...</description>
సాధించి తీరాలి మన తెలంగాణ
		<description>- సి. హెచ్‌. రమణాచారి
కష్టాల కడలిలో నా తెలంగాణ
కన్నీటి కెరటమే నా తెలంగాణ
వలస దోపిడిలోన నా తెలంగాణ
తీగ తెగినా వీణ నా తెలంగాణ ||తెలంగాణ||
భాష మనదీ గాదు-యాసమనదీ గాదు
మన మాట మన పాట ఎక్కిరింతయిపోయె
చదువు పుస్తకాల్ల మనమాట కరువాయె
సొంత కొంపలోనె పరాయి బ్రతుకాయె
సినిమా ఆటల్లోన - నా తెలంగాణా
విలను మాటయ్యింది- ||తెలంగాణ||
వీధి నాటకాలు, చిందు బాగోతాలు
ఒగ్గు కథలూ గొల్లసుద్దులూ మాయమై
వలస సంస్కృతి దాడి వరదలా ముంచంగ
కళలన్నీ కళదప్పి - పల్లె ...</description>
ఏకు - మేకు
		<description>-నల్ల భూమయ్య
మా ఊర్లె మేం సిన్నగున్నప్పటి సందే సిటీ మున్సిపాలిటి ఉండేటిది. మా వూర్లె కంపిన్ల ఆఫీసర్ల పోరగండ్లకోసం యింగ్లీషు మీడియం బడి, కంపినోని మనుసుల పొరగండ్ల కోసం హిందీ మీడియం బడి వుండేవి. మాది సర్కారు బడి, గిదీంట్ల తెలుగు, తురుకం మీడియంలు వుండేటియి.
ఏ గోంతమందో పల్లెల్లల్ల కెల్లి అచ్చే పోరగండ్లు తప్పిస్తె కడుమ అందరు గూడ నగురంల పుట్టి పెరిగి నోళ్ళు, ఏరే ఏరే ‘దేశాల’ నుంచి, ...</description>
పొద్దుమూకినంక
		<description>-భూపాల్‌
మెడికల్‌ కాలేజీ ముందలి సందుల బస్సు దిగింది పుష్పలత. ఆడికెళ్లి నడుచుకుంట కోఠి ఆంధ్ర బేంకు కాడికొచ్చి ఎవర్నో టైం అడిగితే ఆరున్నర అన్నరు. ఉప్పల్‌ నుంచి కోఠి కాడికొస్తందుకు రెండున్నర గంటలైంది. ఆమె భర్త ఆరున్నర ఏడునడుమ ఈడనే కలుస్తనన్నడు. ఒక గంట మొదాలొచ్చి గాజులు, టిక్లీ బొట్లు, చిన్న స్టీలు టిఫిన్‌ బాక్సు కొందామనుకుంది. బస్సు లేటుగొచ్చుడు తోటి ఇగ అవి గొనే టైం లేదనుకుంది. భర్త ...</description>
కేసు
		<description>-వేణు సంకోజు
అందరూ అవాక్కయి వున్నారు.
అందరి ముఖాల్లోనూ ఒక పెద్ద విషాదఛ్చాయ.
‘మళ్ళీ ఏమై ఉంటుందా’ - అనుకుంటూ! వినకూడనిదేదో వినవలసి వస్తుందనుకుంటూ భయపడసాగింది సీతమ్మ.
ఫోను రిసీవరు పెట్టేసి మౌనంగా కూర్చున్నాడు పఠాభి.
సుధ కూడ ఏదో శంకిస్తూ, ఫోను ‘తన అత్తగారింటి వద్దనుండే కావచ్చుననుకుంటూనే అడిగింది - “ఎక్కడినుండి నాన్నా ఫోను?” ‘తనే చేశాడా?’ అని కూడ అడిగింది.
మౌనంగానే ఔనన్నట్టుగా తలూపాడు పఠాభి. అతని మౌనంతో సముద్రాలంతటి ఘోష. తుఫాన్లంతటి అలజడి, ప్రపంచయుద్ధాల్లోని ...</description>
బతుకు
		<description>-బి.వేణుగోపాల్‌
చిగురులు తొడిగిన అడివి పచ్చగా కళకళలాడుతున్నది. గ్రీష్మ తాపాన్ని తీర్చడానికి వసంతం హరితాన్ని పులిమి వెళ్ళినట్లున్నది. సూర్యుడు నడినెత్తి మీదున్నడు.అప్పటి వరకు విస్తరించిన చెట్ల నీడ చెట్టు మొదలువరకే వచ్చింది. బుగబుగమని మండుతున్న ఎండను సైతం లెక్కచేయక అడవితో యుద్ధానికి వచ్చినట్లు తునికి పొదలను వెతుక్కున్న గుంపు అటు ఇటు కదలాడతున్నది. చిన్న,పెద్ద తేడా లేకుండా తునికాకు (చుట్టాకు) లను టిక్‌ టిక్‌ మని తెంపుతున్నారు.కాళ్ళు చేతులు యంత్రంలా ఆడుతున్నాయి.
ఎండకు ...</description>
పతిక్రా పక్రటనలు
		<description>పోసాని మురళీ కృష్ణ దర్శకత్వంలో “ఆపరేషన్‌ దుర్యోధన” చిత్రంలో తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను, సంస్కృతిని కించపరుస్తూ, అవహేళన చేస్తూ సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రా సినీ పెట్టుబడిదారుల దురంహకారానికి ఈ సంభాషణలు, సన్నివేశాలు నిదర్శనాలు. ఈ దురంహాకార పూరిత వైఖరిని తెలంగాణ రచయితల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.
తెలంగాణ ప్రజలను, సంస్కృతిని, ఉద్యమాన్ని కించపరస్తున్న సన్నివేశాలను, సంభాషణలను వెంటన్‌ చిత్రంలోంచి తొలగించవలసిందిగా “దుర్యోధన” నిర్మాత, దర్శకులను డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ...</description>